Nidhan
T20 World Cup 2024 Semifinal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లకు బ్యాడ్ న్యూస్.
T20 World Cup 2024 Semifinal: భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. అయితే వాళ్లకు బ్యాడ్ న్యూస్.
Nidhan
భారత్-ఇంగ్లండ్ మధ్య జరిగే నాకౌట్ పోరు కోసం అభిమానులు ఎంతో ఎగ్జయిటింగ్‌గా ఉన్నారు. ఈ మహా సమరం ఎప్పుడు మొదలవుతుందా అని ఉత్సుకతతో ఎదురు చూస్తున్నారు. ఆల్రెడీ ఒక ఫైనలిస్ట్ ఎవరో తేలిపోయింది. మొదటి సెమీఫైనల్లో డేంజరస్ ఆఫ్ఘానిస్థాన్‌ను చిత్తుగా ఓడించి తుదిపోరుకు బెర్త్‌ను కన్ఫర్మ్ చేసుకుంది సౌతాఫ్రికా. దీంతో ఇంకో ఫైనలిస్ట్ ఎవరో తెలుసుకోవాలని క్రికెట్ లవర్స్ ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. టీమిండియా-ఇంగ్లండ్ పోరుకు ఆతిథ్యం ఇస్తున్న గయానా పిచ్ ఎలా స్పందిస్తుంది? ఎవరికి ఎక్కువ సపోర్ట్ లభిస్తుంది? మ్యాచ్‌ను ఎవరు మలుపు తిప్పుతారు? అనే అంశాలపై అభిమానులు డిస్కస్ చేస్తున్నారు. ఈ తరుణంలో ఫ్యాన్స్‌కు ఓ బ్యాడ్ న్యూస్.
భారత్-ఇంగ్లండ్ నాకౌట్ ఫైట్ కోసం ఎదురు చూస్తున్న అభిమానులకు బ్యాడ్ న్యూస్. మరికొన్ని నిమిషాల్లో ఈ మ్యాచ్ మొదలుకానుంది. అయితే ఈ మ్యాచ్‌కు హోస్ట్‌గా ఉన్న గయానా స్టేడియం దగ్గర జోరున వర్షం కురుస్తోంది. టాస్కు ఇంకా 2 గంటల టైమ్ కూడా లేదు. దీంతో వరుణుడు శాంతిస్తాడా? లేదా? అనేది ఉత్కంఠగా మారింది. ఈ సెమీఫైనల్ మ్యాచ్‌కు రిజర్వ్ డే కూడా లేదు. కాబట్టి వాన వల్ల మ్యాచ్ రద్దయితే ఏంటని అందరూ టెన్షన్ పడుతున్నారు. అయితే ఒకవేళ మ్యాచ్ రద్దయితే సూపర్-8 దశలో టేబుల్ టాపర్‌గా ఉన్న టీమిండియా ఫైనల్‌కు చేరుతుంది.
మ్యాచ్ రద్దయితే తమ జట్టు మెగాటోర్నీ నుంచి ఇంటిదారి పట్టే ప్రమాదం ఉండటంతో వర్షం ఆగాలని ఇంగ్లీష్ టీమ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. మ్యాచ్ జరగాలని, లేకపోతే తమ ఆశలు గల్లంతు అవుతాయని టెన్షన్ పడుతున్నారు. మరోవైపు భారత అభిమానులు మాత్రం మ్యాచ్ జరిగినా, జరగకపోయినా ఫైనల్ చేరేది రోహిత్ సేనేనని బల్ల గుద్ది చెబుతున్నారు. రద్దయితే గ్రూప్ టాపర్‌గా తుదిదశకు చేరుతుందని.. ఒకవేళ మ్యాచ్ సాధ్యమైతే ఇంగ్లండ్‌ను చిత్తు చేసి టైటిల్ ఫైట్‌కు క్వాలిఫై అవుతుందని ధీమాగా చెబుతున్నారు. మరి.. భారత్-ఇంగ్లండ్ పోరు కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ చేయండి.
THE RAIN HAS STARTED IN GUYANA.
– Hopefully, we’ll get a full game. (Abhishek Tripathi).pic.twitter.com/ZkKeikanVX
— Mufaddal Vohra (@mufaddal_vohra) June 27, 2024