Nidhan
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే దీనిపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ టీ20ల్లోకి రీఎంట్రీ ఇచ్చాడు. అయితే దీనిపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ షాకింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ గురించి స్పెషల్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అద్భుతమైన బ్యాటింగ్ స్కిల్స్‌తో కోట్లాది మంది అభిమానాన్ని చూరగొన్నాడు విరాట్. 15 సంవత్సరాలుగా కంటిన్యూగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రస్తుత క్రికెట్లో నంబర్ వన్ ప్లేయర్‌గా నిలిచాడు. బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ నెలకొల్పిన చాలా రికార్డులను బ్రేక్ చేసి మోడ్రన్ మాస్టర్‌గా పేరు తెచ్చుకున్నాడు. గతేడాది నుంచి అన్ని ఫార్మాట్లలోనూ మరింత చెలరేగి ఆడుతున్నాడు కింగ్ కోహ్లీ. వన్డే వరల్డ్ కప్-2023లోనూ బ్యాట్‌తో దుమ్మురేపాడు. రీసెంట్గా జరిగిన సౌతాఫ్రికా టూర్లోనూ కోహ్లీ సత్తా చాటాడు. అయితే చాన్నాళ్లుగా టీ20లకు దూరంగా ఉంటున్న ఈ ప్లేయర్ వచ్చే టీ20 ప్రపంచ కప్‌లో ఆడతాడో లేదోననేది అనుమానంగా మారింది. కానీ త్వరలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరగబోయే టీ20 సిరీస్‌కు ప్రకటించిన జట్టులో విరాట్ కోహ్లీ చోటు దక్కించుకున్నాడు. అయితే దీనిపై బీసీసీఐ మాజీ బాస్ సౌరవ్ గంగూలీ వెరైటీగా రియాక్ట్ అయ్యాడు.
టీ20 వరల్డ్ కప్-2022 నుంచి పొట్టి ఫార్మాట్ మ్యాచ్‌లకు కోహ్లీ దూరంగా ఉంటున్నాడు. గతేడాది వన్డే ప్రపంచ కప్ ఉండటంతో టీ20ల్లో ఆడలేదు. అయితే ఈ ఏడాది జూన్‌లో టీ20 వరల్డ్ కప్ ఉండటంతో అతడు ఆడతాడో లేదోననే సందేహాలు ఏర్పడ్డాయి. అయితే ఆఫ్ఘాన్‌తో టీ20 సిరీస్‌కు కోహ్లీని సెలక్ట్ చేయడంతో ఈ అనుమానాలకు చెక్ పడింది. టీ20 వరల్డ్ కప్‌లో విరాట్‌తో పాటు రోహిత్ శర్మ ఆడతారని హింట్ ఇచ్చేశారు సెలక్టర్లు. ఈ విషయంపై బీసీసీఐ మాజీ బాస్ గంగూలీ స్పందించాడు. ‘టీ20 ప్రపంచ కప్‌లో భారత జట్టును రోహిత్ శర్మే కెప్టెన్‌గా ముందుండి నడిపిస్తాడు. కోహ్లీ కూడా మెగాటోర్నీలో తప్పకుండా బరిలోకి దిగుతాడు. విరాట్ ఔట్‌స్టాండింగ్ ప్లేయర్’ అని దాదా మెచ్చుకున్నాడు. వీళ్లిద్దరూ చాన్నాళ్ల తర్వాత టీ20ల్లో ఆడుతున్నారు కాబట్టి ఎలా పెర్ఫార్మ్ చేస్తారోననే డౌట్స్ పెట్టుకోవదన్నాడు. యంగ్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ ఆడుతున్న తీరు మీద గంగూలీ సంతృప్తి వ్యక్తం చేశాడు. అతడికి భవిష్యత్తులో మరిన్ని అవకాశాలు ఇవ్వాలన్నాడు.
సౌతాఫ్రికాతో జరిగిన రెండో టెస్ట్‌లో జైస్వాల్ బాగా ఆడాడని.. బ్యాటర్లకు ఛాలెంజ్ విసిరిన కేప్‌టౌన్ పిచ్‌పై అతడి బ్యాటింగ్ సూపర్ అన్నాడు గంగూలీ. ఇది కెరీర్ స్టార్టింగ్ మాత్రమేనని.. అతడికి ఫ్యూచర్లో మరిన్ని ఛాన్సులు వస్తాయన్నాడు దాదా. కోహ్లీ అద్భుతమైన ఆటగాడని.. అతడు కచ్చితంగా టీ20 వరల్డ్ కప్‌లో ఆడతాడని పేర్కొన్నాడు. అయితే అప్పట్లో విరాట్ కెప్టెన్సీ కాంట్రవర్సీ నేపథ్యంలో అతడికి, గంగూలీకి మధ్య సంబంధాలు దెబ్బతిన్నాయి. ఐపీఎల్ టైమ్‌లోనూ ఇద్దరికీ పడదనేది క్లియర్ అయింది. కానీ టీ20ల్లోకి కోహ్లీ రీఎంట్రీ ఇవ్వడంపై దాదా పాజిటివ్‌గా రియాక్ట్ అవడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ షాకవుతున్నారు. కోహ్లీ-గంగూలీ కలసిపోయారని.. వాళ్ల మధ్య సంబంధాలు మెరుగయ్యాయని చెప్పడానికి దాదా తాజా కామెంట్స్ ఉదాహరణ అని చెబుతున్నారు. మరి.. విరాట్ రీఎంట్రీని దాదా స్వాగతించడంపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: Ishan Kishan: పాపం ఇషాన్ కిషన్.. సెలక్టర్ల చేతిలో టాలెంటెడ్ ప్లేయర్ బలి!
Sourav Ganguly backs Virat Kohli for T20Is. pic.twitter.com/20TSfj3NWe
— CricTracker (@Cricketracker) January 7, 2024