IND vs PAK: అది పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది! పాక్ తో మ్యాచ్.. పాండ్యా కామెంట్స్ వైరల్!

అది పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది.. అంటూ పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఆ వివరాల్లోకి వెళితే..

అది పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది.. అంటూ పాకిస్తాన్ తో జరగబోయే మ్యాచ్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేశాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 ప్రపంచ కప్ 2024 చాలా చప్పగా సాగుతోంది. అసలు ఆడుతుంది టీ20లా? లేక టెస్ట్, వన్డే మ్యాచ్ లా? అన్న సందేహం క్రికెట్ అభిమానుల్లో కలుగుతోంది. ఈ నేపథ్యంలో టఫ్ ఫైట్ కోసం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. అలాంటి బిగ్ ఫైట్ తొందరలోనే జరగబోతుంది. జూన్ 9న వరల్డ్ క్రికెట్ ఫ్యాన్స్ ఎంతగానో ఎదరుచూసే దాయాదుల పోరుకు రంగం సిద్ధమైంది. ఇండియా-పాక్ మధ్య మ్యాచ్ అంటే.. అదో మినీ యుద్ధమనే చెప్పాలి. ఇక ఈ పోరు గురించి టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. పాక్ తో పోరంటే తనకు ఇంకాస్త స్పెషల్ అని చెప్పుకొచ్చాడు.

ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అంటే చాలు.. ఆటగాళ్లకే కాక ఫ్యాన్స్ కు కూడా ఎక్కడా లేని టెన్షన్ ఉంటుంది. ఇరు జట్ల మధ్య మ్యాచ్ చిన్న పాటి యుద్ధాన్నే తలపిస్తుంది. ఇరు దేశాల మధ్య పోరు కోసం వరల్డ్ వైడ్ గా క్రికెట్ అభిమానులు కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారన్న విషయం ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అయితే తన దృష్టిలో ఇండియా పాక్ మ్యాచ్ అంటే ఎలా ఉంటుందో చెప్పుకొచ్చాడు టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా. ఇలాంటి గొప్ప మ్యాచ్ ల్లో ఆడటం ఎప్పటికీ స్పెషలే అంటూ పేర్కొన్నాడు.

“పాకిస్తాన్ తో మ్యాచ్ అంటే అందరూ ఫైట్ గానే భావిస్తారు. కానీ నేనలా అనుకోను. పాక్ లాంటి టీమ్ తో ఆడటం కాస్త ఒత్తిడిగానే అనిపిస్తుంది. అయితే దాయాదితో పోరంటే.. నాకెంతో స్పెషల్. ఇక ఈ మ్యాచ్ కోసం ప్రపంచమంతా ఊపిరిబిగపట్టుకుని చూడాలని నా రిక్వెస్ట్. ఇక ఈ మ్యాచ్ పోరాటం కాదు.. చరిత్ర అవుతుంది. పాక్ పోరంటే భావోద్వేగం, బాధ, సంతోషం ఇలా అన్నీ కూడుకుని ఉంటాయి. టీమ్ ఫర్పామెన్స్ తో ప్రత్యర్థిపై దూకి.. విజయం సాధించడమే మా ముందున్న టార్గెట్. అనుకున్న వ్యూహాలు ఫలిస్తే అంతకన్నా గొప్ప రోజు మరోటి ఉండదు” అంటూ పాక్ తో మ్యాచ్ కు ముందు ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేశాడు.

కాగా.. ఇప్పటి వరకు పాకిస్తాన్ తో ఆడిన ఆరు మ్యాచ్ ల్లో హార్దిక్ పాండ్యా 84 రన్స్ చేశాడు. అందులో గత టీ20 వరల్డ్ కప్ లో ఓ మ్యాచ్ లో 40 రన్స్ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్ లో 6 మ్యాచ్ ల్లో 7.5 ఎకానమీతో 11 వికెట్లు పడగొట్టాడు. పాక్ పై అతడి అత్యుత్తమ బౌలింగ్ గణాంకాలు 3/8. మరి జూన్ 9న జరిగే దాయాదుల పోరు కోసం ప్రపంచం మెుత్తం ఎదురుచూస్తోంది. మరి పాక్ తో మ్యాచ్ కు ముందు పాండ్యా చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments