Rohit Sharma: వీడియో: మ్యాచ్‌ మధ్యలో గ్రౌండ్‌లోనే రోహిత్ కాళ్లు మొక్కిన కోహ్లీ అభిమాని!

Rohit Sharma, India vs England: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి రోజు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విరాట్‌ కోహ్లీ అభిమాని వచ్చి రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కాడు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

Rohit Sharma, India vs England: భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్‌ తొలి రోజు ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది. విరాట్‌ కోహ్లీ అభిమాని వచ్చి రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కాడు. ఆ ఘటన గురించి పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌-ఇంగ్లండ్‌ మధ్య హైదరాబాద్‌ వేదికగా తొలి టెస్ట్‌ గురువారం ప్రారంభమైంది. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మకు ఒక ఊహించని సంఘటన ఎదురైంది. రోహిత్‌ శర్మ బ్యాటింగ్‌ చేసేందుకు క్రీజ్‌లోకి వచ్చిన సమయంలో.. ప్రేక్షకుల నుంచి ఓ అభిమాని గ్రౌండ్‌లోకి దూసుకొచ్చాడు. నేరుగా రోహిత్‌ శర్మ వద్దకు దూసుకొచ్చిన అతను వెళ్లి రోహిత్‌ కాళ్ల మీదపడ్డాడు. దీంతో రోహిత్‌ అతన్ని పైకి లేపి.. బయటికి వెళ్లాల్సిందిగా కోరాడు. అప్పటికే సెక్యూరిటీ అక్కడికి చేరుకుని.. ఆ కుర్రాడిని గ్రౌండ్‌ బయటికి తీసుకెళ్లారు.

అయితే.. ఇందులో మరో ఆసక్తికర విషయం ఏంటంటే.. రోహిత్‌ శర్మ కాళ్లు మొక్కింది విరాట్‌ కోహ్లీ అభిమానిగా తెలుస్తోంది. రోహిత్‌ కాళ్లు మొక్కిన కుర్రాడు విరాట్‌ పేరుతో 18వ నంబర్‌ జెర్సీని ధరించి ఉన్నాడు. దీంతో అతను విరాట్‌ అభిమాని అయి ఉంటాడని క్రికెట్‌ అభిమానులు భావిస్తున్నారు. మరి కోహ్లీ అభిమాని అయి ఉండి.. రోహిత్‌ కాళ్లు ఎందుకు మొక్కాడా? అని కూడా ఫ్యాన్స్‌ ఆశ్చర్యానికి గురి అవుతున్నారు. రోహిత్‌ అయినా, కోహ్లీ అయినా ఇండియా కోసమే కదా ఆడేది.. ఇద్దరిలో ఎవరిని అభిమానిస్తే ఏముందిలే అంటూ మరికొంతమంది కామెంట్‌ చేస్తున్నారు.

కాగా, కోహ్లీ, రోహిత్‌ ఇద్దరూ ఇండియన్‌ క్రికెట్‌లో స్టార్‌ క్రికెటర్లు అయితే కొంతమంది వీరి అభిమానులు సోషల్‌ మీడియాలో ఫ్యాన్‌వార్‌కు దిగుతుంటారు. తమ అభిమాన ఆటగాడు తోపంటే.. లేదు తమ అభిమాని ఆటగాడు తోపంటూ గొడవకు దిగుతుంటారు. టీమ్‌లో రోహిత్‌-కోహ్లీ బెస్ట్‌ ఫ్రెండ్స్‌లా ఉన్న వారిద్దరి అభిమానుల మధ్య అప్పుడప్పుడు ఫ్యాన్స్‌ వార్స్‌ జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలోనే కోహ్లీ జెర్సీతో ఉన్న కుర్రాడు రోహిత్‌ కాళ్లు మొక్కడం విశేషంగా మారింది. కాగా, వ్యక్తిగత కారణాలతో కోహ్లీ తొలి రెండు టెస్టులకు దూరంగా ఉన్న విషయం తెలిసిందే. ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. గురువారం ప్రారంభమైన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ను భారత బౌలర్లు 246 పరుగులకే ఆలౌట్‌ చేశారు. మరి ఈ మ్యాచ్‌లో విరాట్‌ కోహ్లీ అభిమాని రోహిత్‌ కాళ్లు మొక్కడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments