Nidhan
ఒక టీమిండియా క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
ఒక టీమిండియా క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఈ వార్త తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు.
Nidhan
క్రికెటర్లకు మన దేశంలో ఎలాంటి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. క్రికెట్‌ను ఓ మతంలా భావించే భారత్‌లో క్రికెటర్లను సూపర్‌స్టార్స్‌గా చూస్తారు. వారికి సంబంధించిన ప్రతి విషయాన్ని ఫాలో అవుతుంటారు. తమ గేమ్‌తో అందర్నీ అలరించే ప్లేయర్లను అభిమానులు గుండెల్లో పెట్టుకుంటారు. అలాంటి వారికి ఏమైనా అయితే మాత్రం అస్సలు తట్టుకోలేరు. క్రికెటర్లకు సంబంధించిన ఏదైనా బ్యాడ్ న్యూస్ వస్తే ఫ్యాన్స్ చాలా బాధపడతారు. ఇదిలా ఉంటే.. ఓ టీమిండియా స్టార్ క్రికెటర్ ఆస్పత్రిలో చేరాడు. తీవ్ర అస్వస్థతగా ఉండటంతో అతడ్ని ఐసీయూలో ఉంచి డాక్టర్లు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. ఆ క్రికెటర్ మరెవరో కాదు.. మయాంక్ అగర్వాల్.
స్టార్ ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ఆస్పత్రిలో చేరాడు. గొంతు, నోటి నొప్పి కారణంగా అతడ్ని హుటాహుటిన అగర్తలలోని ఐఎల్ఎస్ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. ప్రస్తుతం అతడికేమీ ప్రమాదం లేదని తెలుస్తోంది. మయాంక్ సేఫ్‌గా ఉన్నాడని సమాచారం. అయితే మయాంక్ హెల్త్ గురించి తెలిసిన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ఫుల్ ఫిట్‌గా ఉండే క్రికెటర్ ఇలా ఐసీయూలో ఉండటం ఏంటని షాకవుతున్నారు. అతడు త్వరగా కోలుకోవాలని ఫ్యాన్స్ ప్రార్థనలు చేస్తున్నారు. ఇక, టీమిండియా తరఫున 21 టెస్టులు ఆడిన మయాంక్ అగర్వాల్ 1488 పరుగులు చేశాడు. ఇందులో 4 సెంచరీలు, 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. అలాగే 5 వన్డేల్లో 86 రన్స్ చేశాడు. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 98 మ్యాచులు ఆడి 7430 పరుగులు చేశాడు.
Mayank Agarwal pic.twitter.com/UYZXlARZ21
— RVCJ Media (@RVCJ_FB) January 30, 2024