చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా రికార్డ్ బ్రేక్!

చరిత్ర సృష్టించిన సౌతాఫ్రికా.. టీమిండియా రికార్డ్ బ్రేక్!

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించి.. సూపర్ 8కు చేరుకుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలోనే టీమిండియా రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో భాగంగా బంగ్లాదేశ్ పై అద్భుత విజయం సాధించి.. సూపర్ 8కు చేరుకుంది సౌతాఫ్రికా. ఈ నేపథ్యంలోనే టీమిండియా రికార్డును బద్దలు కొట్టింది. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ 2024లో స్వల్ప స్కోర్ల సంప్రదాయం కొనసాగుతోంది. టోర్నీలో భాగంగా సోమవారం సౌతాఫ్రికా వర్సెస్ బంగ్లాదేశ్ మధ్య మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో తొలుత బ్యాటింగ్ చేసిన సఫారీ టీమ్ బంగ్లా బౌలర్ల ధాటికి 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి కేవలం 113 పరుగులు మాత్రమే చేసింది. దాంతో ప్రోటీస్ టీమ్ కు ఓటమి ఖాయమని అందరూ అనుకున్నారు. కానీ అద్భుతంగా రాణించిన సౌతాఫ్రికా బౌలర్లు బంగ్లాను 109 పరుగులకే కట్టడిచేసి ప్రపంచ క్రికెట్ ను ఆశ్చర్యపరిచింది. ఈ క్రమంలోనే టీమిండియా రికార్డును బద్దలు కొట్టింది ప్రోటీస్ టీమ్. ఆ వివరాల్లోకి వెళితే..

టీ20 వరల్డ్ కప్ లో సౌతాఫ్రికా తన జోరును కొనసాగిస్తోంది. గ్రూప్-డి లో ఆడిన మూడు మ్యాచ్ ల్లో గెలిచి.. సూపర్ 8కి అర్హత సాధించింది. ఇక బంగ్లాతో జరిగిన మ్యాచ్ లో 114 పరుగుల సింపుల్ టార్గెట్ ను కాపాడుకుని పలు రికార్డులు బద్దలు కొట్టింది ప్రోటీస్ టీమ్. ఈ క్రమంలోనే ఇండియా, శ్రీలంక రికార్డులను బద్దలు కొట్టింది సఫారీ టీమ్. టీ20 వరల్డ్ కప్ చరిత్రలో తక్కువ స్కోర్ ను డిఫెండ్ చేసిన టీమ్ గా దక్షిణాఫ్రికా ఘనత వహించింది. అంతకు మందు ఈ రికార్డు శ్రీలంక, ఇండియా పేరుమీద ఉంది.

2014లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో శ్రీలంక, ఇటీవల పాకిస్తాన్ తో ముగిసిన మ్యాచ్ లో టీమిండియా 120 పరుగుల స్కోర్ ను కాపాడుకున్నాయి. ఈ జాబితాలో తర్వాత ఆఫ్గానిస్తాన్(124 వర్సెస్ వెస్టిండీస్), న్యూజిలాండ్(127 వర్సెస్ ఇండియా) ఉన్నాయి. ఈ ఘనతతో పాటుగా మరో రికార్డును కూడా తన ఖాతాలో వేసుకుంది సౌతాఫ్రికా. టీ20 వరల్డ్ కప్ హిస్టరీలో 5 పరుగుల కంటే తక్కువ తేడాతో ఎక్కువ సార్లు గెలిచిన జట్టుగా సఫారీ టీమ్ చరిత్ర సృష్టించింది. నాలుగు సార్లు 5 రన్స్ కంటే తక్కువ పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇక బంగ్లాదేశ్ పై దక్షిణాఫ్రికాకు ఇది వరుసగా 9వ విజయం కావడం విశేషం. ఈ జాబితాలో ఆస్ట్రేలియా(10), పాకిస్తాన్(9) తర్వాత స్థానంలో ప్రోటీస్ టీమ్ నిలిచింది. మరి ఒక్క విజయంతో ఇన్ని రికార్డులు బద్దలు కొట్టిన దక్షిణాఫ్రికా టీమ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments