Cricket News: 2023లో పరుగుల వరద పారించిన వీరులు వీళ్లే! టాప్‌లో ముగ్గురు భారత ఆటగాళ్లు

2023 ఏడాదిలో మెగా టోర్నీ వన్డే వరల్డ్‌ కప్‌ జరిగింది. ఈ వరల్డ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడినా ఫైనల్లో గెలిచి ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 2023 అంటే అందరికి వరల్డ్‌కప్‌ గుర్తుకువస్తుంది. కానీ, ఒక్క వన్డేలోనే కాదు టెస్టులు, టీ20ల్లో టాప్‌లో నిలిచిన బ్యాటర్ల లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

2023 ఏడాదిలో మెగా టోర్నీ వన్డే వరల్డ్‌ కప్‌ జరిగింది. ఈ వరల్డ్‌లో టీమిండియా అద్భుతంగా ఆడినా ఫైనల్లో గెలిచి ఆసీస్‌ ఛాంపియన్‌గా నిలిచింది. 2023 అంటే అందరికి వరల్డ్‌కప్‌ గుర్తుకువస్తుంది. కానీ, ఒక్క వన్డేలోనే కాదు టెస్టులు, టీ20ల్లో టాప్‌లో నిలిచిన బ్యాటర్ల లిస్ట్‌ను ఇప్పుడు చూద్దాం..

ఆదివారంతో 2023 ముగిసిపోతుంది. 2024 కొత్త ఏడాదికి అంతా స్వాగతం పలికేందుకు సిద్ధమయ్యారు. అయితే.. 2023లో వన్డే వరల్డ్‌ కప్‌ జరగడంతో క్రికెట్‌ ప్రపంచం ఆ మత్తులో ఊగిపోయింది. పైగా క్రికెట్‌ను మతంలా భావించే దేశం అయిన ఇండియాలో ఈ వరల్డ్‌ కప్‌ జరగడంతో మరింత మజా వచ్చింది. కానీ, టీమిండియా వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ ఓడిపోవడం వంద కోట్ల భారత క్రికెట్‌ అభిమానుల నిరాశపరిచే అంశమే అయినా.. మొత్తంగా క్రికెట్‌ను అంతా ఎంజాయ్‌ చేశారు. అయితే.. 2023లో ఒక్క వన్డేల్లోనే కాక టెస్టులు, టీ20ల్లోనూ క్రికెటర్లు అదరగొట్టారు. మరి ఏడాది ముగింపు సందర్భంగా 2023కి టాప్‌లో నిలిచిన ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం. టెస్టులు, వన్డేలు, టీ20ల్లో అత్యధిక పరుగులు చేసిన టాప్‌ 10 బ్యాటర్ల లిస్ట్‌ ఇలా ఉంది..

టెస్ట్‌ క్రికెట్‌లో టాప్‌ 10 బ్యాటర్లు

  • నంబర్‌ 10 – కరుణరత్నే(శ్రీలంక) 6 మ్యాచ్‌ల్లో 608 పరుగులు
  • నంబర్‌ 9 – బెన్ డకెట్(ఇంగ్లండ్‌) 8 మ్యాచ్‌ల్లో 654 రన్స్‌
  • నంబర్‌ 8 – విరాట్‌ కోహ్లీ(ఇండియా) 8 మ్యాచ్‌ల్లో 671 పరుగులు
  • నంబర్‌ 7- కేన్‌ విలియమ్సన్‌(న్యూజిలాండ్‌) 7 మ్యాచ్‌ల్లో 695 పరుగులు
  • నంబర్‌ 6 – హ్యారీ బ్రూక్‌(ఇంగ్లండ్‌) 8 మ్యాచ్‌ల్లో 701 రన్స్‌
  • నంబర్‌ 5 – జో రూట్‌(ఇంగ్లండ్‌) 8 మ్యాచ్‌ల్లో 787 పరుగులు
  • నంబర్‌ 4 – మార్నస్‌ లబుషేన్‌(ఆస్ట్రేలియా) 13 మ్యాచ్‌ల్లో 803 పరుగులు
  • నంబర్‌ 3 – ట్రావిస్‌ హెడ్‌(ఆస్ట్రేలియా) 12 మ్యాచ్‌ల్లో 919 రన్స్‌
  • నంబర్‌ 2 – స్టీవ్‌ స్మిత్‌(ఆస్ట్రేలియా) 13 మ్యాచ్‌ల్లో 929 పరుగులు
  • నంబర్‌ 1 – ఉస్మాన్‌ ఖవాజా(ఆస్ట్రేలియా) 13 మ్యాచ్‌ల్లో 1210 రన్స్‌

