ఆస్ట్రేలియా పరువు తీసిన ఒమన్ కెప్టెన్.. వాళ్లకు అది చేతగాదంటూ..!

ఆస్ట్రేలియా అంటేనే అందరూ వణికిపోతారు. పెద్ద జట్లను కూడా వదలని కంగారూలు.. పసికూనలతో ఓ రేంజ్​లో ఆడుకుంటారు. కానీ ఆ టీమ్ పరువు తీశాడో చిన్న జట్టు సారథి. ఆసీస్​కు అది చేతగాదన్నాడు ఒమన్ కెప్టెన్.

ఆస్ట్రేలియా అంటేనే అందరూ వణికిపోతారు. పెద్ద జట్లను కూడా వదలని కంగారూలు.. పసికూనలతో ఓ రేంజ్​లో ఆడుకుంటారు. కానీ ఆ టీమ్ పరువు తీశాడో చిన్న జట్టు సారథి. ఆసీస్​కు అది చేతగాదన్నాడు ఒమన్ కెప్టెన్.

ఆస్ట్రేలియా జట్టు అంటేనే అందరూ వణికిపోతారు. బిగ్ టీమ్స్​ను కూడా చిత్తుగా ఓడించడం కంగారూలకు అలవాటు. అలాంటిది పసికూనలు దొరికితే వదులుతారా? ఓ రేంజ్​లో ఆడుకుంటారు. సాధారణ టోర్నీల్లోనే జూలు విదిల్చే ఆడే ఆసీస్ ఆటగాళ్లు.. వరల్డ్ కప్ లాంటి వేదికలపై మరింత రెచ్చిపోయి పెర్ఫార్మ్ చేస్తారు. అప్పటిదాకా ఫామ్​లో లేని ఆటగాళ్లు కూడా ఒకేసారి శక్తులన్నీ తిరిగొచ్చాయా అనేలా బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇస్తారు. విధ్వంసక బ్యాటింగ్, కళ్లుచెదిరే ఫీల్డింగ్, కట్టుదిట్టమైన బౌలింగ్​తో ప్రత్యర్థులను అష్టదిగ్బంధనం చేస్తుంటారు. అందుకే మెగా టోర్నీలో ఆస్ట్రేలియా గ్రూప్ దశ లేదా సూపర్-8లోనే వెళ్లిపోవాలని కోరుకుంటారు. నాకౌట్ స్టేజ్​కు గానీ వచ్చిందా.. కప్పు కొట్టకుండా వెనక్కి పోదు. గతేడాది వన్డే ప్రపంచ కప్ నెగ్గిన ఆసీస్.. ఇప్పుడు పొట్టి కప్పు మీద ఫోకస్ పెట్టింది.

టీ20 వరల్డ్ కప్​కు సిద్ధమైంది ఆస్ట్రేలియా. తొలి మ్యాచ్​లో పసికూన ఒమన్​ను ఆ టీమ్ ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్​లో బిగ్ విక్టరీ కొట్టి అపోజిషన్ టీమ్స్​కు డేంజర్ సిగ్నల్స్ పంపాలని భావిస్తోంది. ఈ తరుణంలో ఆసీస్ పరువు తీశాడు ఒమన్ కెప్టెన్ అకీబ్ ల్యాస్. ఆ టీమ్ బ్యాటర్లకు డిఫెన్స్ చేయడం చేతగాదన్నాడు. ఒకప్పుడు ఆ జట్టులో మంచి టెక్నిక్ కలిగిన బ్యాట్స్​మెన్ ఉండేవారని.. ఇప్పుడు ఆ సిచ్యువేషన్ లేదన్నాడు ల్యాస్. బాల్ పడిందా బాదుడే అన్నట్లు కంగారూలు ఆడుతున్నారని.. ఇది అన్ని వేళలా పనికిరాదన్నాడు. సిక్సులు కొట్టడమే పని అన్నట్లు ఆడుతున్నారని.. ఇది సరికాదన్నాడు అకీబ్.

‘స్టీవ్ స్మిత్, మార్నస్ లబుషేన్ లాంటి మంచి టెక్నిక్ కలిగిన బ్యాట్స్​మెన్ ఆస్ట్రేలియా జట్టులో ఉండేవారు. కానీ ఇప్పుడు ఆ టీమ్​లో అలాంటి బ్యాటర్లు లేరు. ఆ జట్టు బ్యాటర్లు క్రీజులోకి వచ్చింది తడవు బిగ్ షాట్స్ కొట్టాలని చూస్తుంటారు. సిక్సులు కొట్టడానికే వాళ్లు ప్రయత్నింటారు’ అని అకీబ్ ల్యాస్ చెప్పుకొచ్చాడు. ఆసీస్​ బ్యాటర్లకు సిక్సులు కొట్టడమే తప్ప.. టెక్నిక్​తో ఆడటం చేతగాదంటూ అకీబ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇది చూసిన నెటిజన్స్.. ఒమన్ సారథి చెప్పిన దాంట్లో తప్పేమీ లేదని అంటున్నారు. మెగా టోర్నీకి ఆతిథ్యం ఇస్తున్న యూఎస్​ఏ-వెస్టిండీస్​లో పిచ్​లు స్లోగా ఉంటాయని, లోస్కోరింగ్ మ్యాచ్​లను చూస్తున్నామని.. అక్కడ హిట్టింగ్​కు వెళ్తే ఓడిపోయే ప్రమాదం ఉందని కామెంట్స్ చేస్తున్నారు. ఆస్ట్రేలియా జట్టు హిట్టింగ్​తో పాటు అవసరాన్ని బట్టి డిఫెన్స్​ చేయడం, స్ట్రైక్ రొటేషన్ మీద ఫోకస్ చేయాలని సూచిస్తున్నారు. ఆసీస్​తో పోరుకు ముందు ఆ జట్టును రెచ్చగొడుతూ ఒమన్ కెప్టెన్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు ఇంట్రెస్టింగ్​గా మారింది.

ఇదీ చదవండి: ఈ రేంజ్​లో ఉన్నానంటే అతడే కారణం.. ఆ సాయాన్ని మర్చిపోలేను: దూబె

Show comments