కోహ్లీ ఫెయిల్యూర్​కు ఎవరిది తప్పు.. ఆ ప్రమాదాన్ని ముందే ఎందుకు పసిగట్టలేదు?

టీ20 ప్రపంచ కప్​లో విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. సూపర్-8 మొదట్లో టచ్​లోకి వచ్చినట్లే కనిపించిన కింగ్.. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్​లో ఫ్లాప్ అయ్యాడు. డకౌట్​గా వెనుదిరిగి మళ్లీ నిరాశపర్చాడు.

టీ20 ప్రపంచ కప్​లో విరాట్ కోహ్లీ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. సూపర్-8 మొదట్లో టచ్​లోకి వచ్చినట్లే కనిపించిన కింగ్.. ఆస్ట్రేలియాతో కీలక మ్యాచ్​లో ఫ్లాప్ అయ్యాడు. డకౌట్​గా వెనుదిరిగి మళ్లీ నిరాశపర్చాడు.

పొట్టి కప్పులో టీమిండియా హవా నడుస్తోంది. వరుస విజయాలతో సెమీస్​లోకి సగర్వంగా అడుగుపెట్టింది రోహిత్ సేన. మొన్నటి వరకు తన కంటే చిన్న రేంజ్ టీమ్స్​తో తలపడి ఓడించిన భారత్.. నిన్న ఫేవరెట్లలో ఒకటైన ఆస్ట్రేలియాను కూడా చిత్తుగా ఓడించింది. కెప్టెన్ రోహిత్ శర్మ విధ్వంసక బ్యాటింగ్​తో చెలరేగడం, బౌలర్లు కలసికట్టుగా రాణించడంతో జట్టుకు ఎదురు లేకుండా పోయింది. ఇదే ఊపును సెమీస్​లోనూ కొనసాగించి ఇంగ్లండ్​ను మట్టికరిపించాలని చూస్తోంది మెన్ ఇన్ బ్లూ. అయితే అంతా బాగానే ఉన్నా టాప్ బ్యాటర్ విరాట్ కోహ్లీ ఫామ్ ఒక్కటే జట్టును తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పొట్టి కప్పులో కింగ్ బ్యాటింగ్ ఫెయిల్యూర్ కంటిన్యూ అవుతోంది. గ్రూప్ దశలో ఆడిన మూడు మ్యాచుల్లో కలిపి 5 పరుగులే చేసిన విరాట్.. సూపర్-8 మొదట్లో టచ్​లోకి వచ్చినట్లే కనిపించాడు.

బంగ్లాదేశ్, ఆఫ్ఘానిస్థాన్ మీద కలిపి 61 పరుగులు చేశాడు కోహ్లీ. దీంతో అతడు ఫామ్​లోకి వచ్చాడు.. ఇక తిరుగులేదని అంతా అనుకున్నారు. బిగ్ మ్యాచెస్ ప్లేయర్ కాబట్టి ఆసీస్​ మీద మరింత రెచ్చిపోయి ఆడతాడని ఫిక్స్ అయ్యారు. కానీ కథ మళ్లీ మొదటికొచ్చింది. కంగారూ జట్టుతో జరిగిన సూపర్ పోరులో కోహ్లీ దారుణంగా విఫలమయ్యాడు. 5 బంతులు ఎదుర్కొన్న ఈ టాప్ బ్యాటర్.. ఒక్క పరుగు కూడా చేయకుండానే వెనుదిరిగాడు. జోష్ హేజల్​వుడ్ వేసిన బౌన్సర్​ను సరిగ్గా ఎదుర్కొలేక రాంగ్ షాట్ కొట్టి పెవిలియన్​కు చేరుకున్నాడు. దీంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ షాక్ అవుతున్నారు. అసలు కోహ్లీకి ఏమైందని టెన్షన్ పడుతున్నారు. ఇంత బాగా ఆడేటోడు హఠాత్తుగా ఇలా జట్టుకు భారమవడం ఏంటని తలపట్టుకుంటున్నారు. ఇప్పటి వరకు ఎలాగోలా నడిచింది గానీ.. నెక్స్ట్ సెమీస్, ఫైనల్స్ ఉన్నాయి. అక్కడ కూడా అతడు విఫలమైతే జట్టు పరిస్థితి ఏంటని అంటున్నారు. కోహ్లీ వైఫల్యానికి టీమ్ మేనేజ్​మెంట్​ను తప్పుబడుతున్నారు.

ఐపీఎల్-2024​లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. మెగాటోర్నీలో మాత్రం చేతులెత్తేస్తున్నాడు. ఆటడమే రానట్లు, కొత్తగా బ్యాట్ పట్టినట్లు ఉంది అతడి వ్యవహారం. అయితే దీనికి కింగ్ స్వయంకృతాపరాధంతో పాటు టీమ్ మేనేజ్​మెంట్ తప్పిదం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది. ఓపెనర్​గా పంపాలని మేనేజెమెంట్ డిసైడ్ అవడం, అతడూ అదే పొజిషన్​లో ఆడతానని పట్టుబట్టడం జట్టుకు మైనస్​గా మారింది. అలవాటు లేని స్థానంలో పరుగులు చేయలేక, ప్రెజర్​ను తట్టుకోలేక ఆపసోపాలు పడుతున్నాడు విరాట్. అదే టైమ్​లో బౌన్సర్లు, ఔట్ సైడ్ ఆఫ్​స్టంప్ డెలివరీస్​ను ఆడలేని అతడి వీక్​నెస్​ను ప్రత్యర్థులు పట్టేశారు. దీనికి ముందే ప్రిపేర్ అయి వస్తూ దెబ్బతీస్తున్నారు. కానీ ఈ బలహీనతల్ని బలంగా మార్చడంలో టీమ్ మేనెజ్​మెంట్ సక్సెస్ కాలేకపోతోంది. కోచ్ ద్రవిడ్​తో పాటు బ్యాటింగ్ కోచ్ విక్రమ్ రాథోడ్ ఈ విషయంలో విఫలమవడం జట్టును దెబ్బతీస్తోంది. ఇకనైనా కోహ్లీ, టీమ్ మేనేజ్​మెంట్ కోలుకోకపోతే టీమ్​కు మరింత డేంజర్ తప్పదని నెటిజన్స్ హెచ్చరిస్తున్నారు. మరి.. విరాట్ వైఫల్యంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

Show comments