SNP
SNP
సూర్యకుమార్ యాదవ్.. ఈ మధ్య కాలంలో బాగా విమర్శల పాలైన క్రికెటర్. వరల్డ్ కప్ టీమ్‌కు ఎంపిక కావడమే అతను చేసిన తప్పైపోయింది. టీ20 క్రికెట్‌లో వరల్డ్ నంబర్ వన్‌గా ఉన్న సూర్యను.. వన్డేలో ఆడించి కీలక ప్లేయర్‌గా వాడుకోవాలని టీమ్ మేనేజ్‌మెంట్ భావిస్తూ.. చాలా కాలంగా అతనికి వన్డేల్లో అవకావం ఇస్తోంది. ఈ క్రమంలోనే వరల్డ్ కప్ టీమ్‌లో ఒక ఫినిషర్ ఉండాలనే ఉద్దేశంతో సూర్యను వరల్డ్ కప్ స్క్వౌడ్‌లోకి తీసుకుంది. అయితే.. సూర్య ఎంపికపై కొంతమంది క్రికెట్ అభిమానులు విమర్శల వర్షం కురిపించారు. సంజు శాంసన్ లాంటి వన్డే ఫార్మాట్‌కు సరిగ్గా సరిపోయే క్రికెటర్‌ను కాదని, సూర్యను ఎలా ఎంపిక చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నించారు.
సూర్య కంటే సంజుకు వన్డేల్లో మెరుగైన గణాంకాలు ఉండటంతో వారి వాదనకు కూడా మద్దతు లభించింది. కానీ, సూర్యను నమ్మిన టీమిండియా మేనేజ్‌మెంట్.. ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న వన్డే సిరీస్‌లో ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడించి, క్వాలిటీ గేమ్ టైమ్ లభించేలా ప్లాన్‌చేసింది. వరల్డ్ కప్‌కు ముందు తనను తాను నిరూపించుకోవడానికి వచ్చిన అవకాశాన్ని సూర్యకుమార్ యాదవ్ అద్భుతంగా వాడుకున్నాడు. మొహాలీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి మ్యాచ్‌లో 49 బంతుల్లో 5 ఫోర్లు, ఒక సిక్స్‌తో వన్డే ఇన్నింగ్స్ ఎలా ఉండాలో అలా ఆడాడు.
ఇక ఆదివారం ఇండోర్ వేదికగా జరిగిన రెండో వన్డేలో.. తొలి మ్యాచ్‌కు పూర్తి భిన్నమైన ఇన్నింగ్స్ ఆడాడు. ఎందుకంటే.. రెండో వన్డేలో సూర్య క్రీజ్‌లోకి వచ్చేసరికి పరిస్థితులు వేరేగా ఉన్నాయి. అప్పటికే శ్రేయస్ అయ్యర్, శుబ్‌మన్ గిల్ సెంచరీలతో చెలరేగి.. భారీ స్కోర్ అందించారు. మరో 15 ఓవర్లు ఉన్న సమయంలో బ్యాటింగ్‌కు వచ్చిన సూర్య.. టీ20 క్రికెట్‌లో ఓ ఫినిషర్ రోల్‌ను ఇక్కడ వన్డే మ్యాచ్‌లో అద్భుతంగా పోషించాడు. కెప్టెన్ కేఎల్ రాహుల్‌తో కలిసి సూపర్ ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 37 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సులతో 72 పరుగులు చేసి.. సూర్యను టీమ్ మేనేజ్‌మెంట్ దేనికోసమైతే వన్డేల్లో ఆడించాలని అనుకుంటుందో అదే చేసి చూపించాడు. పైగా కామెరున్ గ్రీన్ వేసిన ఓ ఓవర్‌లో వరుసగా 4 సిక్సులు బాదాడు.
యువరాజ్ సింగ్ ఆరు బంతుల్లో ఆరు సిక్సుల రికార్డ్ బ్రేక్ చేస్తాడేమో అనుకున్నారంతా.. కానీ, 4 సిక్సులతో ఆగిపోయాడు. అయితే.. గ్రీన్, ఐపీఎల్‌లో సూర్యతో కలిసి ముంబై ఇండియన్స్ టీమ్‌కే ఆడుతున్న విషయం తెలిసిందే. అయినా కూడా తోటి టీమ్‌మేట్ అనే కనికరంగా లేకుండా గ్రీన్ బౌలింగ్‌ను సూర్య చితక్కొట్టాడంటూ నెటిజన్లు సరదాగా పేర్కొంటున్నారు. ఈ ఇన్నింగ్స్‌తో ఆస్ట్రేలియా లాంటి పటిష్టమైన జట్టుపై సూర్య రెండు వరుస హాఫ్ సెంచరీలు చేసి.. వరల్డ్ కప్‌కు ముందే తనను వన్డేలకు సెట్ అవుతానని నిరూపించుకుంటున్నారు. మరి ఆస్ట్రేలియాతో జరిగిన రెండు వన్డేల్లో సూర్య ప్రదర్శన తర్వాత.. వరల్డ్ కప్‌కు ఓ ఫినిషర్ రూపంలో సూర్య ఎంపిక సరైందే అని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
People thought Surya Kumar yadav can’t play ODIs so guy has decided to play T20 in ODIs
4 balls 4 sixes🔥
SKY on fire…#SuryakumarYadav#INDvAUS #IndvsAus2023 pic.twitter.com/PZ3R484BEr— Chunnilal Choudhary (@c_l_bhadu) September 24, 2023
ఇదీ చదవండి: BREAKING: కపిల్ దేవ్ కిడ్నాప్? గంభీర్ పోస్ట్ క్షణాల్లో వైరల్!