వన్డేల్లో టాప్‌ 10 బ్యాటర్లు వీరే

  • నంబర్‌ 10 – విల్‌ యంగ్‌(న్యూజిలాండ్‌) 23 మ్యాచ్‌ల్లో 1004 పరుగులు, సెంచరీ-1
  • నంబర్‌ 9 – మొహమ్మద్‌ రిజ్వాన్‌(పాకిస్థాన్‌) 25 మ్యాచ్‌ల్లో 1023 రన్స్‌, సెంచరీ-1
  • నంబర్‌ 8 – ఎడియన్‌ మర్కరమ్‌(సౌతాఫ్రికా) 24 మ్యాచ్‌ల్లో 1033 పరుగులు, 3 సెంచరీలు
  • నంబర్‌ 7- కేఎల్‌ రాహుల్‌(ఇండియా) 27 మ్యాచ్‌ల్లో 1060 పరుగులు, 2 సెంచరీలు
  • నంబర్‌ 6 – బాబర్‌ అజమ్‌(పాకిస్థాన్‌) 25 మ్యాచ్‌ల్లో 1065 రన్స్, 2 సెంచరీలు‌
  • నంబర్‌ 5 – పథుమ్‌ నిస్సంకా(శ్రీలంక) 29 మ్యాచ్‌ల్లో 1151 పరుగులు, సెంచరీలు 2
  • నంబర్‌ 4 – డారిల్‌ మిచెల్‌(న్యూజిలాండ్‌) 26 మ్యాచ్‌ల్లో 1204 పరుగులు, సెంచరీలు 5
  • నంబర్‌ 3 – రోహిత్‌ శర్మ(ఇండియా) 27 మ్యాచ్‌ల్లో 1255 రన్స్, సెంచరీలు 2‌
  • నంబర్‌ 2 – విరాట్‌ కోహ్లీ(ఇండియా) 27 మ్యాచ్‌ల్లో 1377 పరుగులు, సెంచరీలు 6
  • నంబర్‌ 1 – శుబ్‌మన్‌ గిల్‌ 29 మ్యాచ్‌ల్లో 1584 రన్స్, సెంచరీలు 5‌

టీ20ల్లో టాప్‌ 10 బ్యాటర్లు వీళ్లే!

  • నంబర్‌ 10 – సికందర్‌ రజా(జింబాబ్వే) 12 మ్యాచ్‌ల్లో 514 పరుగులు
  • నంబర్‌ 9 – కమౌ లెవెరోక్(బెర్మోడా) 11 మ్యాచ్‌ల్లో 525 రన్స్‌
  • నంబర్‌ 8 – కాలిన్స్ ఒబుయా(కెన్యా) 20 మ్యాచ్‌ల్లో 557 పరుగులు
  • నంబర్‌ 7- సయ్యద్‌ అజీజ్‌(మలేషియా) 21 మ్యాచ్‌ల్లో 559 పరుగులు
  • నంబర్‌ 6 – మార్క్ చాప్మన్(న్యూజిలాండ్‌) 21 మ్యాచ్‌ల్లో 576 రన్స్‌
  • నంబర్‌ 5 – వీరందీప్ సింగ్(మలేషియా) 21 మ్యాచ్‌ల్లో 665 పరుగులు
  • నంబర్‌ 4 – సైమన్ స్సేసాజీ(ఉగాండ) 33 మ్యాచ్‌ల్లో 725 పరుగులు
  • నంబర్‌ 3 – సూర్యకుమార్‌ యాదవ్‌(ఇండియా) 18 మ్యాచ్‌ల్లో 733 రన్స్‌
  • నంబర్‌ 2 – రోజర్‌ ముకాస(ఉగాండ) 31 మ్యాచ్‌ల్లో 738 పరుగులు
  • నంబర్‌ 1 – మొహమ్మద్‌ వసీమ్‌(యూఏఈ) 22 మ్యాచ్‌ల్లో 810 రన్స్‌
Show comments