Somesekhar
ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ డెసిషన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపుతున్న కేకేఆర్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకోబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఆ డెసిషన్ ఏంటి? తెలుసుకుందాం పదండి.
Somesekhar
సునీల్ నరైన్.. ఈ ఐపీఎల్ సీజన్ లో దుమ్మురేపే ఆటతీరుతో అదరగొడుతున్నాడు. ఇటు బ్యాటింగ్ అటు బౌలింగ్ రెండు విభాగాల్లో రాణిస్తూ.. కోల్ కత్తా నైట్ రైడర్స్ విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇటీవలే రాజస్తాన్ తో జరిగిన మ్యాచ్ లో మెరుపు సెంచరీతో ఐపీఎల్ లో తొలి శతకాన్ని నమోదు చేసుకున్నాడు. ఈ క్రమంలోనే సునీల్ నరైన్ సంచలన నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇంతకీ ఆ నిర్ణయం ఏంటంటే?
వెస్టిండీస్ మాజీ క్రికెటర్, కోల్ కత్తా నైట్ రైడర్స్ స్టార్ ప్లేయర్ సునీల్ నరైన్ కీలక నిర్ణయం తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. నరైన్ గతేడాది నవంబర్ లో తన ఇంటర్ నేషనల్ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. చివరిసారిగా అతడు విండీస్ తరఫున 2019లో మ్యాచ్ ఆడాడు. కాగా.. ప్రస్తుతం నరైన తన రిటైర్మెంట్ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని భావిస్తున్నాడట. జూన్ లో టీ20 వరల్డ్ కప్ ప్రారంభం కానున్న నేపథ్యంలో, వెస్టిండీస్ క్రికెట్ బోర్డు సూచనల మేరకు నరైన్ తిరిగి విండీస్ జాతీయ జట్టులోకి వచ్చేందుకు సిద్దమైతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అదీకాక ఇటీవలే విండీస్ కెప్టెన్ రోవ్ మన్ పావెల్ సైతం నరైన్ ను రిటైర్మెంట్ వెనక్కు తీసుకుని టీ20 వరల్డ్ కప్ లో ఆడాలని ఏడాది కాలంగా బతిమిలాడుతున్నట్లు చెప్పుకొచ్చాడు.
అయితే ఈ విషయంపై విండీస్ క్రికెట్ వర్గాల నుంచి కానీ, సునీల్ నరైన్ నుంచి కానీ ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఒకవేళ నరైన్ తన రిటైర్మెంట్ ను వెనక్కి తీసుకుని టీ20 వరల్డ్ కప్ బరిలోకి దిగితే.. ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టాల్సిందే. ఎందుకంటే? ప్రస్తుతం అతడు భీకరఫామ్ లో ఉన్నాడు. ఇదే పొట్టి వరల్డ్ కప్ లో కొనసాగిస్తే.. హిట్టర్లు ఉన్న విండీస్ కు టీ20 వరల్డ్ కప్ కొట్టడం పెద్ద కష్టమైన పనికాదు. ఇక నరైన్ ఈ ఐపీఎల్ సీజన్ లో ఇప్పటి వరకు ఆరు మ్యాచ్ లు ఆడి 276 పరుగులు చేశాడు. అటు బౌలింగ్ లో 7 వికెట్లు కూల్చాడు. దీంతో అతడిని టీ20 వరల్డ్ కప్ జట్టులోకి తీసుకురావాలని విండీస్ బోర్డు ప్లాన్ చేస్తోంది. మరి నరైన్ విండీస్ టీమ్ లోకి వస్తే.. ఎలా ఉంటుంది? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.