Nidhan
టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మెగాటోర్నీకి ముందు ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీసే పొట్టి ఫార్మాట్లో భారత్‌కు చివరిది కానుంది. ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్లేయర్‌ను నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైంది.
టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతోంది. మెగాటోర్నీకి ముందు ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే మూడు టీ20ల సిరీసే పొట్టి ఫార్మాట్లో భారత్‌కు చివరిది కానుంది. ఆ తర్వాత ఐపీఎల్ స్టార్ట్ అవుతుంది. ఈ నేపథ్యంలో ఒక ప్లేయర్‌ను నిద్రలేపాల్సిన సమయం ఆసన్నమైంది.
Nidhan
వన్డే వరల్డ్ కప్ డ్రీమ్ చెదిరిపోయింది. మూడోమారు ప్రపంచ కప్‌ను ఒడిసి పట్టుకుంటారని అనుకుంటే దాన్ని మిస్ చేసుకున్నారు. గతేడాది స్వదేశంలో జరిగిన వరల్డ్ కప్ ఫైనల్లో ఓడింది భారత్. కప్పు సాధించాలనే కల తృటిలో చేజారింది. దీంతో టీమిండియా ప్లేయర్లతో పాటు కోట్లాది మంది భారతీయులు కూడా తీవ్ర నిరాశకు లోనయ్యారు. చేతికి అందినట్లే అంది కప్పు మిస్సవడంతో ఆ బాధలో నుంచి బయటకు వచ్చేందుకు క్రికెటర్లు చాలా టైమ్ తీసుకున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి వాళ్లయితే చాన్నాళ్ల వరకు పబ్లిక్‌లో ఎక్కడా కనిపించలేదు. ఇప్పుడిప్పుడే అందులో నుంచి బయటకు వస్తున్నారు. సౌతాఫ్రికా టూర్ వాళ్లు మళ్లీ నార్మల్ అయ్యేందుకు ఎంతో ఉపయోగపడింది. అయితే రిలాక్స్ అయ్యేందుకు టైమ్ లేదు. వరల్డ్ కప్ డ్రీమ్‌ను నెరవేర్చుకునేందుకు మరో మంచి ఛాన్స్. ఈ ఏడాది జూన్‌లో టీ20 ప్రపంచ కప్ జరగనుంది. అయితే ఇందులో నెగ్గాలాంటే నిద్రపోతున్న ఓ ప్లేయర్‌ను మేల్కొల్పాల్సిన అవసరం ఉంది.
టీ20 వరల్డ్ కప్‌కు టైమ్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఒక క్రికెటర్‌ను నిద్రలేపాల్సిన తరుణం వచ్చేసింది. ఆ ప్లేయర్ మరెవరో కాదు.. వాషింగ్టన్ సుందర్. ఇతడు పెద్ద స్టార్ కూడా కాదు.. అలాంటప్పుడు ఎందుకు హైప్ ఇవ్వడమని అనుకుంటున్నారా? స్టార్ ప్లేయర్ కాకపోయినా టీమ్‌కు బ్యాలెన్స్ తీసుకురావడంలో సుందర్ ఎంతో కీలకం అవుతాడు. అతడి ఆల్‌రౌండర్ ఎబిలిటీస్ జట్టుకు ఎంతో ఉపయోగపడతాయి. బ్యాటర్లతో నిండిన స్క్వాడ్‌లో సమతూకం తీసుకురావాలంటే సుందర్ లాంటి ఆల్‌రౌండర్ చాలా అవసరం. రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్ రూపంలో ఆల్రెడీ స్పిన్ ఆల్‌రౌండర్లు ఉన్నారని అనుకోవచ్చు. కానీ వాళ్లిద్దరితో పోల్చుకుంటే బ్యాటింగ్‌లో సుందర్ కన్సిస్టెంట్గా రాణించడం ప్లస్ పాయింట్. తన ఆఫ్ స్పిన్ బౌలింగ్‌తో లెఫ్టాండ్ బ్యాటర్లను అతడు ముప్పుతిప్పలు పెట్టగలడు. బ్యాటింగ్‌లో భారీ షాట్స్ ఆడటంతో పాటు అవసరాన్ని బట్టి డిఫెన్స్ చేసే ఎబిలిటీస్ సుందర్‌కు ఉన్నాయి. అలాంటోడ్ని టీమిండియా సరిగ్గా వాడుకోవట్లేదనే విమర్శలు వస్తున్నాయి.
టీమ్ వెంటే ఉన్నా సుందర్‌కు అవకాశాలు రావడం లేదు. అతడ్ని బెంచ్ మీదే కూర్చోబెడుతున్నారు. వన్డే వరల్డ్ కప్ తర్వాత ఆస్ట్రేలియా, సౌతాఫ్రికాతో జరిగిన టీ20 సిరీస్‌లకు సుందర్‌ను సెలక్ట్ చేశారు. కానీ ఒక్క మ్యాచ్‌లోనూ ఆడించలేదు. దీంతో అతడు డల్ అయిపోయాడు. లెఫ్టాండ్ బ్యాటర్‌గా విలువైన రన్స్ చేయడంతో పాటు స్పిన్ బౌలింగ్‌తో కీలక వికెట్లు తీయగలడు. సీనియర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఎంట్రీ ఇస్తే మన టీ20 స్క్వాడ్‌లో టాప్-5లో అంతా బ్యాటర్లే ఉంటారు. వారిలో ఒక్కరు కూడా బౌలింగ్ చేయలేరు. కాబట్టి సుందర్‌ను త్వరలో ఆఫ్ఘానిస్థాన్‌తో జరిగే టీ20 సిరీస్‌లో ఆడించాలి. టీ20 వరల్డ్ కప్‌కు అతిథ్యం ఇస్తున్న కరీబియన్ పిచ్‌ల మీద అలాంటి ఆల్‌రౌండర్ అవసరం మనకు ఎంతగానో ఉంది. అతడికి వరుస అవకాశాలు ఇచ్చి జోష్ నింపాలి. టీమ్‌లో ప్లేస్ పక్కా అనే భరోసా ఇవ్వాలి. వరల్డ్ కప్ కొట్టాలంటే ఇలాంటి కీలక ప్లేయర్లను నిద్రలేపాల్సిన టైమ్ వచ్చేసిందని సోషల్ మీడియలో నెటిజన్స్ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సుందర్‌ను టీమ్ అవసరాలకు తగ్గట్లుగా వాడుకోవాలని సూచిస్తున్నారు. మరి.. సుందర్‌ను వరల్డ్ కప్ కోసం ప్రిపేర్ చేయాలనే డిమాండ్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: T20 World Cup 2024: కెప్టెన్ గా హార్దిక్ ఫొటో.. ఆ స్పోర్ట్స్ ఛానల్ పై ఫ్యాన్స్ ఫైర్