Nidhan
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాను గెలకొద్దని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడ్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని చెప్పాడు.
టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా బిగ్ ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. మెగా టోర్నీలో సత్తా చాటాలని చూస్తున్నాడు. ఈ నేపథ్యంలో పాండ్యాను గెలకొద్దని ఓ మాజీ క్రికెటర్ అన్నాడు. అతడ్ని ఎంత తొక్కితే అంత పైకి లేస్తాడని చెప్పాడు.
Nidhan
గత కొన్నాళ్లుగా నడుస్తున్న బ్యాడ్ ఫేజ్‌ను దాటాలని టీమిండియా వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఫిక్స్ అయ్యాడు. గాయం కారణంగా టీమ్‌కు దూరమవడం, ఐపీఎల్లో సరిగ్గా ఆడకపోవడంతో ముంబై ఇండియన్స్ ఫ్యాన్స్ నుంచి తీవ్రంగా విమర్శలు రావడం, ప్రపంచ కప్ జట్టులోకి హార్దిక్‌ను తీసుకోవద్దనే డిమాండ్లు రావడం కూడా తెలిసిందే. అదే తరుణంలో భార్య నటాషాతో అతడు విడాకులు తీసుకుంటున్నాడనే ఊహాగానాలు కూడా వైరల్ అయ్యాయి. దీంతో సతమతమైన పాండ్యా వరల్డ్ కప్ కోసం యూఎస్ చేరుకున్నాడు. బంగ్లాదేశ్‌తో వార్మప్ మ్యాచ్‌లో 23 బంతుల్లోనే 2 బౌండరీలు, 4 సిక్సుల సాయంతో 40 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు. అలాగే బౌలింగ్ వేసి ఒక వికెట్ కూడా తీశాడు. తన కమ్‌బ్యాక్‌ను ఘనంగా చాటాడు. ఈ నేపథ్యంలో మాజీ క్రికెటర్ నవ్‌జ్యోత్ సింగ్ సిద్ధు ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు.
హార్దిక్‌ను ఎంత కిందకు తొక్కితే అంత పైకి లేస్తాడని నవ్‌జ్యోత్ సిద్ధు అన్నాడు. అతడు వజ్రం లాంటోడని.. ఎంత సానబెడితే అంత మెరుస్తాడని మెచ్చుకున్నాడు. తన మీద వస్తున్న ఎన్నో రకాల విమర్శలు, ప్రశ్నలకు బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌తో అతడు ఆన్సర్ ఇచ్చాడని సిద్ధు తెలిపాడు. పాండ్యాను ఎంత ప్రెజర్లో పెడితే అతడు అంత అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తాడని ప్రశంసల జల్లులు కురిపించాడు. అతడితో పెట్టుకోవద్దంటూ విమర్శకులకు వార్నింగ్ ఇచ్చాడు. ఐర్లాండ్‌తో ఫస్ట్ మ్యాచ్ గురించి కూడా సిద్ధు కామెంట్స్ చేశాడు. ఒకవేళ ఈ మ్యాచ్‌లో యశస్వి జైస్వాల్‌ను గనుక ఆడించాలని అనుకుంటే వార్మప్ మ్యాచ్‌లో అతడ్ని బరిలోకి దించాల్సిందని పేర్కొన్నాడు. జైస్వాల్‌ను ఆడించలేదు కాబట్టి ఐర్లాండ్‌తో మ్యాచ్‌లో రోహిత్-కోహ్లీ ఓపెన్ చేయడం పక్కాగా కనిపిస్తోందన్నాడు.
రోహిత్-విరాట్ కలసి ఓపెన్ చేస్తే టీమ్‌కు మంచిదన్నాడు నవ్‌జ్యోత్ సిద్ధు. వీళ్లు ఇన్నింగ్స్‌ను మొదలెడితే.. ఓపెనింగ్ చేసేందుకు ఎక్స్ట్రా ప్లేయర్ అక్కర్లేదని.. అప్పుడు టీమ్‌లో 5 మంది బౌలర్లను తీసుకునేందుకు అవకాశం ఏర్పడుతుందన్నాడు. ఐదుగురు ప్రధాన బౌలర్లకు తోడుగా హార్దిక్ ఆరో బౌలర్‌గా ఉంటాడని.. అప్పుడు బౌలింగ్ దళం మరింత బలోపేతం అవుతుందన్నాడు. ఇక, హార్దిక్ కీలకమైన ఛాలెంజ్‌కు రెడీ అవుతున్నాడు. టీ20 వరల్డ్ కప్-2024లో తన రియల్ టాలెంట్ ఏంటో మరోమారు అందరికీ చూపించాలని భావిస్తున్నాడు. సూపర్బ్ పెర్ఫార్మెన్స్తో తన విలువ ఏంటో చాటాలని చూస్తున్నాడు. మెగా టోర్నీలో భారత్‌ను విజేతగా నిలబెట్టాలని ఉవ్విళ్లూరుతున్నాడు. కొన్నాళ్లుగా తన మీద వస్తున్న విమర్శలు, ట్రోలింగ్‌కు ప్రపంచ కప్ పెర్ఫార్మెన్స్తో గట్టిగా సమాధానం ఇవ్వాలని చూస్తున్నాడు. మరి.. మెగా టోర్నీలో హార్దిక్ ఎంత వరకు సక్సెస్ అవుతాడని మీరు భావిస్తున్నారో కామెంట్ చేయండి.
Navjot Singh Sidhu ” There were many question marks over Hardik Pandya and they have been erased.The more you try to put Hardik Pandya down, the more he emerges and shines, just like a diamond shines after being continuously rubbed.He is a great takeaway”pic.twitter.com/1kKbAKf2Da
— Sujeet Suman (@sujeetsuman1991) June 4, 2024