SNP
టీమిండియాకు ఈ వరల్డ్ కప్‌లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా అసలు బలం బయటపడనుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం
టీమిండియాకు ఈ వరల్డ్ కప్‌లో అసలు సిసలు పరీక్ష ఎదురుకానుంది. ఆదివారం న్యూజిలాండ్‌తో మ్యాచ్‌తో టీమిండియా అసలు బలం బయటపడనుంది. అయితే.. ఈ కీలక మ్యాచ్‌లో రెండు మార్పులతో భారత్ బరిలోకి దిగనున్నట్లు సమాచారం. మరి ఆ మార్పులేంటో ఇప్పుడు చూద్దాం
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో టీమిండియా సక్సెస్ ఫుల్ జర్నీని కొనసాగిస్తోంది. వరుసగా నాలుగుకి నాలుగు మ్యాచ్‌ల్లో గెలిచి.. మంచి పొజిషన్‌లో ఉంది. ఆ నాలుగు మ్యాచ్‌ల్లో రెండు వీక్ టీమ్స్‌తో ఆడి గెలిచినా.. మరో రెండు మ్యాచ్‌ల్లో ఆస్ట్రేలియా, పాకిస్థాన్ లాంటి పటిష్టమైన జట్లపై గెలిచింది. అయితే.. టీమిండియాకు అసలు సిసలైన అగ్నిపరీక్ష ఆదివారం ఎదురుకానుంది. ఈ టోర్నీలో ఇప్పటి వరకు రెండు జట్లు మాత్రం అన్‌బీటెన్‌గా ఉన్నాయి. వాటిలో టీమిండియా ఒకటైతే.. మరో జట్టు న్యూజిలాండ్. ఈ టోర్నీలో ఓటమి ఎరుగని జట్లుగా ఉన్న ఈ రెండు జట్లలో ఒక టీమ్‌కు తొలి ఓటమి ఎదురుకానుంది.
ఎందుకంటే.. ఈ రెండు అన్‌బీటెన్ టీమ్స్ ఆదివారం తలపడనున్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాల వేదికగా భారత్-న్యూజిలాండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్‌లోనే టీమిండియా అసలు బలం బయటపడుతుందని అంతా భావిస్తున్నారు. ఎందుకంటే.. వరల్డ్ కప్స్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా అంతగా బాలేదు. చాలా సార్లు వారిపై ఓటమే ఎదురైంది. ఈ సారి కూడా కివీస్ టీమ్ ఎంతో పటిష్టంగా ఉంది. నాలుగుకు నాలుగు మ్యాచ్‌లు గెలిచి.. టేబుల్ టాపర్‌గా ఉంది. అలాంటి జట్టును టీమిండియా ఓడిస్తే.. ఇక టోర్నీలో తిరుగుఉండదని ఫ్యాన్స్ అనుకుంటున్నారు. అందుకే ఈ మ్యాచ్‌పై ఎంతగానో ఆసక్తి చూపిస్తున్నారు.
అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగే అవకాశం ఉంది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో గాయపడిన ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకు న్యూజిలాండ్‌తో మ్యాచ్‌లో రెస్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే.. శార్దుల్ ఠాకూర్‌ను సైతం కివీస్‌తో మ్యాచ్‌లో పక్కనపెట్టనున్నట్లు సమాచారం. అయితే.. వీరిద్దరి స్థానంలో సూర్యకుమార్ యాదవ్, మొహమ్మద్ షమీ ప్లేయింగ్ ఎలెవన్‌లో ఉంటే అవకాశం ఉంది. కానీ, షమీని టీమ్‌లో ఆడించాలనే డిమాండ్ చాలా గట్టిగానే వినిపిస్తోంది. అయితే.. సూర్యను ఆడించడమే కాస్త విశేషంగా ఉంది. మరోవైపు న్యూజిలాండ్ సైతం కేన్ విలియమ్సన్ స్థానంలో టిమ్ సౌథీతో బరిలోకి దిగనుంది. విలియమ్సన్ గాయం నుంచి ఇంకా పూర్తి స్థాయిలో కోలుకోలేదని సమాచారం. మరి టీమిండియా రెండు మార్పులతో బరిలోకి దిగుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Shami & Suryakumar Yadav likely to replace Hardik & Thakur for the New Zealand match. [PTI] pic.twitter.com/HVz0lePW6E
— Johns. (@CricCrazyJohns) October 21, 2023
ఇదీ చదవండి: సంజూ శాంసన్ ధనాధన్ ఇన్నింగ్స్.. వారికి వార్నింగ్!