వన్డే వరల్డ్ కప్-2023లో పొరుగు దేశం శ్రీలంకకు ఏదీ కలసి రావడం లేదు. హసరంగ లాంటి స్టార్ ఆల్‌రౌండర్ ఇంజ్యురీ కారణంగా టీమ్‌కు దూరమవ్వడం ఆ జట్టును బాగా దెబ్బతీసింది. గాయాల వల్ల కీలక ప్లేయర్లు దూరమైనా ప్రపంచ కప్‌లో మొండి ధైర్యంతో ఆడుతున్నారు సింహళీయులు. ముఖ్యంగా ఆ టీమ్ బ్యాటర్ కుశాల్ మెండిస్ బ్యాటింగ్ చేస్తున్న తీరు అందర్నీ విస్మయానికి గురిచేస్తోంది. ఎంతో ఎక్స్‌పీరియెన్స్ ఉన్న ప్లేయర్లా ప్రత్యర్థి బౌలర్లను అతడు ఓ ఆటాడుకుంటున్నాడు. అయితే సౌతాఫ్రికాపై సెంచరీ కొట్టిన తర్వాత అతడు ఆస్పత్రిలో చేరాడు.
లంక యంగ్ పేసర్ మతీషా పతిరానా కూడా భుజం గాయం కారణంగా టోర్నీలో ఒకట్రెండు మ్యాచులకు దూరమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మెగా టోర్నీలో ఆడిన రెండు మ్యాచుల్లోనూ లంక ఓటమి పాలైంది. ఇంకా ఆ టీమ్ బోణీ కొట్టలేదు. ఇలాంటి టైమ్‌లో శ్రీలంకకు బిగ్ షాక్ తగిలింది. ఆ టీమ్ కెప్టెన్ దసున్ షనక గాయం కారణంగా వరల్డ్ కప్ మొత్తానికి దూరమయ్యాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్న షనక.. మెగా టోర్నీ నుంచి పూర్తిగా తప్పుకున్నాడు.
షనక ఇంజ్యురీ బారిన పడటం, అతడు వరల్డ్ కప్‌కు దూరమైన విషయాన్ని శ్రీలంక క్రికెట్ బోర్డు అధికారికంగా ధృవీకరించింది. మెగా టోర్నీలో భాగంగా పాకిస్థాన్ జట్టుతో అక్టోబర్ 10వ తేదీన హైదరాబాద్ వేదికగా జరిగిన మ్యాచ్‌లో షనక కుడి తొడకు గాయమైంది. లంక కెప్టెన్ గాయం నుంచి కోలుకునేందుకు 3 నుంచి 4 వారాల టైమ్ పట్టనున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో మెగా టోర్నీ నుంచి అతడు వైదొలిగాడు. షనక ప్లేసులో ఆల్‌రౌండర్ కరుణరత్నేను తీసుకుంది లంక టీమ్. స్టార్ ప్లేయర్లు దూరమై సతమతమవుతున్న టైమ్‌లో కెప్టెన్ షనక కూడా ఆడకపోవడం ఆ టీమ్‌పై భారీగా ప్రభావం చూపే ఛాన్స్ ఉంది. మిగిలిన మ్యాచుల్లో లంక ఎలా ఆడుతుందో చూడాలి.
ఇదీ చదవండి: World Cup: ఇండియాపై పాక్ ఓటమి తర్వాత.. షోయబ్ అక్తర్ షాకింగ్ కామెంట్స్!
Dasun Shanaka ruled out of the 2023 World Cup due to a quadriceps injury.
Chamika Karunaratne has replaced him. pic.twitter.com/wYTi5FC7Q1
— Mufaddal Vohra (@mufaddal_vohra) October 15, 2023