Team India: భారత్​ను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలంటున్న మెకల్లమ్!

  • Author singhj Published - 11:24 AM, Tue - 5 December 23

టీమిండియాను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలని బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. అతడు ఏ ఫార్ములా గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాను ఓడించడానికి ఆ ఒక్క ఫార్ములా చాలని బ్రెండన్ మెకల్లమ్ అన్నాడు. అతడు ఏ ఫార్ములా గురించి మాట్లాడాడో ఇప్పుడు చూద్దాం..

  • Author singhj Published - 11:24 AM, Tue - 5 December 23

వన్డే వరల్డ్ కప్ ముగిసిన తర్వాత వరుస సిరీస్​లతో బిజీ అయిపోయింది టీమిండియా. ఆస్ట్రేలియాతో 5 టీ20ల సిరీస్​ను ఇప్పటికే ఫినిష్ చేసింది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుబ్​మన్ గిల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, జస్​ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి లాంటి స్టార్లు లేకుండానే బరిలోకి దిగిన భారత్ 4-1 తేడాతో ఈ సిరీస్​ను సొంతం చేసుకుంది. యశస్వి జైస్వాల్, రుతురాజ్ గైక్వాడ్, జితేష్ శర్మ, రింకూ సింగ్, ముకేష్ కుమార్, రవి బిష్ణోయ్ లాంటి యంగ్​స్టర్స్​ ఈ సిరీస్​తో మరోమారు తమ సత్తా చాటారు. అద్భుతమైన పెర్ఫార్మెన్స్​లతో తామే ఇండియన్ క్రికెట్​కు ఫ్యూచర్ అని ప్రూవ్ చేశారు. కంగారూలతో పొట్టి ఫార్మాట్ సిరీస్​ను సాధించిన జోష్​లో ఉన్న టీమిండియా.. సౌతాఫ్రికా టూర్​కు వెళ్లేందుకు రెడీ అవుతోంది.

సఫారీ టూర్ ముగించుకొని స్వదేశానికి రాగానే ఇంగ్లండ్​తో సిరీస్​లో టీమిండియా​ ఆడాల్సి ఉంటుంది. వచ్చే ఏడాది జనవరిలో ఇంగ్లీష్ టీమ్ భారత్​లో పర్యటించనుంది. ఇందులో భాగంగా ఇరు టీమ్స్ మధ్య ఐదు టెస్టు మ్యాచులు జరుగుతాయి. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్​షిప్ (2023-2025 సైకిల్)లో పాయింట్స్ టేబుల్​లో మెరుగైన స్థానంలో ఉండాలి. కాబట్టి ఈ సిరీస్ అటు ఇంగ్లండ్​తో పాటు ఇటు ఇండియాకూ అంతే కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో దానిపై ఇరు జట్లు ఇప్పటికే వ్యూహాలు కూడా రచిస్తున్నాయి. ప్లేయర్ల ఫిట్​నెస్, సెలక్షన్​ మీద ఫోకస్ పెడుతున్నాయి. అయితే ఇంగ్లీష్ టీమ్ గత రెండేళ్లుగా టెస్టుల్లో బజ్​బాల్ క్రికెట్​తో అదరగొడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆ జట్టు కోచ్​గా న్యూజిలాండ్ లెజెండ్ బ్రెండన్ మెకల్లమ్ బాధ్యతలు చేపట్టాక ఆ టీమ్ ఆడేతీరు మారిపోయింది.

బజ్​బాల్ ఫార్ములాతో ఎదురొచ్చిన ప్రతి టీమ్​ను చిత్తు చేసుకుంటూ పోతోంది ఇంగ్లండ్. కొన్నిసార్లు టెస్టులను రెండు, మూడు రోజుల్లోనే ముగించేస్తోంది. అయితే ఈ క్రమంలో కొన్ని మ్యాచుల్లో ఓడిపోయినా ఇంగ్లండ్ తమ పంథాను మార్చుకోలేదు. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది జరగనున్న టెస్టు సిరీస్​ గురించి ఆ టీమ్ కోచ్ మెకల్లమ్ మాట్లాడాడు. రాయల్‌ ఛాలెంజర్స్ బెంగళూరు ఇన్నోవేషన్ ల్యాబ్ లీడర్స్ మీట్ ఇండియా ప్రోగ్రామ్​లో పాల్గొన్న ఆయన ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. టీమిండియాతో ఆడటం తమకు అతిపెద్ద ఛాలెంజ్ అన్నాడు. కానీ ఆ సిరీస్ కోసం తాము చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నామని చెప్పాడు. వరల్డ్​లోనే బెస్ట్ టీమ్ మీద తమను తాము పరీక్షించుకోవడానికి ఇదే కరెక్ట్ టైమ్ అన్నాడు మెకల్లమ్. సొంతగడ్డపై భారత్ చాలా డేంజరస్ టీమ్ అని తెలిపాడు. కానీ తాము మాత్రం బజ్​బాల్​ స్టైల్​ను కంటిన్యూ చేస్తామని మెకల్లమ్ పేర్కొన్నాడు. భారత్​ను ఓడించడానికి ఈ ఫార్ములా చాలన్నాడు. మరి.. టీమిండియాతో టెస్టు సిరీస్​లో బజ్​బాల్ ఫార్ములానే కొనసాగిస్తామని మెకల్లమ్ చేసిన వ్యాఖ్యలపై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: Jasprit Bumrah: బుమ్రాపై నీరజ్ చోప్రా ఇంట్రెస్టింగ్ కామెంట్స్.. ఆ ఒక్క పని చేస్తే చాలంటూ..!

Show comments