SNP
Babar Azam, Pakistan vs Canada, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో బాబర్ ఆజమ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. గెలిచినా ఓడినా అతనికి తిట్లు మాత్రం తప్పడం లేదు. తాజాగా మరోసారి పరువుతీసుకున్నాడు.. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
Babar Azam, Pakistan vs Canada, T20 World Cup 2024: టీ20 వరల్డ్ కప్ 2024లో బాబర్ ఆజమ్‌కు ఏదీ కలిసి రావడం లేదు. గెలిచినా ఓడినా అతనికి తిట్లు మాత్రం తప్పడం లేదు. తాజాగా మరోసారి పరువుతీసుకున్నాడు.. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
టీ20 వరల్డ్ కప్ 2024లో పాకిస్థాన్ ఎట్టకేలకు తొలి విజయం నమోదు చేసింది. మంగళవారం న్యూయార్క్‌లోని నసావు కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో పసికూన కెనడాతో జరిగిన మ్యాచ్‌లో పాక్ 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ వరల్డ్ కప్ టోర్నీలో ముందుకు వెళ్లాలంటే.. కచ్చితంగా గెలిచిన తీరాల్సిన మ్యాచ్‌లో గెలుపొంది.. సూపర్ 8 రేసులో నిలిచింది. అయితే.. ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ గెలిచినా.. ఆ జట్టు కెప్టెన్ బాబర ఆజమ్‌పై సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. చాలా కాలంగా టీ20ల్లో బాబర్ స్లోగా ఆడుతూ.. వన్డే, టెస్ట్ తరహా బ్యాటింగ్ చేస్తున్నాడనే విమర్శలు వస్తున్నాయి. ఇప్పుడు కెనడా లాంటి చిన్న టీమ్‌పై కూడా బాబర్ అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు.
కేవలం 107 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన పాకిస్థాన్.. ఈ సారి కొత్త ఓపెనింగ్ జోడీతో బరిలోకి దిగింది. ఫామ్‌లో ఉన్న మొహమ్మద్ రిజ్వాన్‌కు జోడీగా యువ క్రికెటర్ సైమ్ అయ్యూబ్ ఓపెనర్‌గా బరిలోకి దిగాడు. బాబర్ ఆజమ్ వన్‌డౌన్‌లో బ్యాటింగ్‌కు వచ్చాడు. రిజ్వాన్ ఈ మ్యాచ్‌లో హాఫ్ సెంచరీతో రాణించాడు. 53 బంతుల్లో 53 పరుగులు చేసి.. చివరి వరకు నాటౌట్‌గా నిలిచి గెలిపించాడు. అయితే.. కెప్టెన్ బాబర్ ఆజమ్ సైతం 33 బంతుల్లో 33 పరుగులు మాత్రమే చేశాడు. అందులో కేవలం ఒక్కటే ఫోర్, ఒకే ఒక సిక్స్ ఉంది. పాకిస్థాన్ యూఎస్‌ఏతో సూపర్ 8 స్పాట్ కోసం పోటీ పడుతున్న తరుణంలో వేగంగా మ్యాచ్ ముగించి రన్‌రేట్ పెంచుకోవాల్సిన పాకిస్థాన్.. ఇలా స్లోగా ఆడి ఏం ఉద్దరించాలని ఆ దేశ క్రికెట్ అభిమానులే విమర్శిస్తున్నారు.
ఈ విషయంలో బాబర్ ఆజమ్‌ను తిట్టిపోస్తున్నారు. కెనడా లాంటి పసికూన జట్టుపై వన్డే ఇన్నింగ్స్ ఆడి తన ప్రతాపం చూపించాడంటూ ట్రోల్ చేస్తున్నారు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన కెనడా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 106 పరుగులు చేసింది. ఓపెనర్ ఆరోన్ జాన్సన్ 44 బంతుల్లో 4 ఫోర్లు, 4 సిక్సులతో 52 పరుగులు చేసి కెనడా ఇన్నింగ్స్‌లో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా పెద్దగా రాణించలేదు. పాక్ బౌలర్లలో ఆమీర్, హరీస్ రౌఫ్ రెండేసి వికెట్లు పడగొట్టారు. ఇక ఛేజింగ్‌కు దిగిన పాకిస్థాన్ 17.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 107 పరుగులు చేసి గెలిచింది.. రిజ్వాన్ 53, బాబర్ 33 పరుగులు చేశారు. మరి ఈ మ్యాచ్‌లో పాక్ స్టార్ బ్యాటర్ల స్లో బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
“Babar Babar” in New York as usual but some social media merchants think he lost the fans!!! 😭🤣#BabarAzam | #PakvsCan pic.twitter.com/IEaxXTDC4R
— INAYAT⁵⁶ 🆇 (@definitely_56_) June 11, 2024