Pandya Brothers: రూ. 4 కోట్ల మోసంపై ఎట్టకేలకు నోరు విప్పిన వైభవ్ పాండ్యా!

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలను రూ. 4.3 కోట్లు మోసం చేసిన కేసులో ఎట్టకేలకు స్పందించాడు వైభవ్ పాండ్యా. పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలను రూ. 4.3 కోట్లు మోసం చేసిన కేసులో ఎట్టకేలకు స్పందించాడు వైభవ్ పాండ్యా. పూర్తి వివరాల్లోకి వెళితే..

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యాలు తమను తమ సోదరుడు వైభవ్ పాండ్యా మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న ముంబై పోలీసులు అతడిని ఇటీవలే అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పాండ్యా సోదరులను వైభవ్ రూ. 4.3 కోట్ల మేర మోసం చేశాడన్న కేసులో అతడు అరెస్ట్ అయ్యాడు. అయితే ఈ విషయంపై ఎట్టకేలకు నోరు విప్పాడు వైభవ్ పాండ్యా. అతడేమన్నాడంటే?

హార్దిక్ పాండ్యా, కృనాల్ పాండ్యా, వైభవ్ పాండ్యాలు ముగ్గురూ కలిసి ఓ బిజినెస్ ను ప్రారంభించారు. పాండ్యా సోదరులకు 40 శాతం చొప్పున, వైభవ్ 20 శాతం చొప్పున పెట్టుబడిపెట్టారు. అయితే పాండ్యా సోదరు క్రికెట్ పై తమ దృష్టిని పెట్టడంతో.. వైభవ్ తన వక్రబుద్ధిని చూపించాడు. తన సోదరులకు తెలియకుండా వైభవ్ రూ. 4.3 కోట్లను తన సొంత వ్యాపారానికి మళ్లించుకున్నాడు. దీంతో సంస్థ నష్టాల్లోకి రావడంతో.. లెక్కలు పరిశీలించగా.. అసలు విషయం బయటపడింది. దీంతో వైభవ్ పాండ్యా మోసం చేశాడని గ్రహించిన పాండ్యా సోదరులు అతడిపై చీటింగ్, ఫోర్జరీ కేసులు పెట్టారు. అయితే ఈ కేసులో శుక్రవారం(ఏప్రిల్ 12) ముంబై కోర్టుకు హాజరైయ్యాడు. ఈ క్రమంలో వైభవ్ నోరు విప్పాడు.

వైభవ్ పాండ్యా మాట్లాడుతూ.. “ఇది తమ కుటుంబానికి సంబంధించిన విషయం. ఇతరులు జోక్యం చేసుకోవద్దు. ఇక ఈ కేసులో నన్ను పూర్తిగా నా సోదరులు అపార్థం చేసుకున్నారు. మరిన్ని విషయాలను త్వరలోనే వెల్లడిస్తాను” అని చెప్పుకొచ్చాడు. కోర్టు విచారణ తర్వాత వైభవ్ పాండ్యా కేసును పోలీసు కస్టడీని ఏప్రిల్ 16 వరకు పొడిగించారు. మరి ముగ్గురు కలిసి పెట్టిన వ్యాపారం నష్టాల్లో ఉండటం, వైభవ్ బిజినెస్ 20 నుంచి 33 శాతం లాభాల్లోకి వెల్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments