Nidhan
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. ఈ మేరకు కొద్దిసేపటి కింద బోర్డు సెక్రెటరీ జైషా అధికారిక ప్రకటన చేశాడు.
టీమిండియాకు కొత్త హెడ్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. ఈ మేరకు కొద్దిసేపటి కింద బోర్డు సెక్రెటరీ జైషా అధికారిక ప్రకటన చేశాడు.
Nidhan
భారత క్రికెట్ జట్టు హెడ్ కోచ్ అంశం గురించి చాన్నాళ్లుగా డిస్కషన్స్ నడుస్తున్నాయి. టీ20 వరల్డ్ కప్ మొదలైనప్పటి నుంచి దీని గురించే ఎక్కువగా చర్చలు జరిగాయి. మీడియా కవరేజ్ కూడా దీనికి అధికంగానే ఉండటంతో కొత్త కోచ్‌గా ఎవరు వస్తారనేది ఇంట్రెస్టింగ్గా మారింది. టీమ్‌ను సక్సెస్‌ఫుల్‌గా నడిపించిన రాహుల్ ద్రవిడ్‌కు వారసుడిగా ఎవరు బాధ్యతలు తీసుకుంటారో తెలుసుకునేందుకు అభిమానులతో పాటు మాజీ క్రికెటర్లు, ఎక్స్పర్ట్స్ కూడా ఆసక్తి చూపించారు. ఎట్టకేలకు దీనిపై క్లారిటీ వచ్చింది. టీమిండియాకు కొత్త హెడ్ కోచ్‌గా లెజెండ్ గౌతం గంభీర్‌ను నియమించింది బీసీసీఐ. ఈ మేరకు కొద్దిసేపటి కింద బోర్డు సెక్రెటరీ జైషా అధికారిక ప్రకటన చేశారు.
కోచ్‌గా బీసీసీఐ నుంచి అధికారిక ప్రకటన వచ్చిన తర్వాత గంభీర్ సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ పోస్ట్ పెట్టాడు. దేశానికి సేవలు అందించడం కంటే గొప్ప విషయం ఇంకొకటి లేదన్నాడు. టీమిండియాలోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడం సంతోషంగా ఉందని ఆ పోస్ట్‌లో రాసుకొచ్చాడు. ‘భారత్ అనేది నా గుర్తింపు. నా దేశానికి సేవలు అందించడం కంటే గొప్ప విషయం లైఫ్‌లో ఇంకొకటి లేదు. భారత జట్టులోకి మళ్లీ ఎంట్రీ ఇవ్వడాన్ని గౌరవంగా భావిస్తున్నా. టీమిండియా క్యాప్‌ను ధరించేందుకు ఆతృతగా ఎదురు చూస్తున్నా. అయితే కోచ్‌గా నా గోల్ ఒక్కటే. ఎప్పటిలాగే ప్రతి భారతీయుడ్ని గర్వించేలా చేయడమే నా లక్ష్యం. 140 కోట్ల మంది ప్రజల కలల్ని మెన్ ఇన్ బ్లూ మోస్తోంది. ఆ డ్రీమ్స్‌ను నెరవేర్చడానికి సాధ్యమైనంత కృషి చేస్తా’ అని గంభీర్ చెప్పుకొచ్చాడు.
గంభీర్ పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దీన్ని చూసిన నెటిజన్స్ లెజెండ్‌కు వెల్కమ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ప్లేయర్‌గా ఎన్నో ఘనతలు అందుకున్నాడని.. ఐపీఎల్‌లోనూ కేకేఆర్‌కు మెంటార్‌గా సక్సెస్ అయ్యాడని, అతడి రాకతో టీమిండియా మరింత బలంగా కనిపిస్తోందని అంటున్నారు. గంభీర్ కోచింగ్‌లో జట్టు మరిన్ని ఐసీసీ ట్రోఫీలు నెగ్గుతుందని నమ్మకంగా చెబుతున్నారు. ఇక, గౌతీని కోచ్‌గా ప్రకటిస్తూ బీసీసీఐ సెక్రెటరీ జైషా ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత క్రికెట్‌ను ముందుకు తీసుకెళ్లేందుకు గంభీర్ విశేషంగా కృషి చేశాడని మెచ్చుకున్నాడు షా. అతడి నయా జర్నీలో భారత క్రికెట్ బోర్డు నుంచి పూర్తి మద్దతు ఉంటుందన్నాడు. మరి.. ప్రతి భారతీయుడ్ని గర్వపడేలా చేయడమే కోచ్‌గా తన గోల్ అంటూ గంభీర్ చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
Gautam Gambhir’s Instagram post. 🇮🇳 pic.twitter.com/2FaNq4sQc9
— Mufaddal Vohra (@mufaddal_vohra) July 9, 2024