సెంచరీ కోసం అంతలా పరితపించడానికి కారణం చెప్పిన కోహ్లీ

  • Author Soma Sekhar Updated - 08:11 PM, Fri - 20 October 23

బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ తన శతకంపై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ ప్రత్యేకమైనదనే చెప్పాలి. అయితే మ్యాచ్ అనంతరం కోహ్లీ తన శతకంపై చేసిన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ వైరల్ గా మారాయి.

  • Author Soma Sekhar Updated - 08:11 PM, Fri - 20 October 23

విరాట్ కోహ్లీ.. ప్రస్తుతం వరల్డ్ క్రికెట్ జపిస్తున్న పేరు. దానికి కారణం అతడు సాధిస్తున్న రికార్డులే. ఇక తాజాగా వరల్డ్ కప్ 2023లో భాగంగా బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో అజేయ శతకంతో చెలరేగాడు కింగ్ విరాట్ కోహ్లీ. బంగ్లా బౌలర్లను సమన్వయంతో ఎదుర్కొంటూ.. 97 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లతో 103 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అయితే అసలు విరాట్ ఈ మ్యాచ్ లో సెంచరీ సాధిస్తాడని ఎవరూ ఊహించి ఉండరు. దానికి కారణం అతడు 74 పరుగులతో ఉన్నప్పుడు.. జట్టు విజయానికి ఇంకా కావాల్సింది 26 పరుగులే. దీంతో అతడి శతకానికి దారులు మూసుకుపోయాయి అని అందరూ అనుకున్నారు. కానీ కేఎల్ రాహుల్, అంపైర్ సహకారంతో తన సెంచరీని పూర్తిచేశాడు రన్ మెషిన్. కాగా.. మ్యాచ్ అనంతరం తన సెంచరీపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు విరాట్.

బంగ్లాదేశ్ పై విరాట్ కోహ్లీ సాధించిన సెంచరీ ప్రత్యేకమైనది. ఆ విషయం మనందరికి తెలిసిందే. అక్కడ స్పేస్ లేదు క్రియేట్ చేసుకున్నాడు అన్న డైలాగ్ ను.. అక్కడ రన్స్ లేవు.. క్రియేట్ చేసుకున్నాడు విరాట్ కోహ్లీ అని మార్చి చెప్పొచ్చు. ఇక ఈ శతకానికి కేఎల్ రాహుల్, అంపైర్ రిచర్డ్ తమ వంతుగా సాయం చేశారు. తొలుత సెంచరీ వద్దన్న కోహ్లీ.. ఆ తర్వాత రాహుల్ మాటతో శతకం సాధించాడు. అయితే మ్యాచ్ అనంతరం తాను సెంచరీ కోసం సాధించడానికి కారణం ఏంటో చెప్పుకొచ్చాడు. గత కొన్ని సంవత్సరాలుగా వరల్డ్ కప్ సెంచరీ కోసం వేచి చూస్తున్న విరాట్ కల ఈరోజు నెరవేరిందని చెప్పాలి.

ఈ క్రమంలోనే మూడో వరల్డ్ కప్ ఆడుతున్న కోహ్లీ.. ప్రపంచ కప్ లో సెంచరీ చేసి 8 సంవత్సరాలు అవుతుంది. ఆ కోరికను తాజా మ్యాచ్ లో తీర్చుకున్నాడు రికార్డుల రారాజు. ఇక మ్యాచ్ అనంతరం కోహ్లీ తన సెంచరీపై మాట్లాడుతూ..”జట్టు విజయాల్లో నేనెప్పుడు కీలకపాత్ర పోషించాలని భావిస్తుంటాను. ఇక గత వరల్డ్ కప్స్ లో నేను కొన్ని అర్ధశతకాలు చేసినప్పటికీ.. వాటిని సెంచరీలుగా మలచలేకపోయాను. దీంతో ఈసారైనా.. సెంచరీ చేసి మ్యాచ్ ను ముగించాలని అనుకున్నాను” అని విరాట్ కోహ్లీ చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్న విరాట్ నుంచి వరల్డ్ కప్ లో మరిన్ని అద్భుత ఇన్నింగ్స్ లు చూడొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. మరి సెంచరీపై విరాట్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments