IPLలో ఒక్కసారిగా మారిన RCB అదృష్టం! అతను వచ్చాకే వరుస విజయాలు!

Swapnil Singh, RCB: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ఎట్టకేలకు తమ స్థాయి ప్రదర్శనలు చేస్తూ.. విజయాల బాటపట్టింది. అయితే.. వారికి ఈ వరుస విజయాలు అతని రాకతోనే వస్తున్నాయి. మరి ఆ అదృష్ట ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

Swapnil Singh, RCB: ఐపీఎల్‌ 2024లో ఆర్సీబీ ఎట్టకేలకు తమ స్థాయి ప్రదర్శనలు చేస్తూ.. విజయాల బాటపట్టింది. అయితే.. వారికి ఈ వరుస విజయాలు అతని రాకతోనే వస్తున్నాయి. మరి ఆ అదృష్ట ఆటగాడు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024 ఆరంభంలో అత్యంత చెత్త ప్రదర్శనతో అందరి విమర్శలు మూటగట్టుకుంది ఆర్సీబీ. స్టార్టింగ్‌లో విరాట్‌ కోహ్లీ, దినేష్‌ కార్తీక్‌ తప్పితే ఎవరూ పెద్దగా ఫామ్‌లో లేరు. వాళ్లిద్దరూ ఎంత రాణించినా.. ఆర్సీబీ విజయం సాధించలేకపోయింది. ఎందుకంటే క్రికెట్‌ అనేది టీమ్‌ గేమ్‌. జట్టు మొత్తం విఫలం అవుతుంటే.. ఏ ఒక్క ఆటగాడు అద్భుతంగా ఆడినా విజయం దక్కదు. అయితే.. ఆర్సీబీ గత రెండు మ్యాచ్‌లుగా అసాధారణ ప్రదర్శన కనబరుస్తోంది. తమ బ్యాటింగ్‌తో అన్నీ టీమ్స్‌ను భయపెడుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో పాటు ఆదివారం గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో అద్భుతమైన ఆటతో రెండు వరుస విజయాలు సాధించింది. అయితే ఈ విజయాలు ఓ ఆటగాడి రాకతోనే వస్తున్నాయని, అతను టీమ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత అదృష్టం కూడ కలిసి వస్తుందనే టాక్‌ వినిపిస్తుంది. ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో ఏప్రిల్‌ 25న హైదరాబాద్‌లోని ఉప్పల్‌ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో ఆర్సీబీ తరఫున ఓ 33 ఏళ్ల క్రికెటర్‌ అరంగేట్రం చేశాడు. అతని పేరు స్వప్నిల్‌ సింగ్‌. 2008 నుంచి ఐపీఎల్‌లో ఉన్నా.. పెద్దగా ఆడే అవకాశం రాని, ఈ డొమెస్టిక్‌ హీరోకు ఆర్సీబీ అవకాశం కల్పించింది. ఎస్‌ఆర్‌హెచ్‌తో జరిగిన మ్యాచ్‌తో బరిలోకి దిగింది. ఆర్సీబీ తరఫున ఫస్ట్‌ మ్యాచ్‌ ఆడుతూ.. స్విప్నిల్‌ సింగ్‌ అదరగొట్టాడు. తొలుత బ్యాటింగ్‌లో.. చివరి ఓవర్‌లో 6, 4తో కేవలం 6 బంతుల్లోనే 12 రన్స్‌ చేసి పర్వాలేదనిపించాడు. అలాగే బౌలింగ్‌లో అయితే.. మ్యాచ్‌ మొత్తాన్ని మలుపు తిప్పాడనే చెప్పాలి. మ్యాచ్‌లో తన తొలి ఓవర్‌లో 19 పరుగులు ఇచ్చినా.. రెండో బంతికి ఎడెన్‌ మార్కరమ్‌ను, చివరి బంతికే డేంజరస్‌ మ్యాన్‌ హెన్రిచ్‌ క్లాసెన్‌ను అవుట్‌ చేసి మ్యాచ్‌ను ఆర్సీబీ చేతుల్లో పెట్టాడు.

తాజాగా గుజరాత్‌ టైటాన్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ వేసి, ఫస్ట్‌ ఓవర్‌లోనే గుజరాత్‌ టైటాన్స్‌ ఓపెనర్‌ వృద్ధిమాన్‌ సాహాను అవుట్‌ చేసి ఆర్సీబీకి మంచి స్టార్ట్‌ ఇచ్చాడు. మొత్తం 3 ఓవర్లు బౌలింగ్‌ చేసిన స్వప్నిల్‌ సింగ్‌.. కేవలం 23 పరుగులు మాత్రమే ఇచ్చి, ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. ఇలా ఆర్సీబీకిలోకి ఎంట్రీ ఇచ్చి.. మంచి ప్రదర్శనతో ఏకంగా జట్టు తలరాతనే మార్చేశాడు. అతని రాకతో ఆర్సీబీ జాతకమే మారిపోయిందని, పైగా కేవలం అదృష్టం మాత్రమే కాకుండా.. అతను బ్యాటింగ్‌, బౌలింగ్‌లో కూడా అదరగొడుతున్నాడంటూ.. ఆర్సీబీ ఫ్యాన్స్‌ స్వప్నిల్‌ సింగ్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇతన్ని ఎప్పుడో ఆడించే ఉంటే.. ఈ పాటికి ఆర్సీబీ టేబుల్‌ టాపర్‌గా ఉండేదని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments