Nidhan
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. అలాంటోడు తాజాగా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
Nidhan
టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఏ విషయంలో అయినా ముక్కుసూటిగా ఉంటాడు. తన అభిప్రాయాలను కూడా నిక్కచ్చిగా చెప్పేస్తాడు. ఇటీవల ఇండియన్ ప్రీమియర్ లీగ్ గురించి అతడు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ఆర్టీఎం రూల్ వల్ల ఫ్రాంచైజీలకు మంచి జరుగుతోందని, కానీ ప్లేయర్లకు మాత్రం అన్యాయం జరుగుతోందని స్పష్టం చేశాడు. ఆర్టీఎం, రిటెన్షన్ ప్రాసెస్, రిటెయిన్ చేసుకునే ఆటగాళ్ల లిమిట్ వంటి అంశాలపై అతడు రియాక్ట్ అయ్యాడు. అలాంటోడు తాజాగా తన వ్యక్తిత్వం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. వాళ్లలా తాను భయపడుతూ కూర్చునే రకం కాదన్నాడు. అది తన వల్ల కాదన్నాడు అశ్విన్.
‘నాకు ఇన్సెక్యూరిటీ లేదు. ప్రతి విషయానికి భయపడుతూ అభద్రతా భావానికి లోనయ్యే వ్యక్తిని కాదు. ఎప్పుడూ సేఫ్‌గా ఉండటం, గిరి గీసుకొని అందులోనే బతకడం నాకు చేతగాదు. ఏ కష్టాలు వద్దనుకొని హాయిగా ఉండాలనుకునే రకం కాదు. సేఫ్‌గా ఉండటం కంటే జీవితంలో ఫెయిల్ అవ్వడం బెటర్ అని నేను అనుకుంటా. అది నా క్యారెక్టర్. ఇన్‌సెక్యూరిటీస్‌తో బతికే వాళ్లు ఉంటారు. అలా నేను ఉండలేను. నాకు ఎలాంటి అభద్రతా భావం లేదు’ అని అశ్విన్ చెప్పుకొచ్చాడు. సాధారణంగా తన అభిప్రాయాలను నిక్కచ్చిగా చెప్పే అశ్విన్ కాంట్రవర్సీలకు తావివ్వకుండా చూసుకుంటాడు. అలాంటోడు తాజాగా ఈ కామెంట్స్ చేయడంతో ఎవర్ని ఉద్దేశించి ఇలా మాట్లాడి ఉంటాడా అని అభిమానులు ఆలోచనల్లో పడ్డారు.
ఇక, వన్డేలు, టీ20లకు దూరంగా ఉంటున్న అశ్విన్ టెస్టుల్లో ఆడుతున్నాడు. ఇప్పుడు నేషనల్ డ్యూటీ లేకపోవడంతో ఫిట్నెస్ మీద కాన్సంట్రేషన్ చేస్తున్నాడు. రాబోయే ఐదారు నెలల్లో భారీగా టెస్టు మ్యాచులు ఆడాల్సి ఉంది. అందుకే ఫిట్‌గా ఉండటంతో పాటు బౌలింగ్ వేరియేషన్స్‌ను మెరుగుపర్చుకోవడంపై వర్క్ చేస్తున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లు లేనప్పుడు డొమెస్టిక్ క్రికెట్లోనూ పాల్గొంటున్నాడు అశ్విన్. ఇటీవల తమిళనాడు ప్రీమియర్ లీగ్‌లోనూ పార్టిసిపేట్ చేశాడు. ఆ టోర్నమెంట్లో బౌలర్‌గానే గాక బ్యాటర్‌గానూ అదరగొట్టాడు. అతడి టీమ్ దుండిగల్ డ్రాగన్స్ టైటిల్ ఎగరేసుకుపోవడంలో ఆటగాడిగా, సారథిగా అశ్విన్ కీలక పాత్ర పోషించాడు. అలాంటి ఈ లెజెండ్‌ను వచ్చే నెలలో జరిగే బంగ్లాదేశ్ సిరీస్‌తో మళ్లీ గ్రౌండ్లో చూడొచ్చు. మరి.. తనకు అభద్రతా భావం లేదంటూ అశ్విన్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్‌ను కామెంట్ చేయండి.
Ravi Ashwin ” I am not insecure at all.I would rather like to fail in life than be absolutely safe.That’s my character.I don’t have the common insecurities that people have.” pic.twitter.com/PX8jEuwd7y
— Sujeet Suman (@sujeetsuman1991) August 13, 2024