సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌లోకి రాహుల్‌ ద్రవిడ్‌? కావ్య కష్టానికి ప్రతిఫలం!

SRH, Rahul Dravid, Kavya Maran, IPL 2025: రాహుల్‌ ద్రవిడ్‌ను తమ టీమ్‌లోకి తీసుకొచ్చేందుకు చాలా ఐపీఎల్‌ టీమ్స్‌ ఇప్పుటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే.. ద్రవిడ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

SRH, Rahul Dravid, Kavya Maran, IPL 2025: రాహుల్‌ ద్రవిడ్‌ను తమ టీమ్‌లోకి తీసుకొచ్చేందుకు చాలా ఐపీఎల్‌ టీమ్స్‌ ఇప్పుటి నుంచే ప్రయత్నాలు మొదలుపెట్టాయి. అయితే.. ద్రవిడ్‌ గురించి ఓ ఆసక్తికర విషయం తెలుస్తోంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

భారత జట్టు హెడ్‌ కోచ్‌గా రాహుల్‌ ద్రవిడ్‌ పదవీ కాలం ముగిసిపోయింది. 2021 ఏడాది చివర్లో టీమిండియా హెడ్‌ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. ఇటీవల ముగిసిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో ఇండియాను ఛాంపియన్‌గా నిలిపి.. హెడ్‌ కోచ్‌ పదవికి వీడ్కోలు పలికారు. అంతకంటే ముందు.. టీ20 వరల్డ్‌ కప్‌ 2022లో టీమిండియా సెమీ ఫైనల్‌ ఆడింది, ఆలాగే ఆసియా కప్‌ గెలిచింది, 2023లో వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌ ఫైనల్‌ ఆడింది, ఆ తర్వాత వన్డే వరల్డ్‌ కప్‌ 2023 రన్నరప్‌గా నిలిచింది భారత జట్టు. ఒక హెడ్‌ కోచ్‌గా ఇది రాహుల్‌ ద్రవిడ్‌ ట్రాక్‌ రికార్డ్‌.

ఇంత అద్భుతమైన కోచ్‌.. ప్రస్తుతం ఖాళీగా ఉన్నాడు. టీమిండియా హెడ్‌ కోచ్‌ పదవి నుంచి తప్పుకుంటా.. నేను రేపటి నుంచి నిరుద్యోగిని నాకు ఎవరైన పని కల్పించండి అంటూ ద్రవిడ్‌ సరదా చెప్పిన మాటను సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ చాలా సీరియస్‌గా తీసుకుంది. రాహుల్‌ ద్రవిడ్‌ను తమ జట్టుకు హెడ్‌ కోచ్‌గా నియమించుకునేందుకు సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఓనర్‌ కావ్య మారన్‌ విశ్వప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఐపీఎల్‌ 2025 సీజన్‌కి ముందు ఎలాగో మెగా వేలం జరగనుంది.

ఆ వేలానికి ముందు రాహుల్‌ ద్రవిడ్‌ను తమ హెడ్‌ కోచ్‌గా లేదా మెంటర్‌గా తెచ్చుకుంటే.. ఇండియన్‌ క్రికెట్‌పై మంచి పట్టుకున్న ద్రవిడ్‌ ఎక్స్‌పీరియన్స్‌ తమకు వేలంతో పాటు వచ్చే సీజన్‌లో బాగా ఉపయోగపడుతుందని కావ్య మారన్‌ ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఎస్‌ఆర్‌హెచ్‌ హెడ్‌ కోచ్‌గా న్యూజిలాండ్‌ మాజీ క్రికెటర్‌ డానియల్‌ వెట్టోరి ఉన్నాడు. అతన్ని కోచ్‌గా కొనసాగిస్తూ.. ద్రవిడ్‌ను మెంటర్‌గా నియమించాలని ఎస్‌ఆర్‌హెచ్‌ మేనేజ్‌మెంట్‌ స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయినట్లు సమాచారం. ఎస్‌ఆర్‌హెచ్‌తో పాటు ద్రవిడ్‌ కోసం కేకేఆర్‌, రాజస్థాన్‌ రాయల్స్‌ టీమ్స్‌ కూడా పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. మరి ద్రవిడ్‌ ఎస్‌ఆర్‌హెచ్‌ మెంటర్‌గా వస్తే ఎలా ఉంటుందో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments