వీడియో: కళ్లు చెదిరే క్యాచ్‌తో రిషబ్ పంత్‌ను వెనక్కి పంపిన శుబ్‌మన్‌ గిల్‌! చూసి తీరాల్సిన క్యాచ్‌

Rishabh Pant, Shubman Gill, Duleep Trophy 2024, IND B vs IND A: ఎప్పుడూ బ్యాట్​తో మెరుపులు మెరిపించే స్టార్ ప్లేయర్ శుబ్​మన్ గిల్.. ఈసారి ఫీల్డింగ్​లో తడాఖా చూపించాడు. స్టన్నింగ్ క్యాచ్​తో పించ్ హిట్టర్ రిషబ్ పంత్​ను పెవిలియన్​కు పంపించాడు.

Rishabh Pant, Shubman Gill, Duleep Trophy 2024, IND B vs IND A: ఎప్పుడూ బ్యాట్​తో మెరుపులు మెరిపించే స్టార్ ప్లేయర్ శుబ్​మన్ గిల్.. ఈసారి ఫీల్డింగ్​లో తడాఖా చూపించాడు. స్టన్నింగ్ క్యాచ్​తో పించ్ హిట్టర్ రిషబ్ పంత్​ను పెవిలియన్​కు పంపించాడు.

ఎప్పుడూ బ్యాట్​తో మెరుపులు మెరిపిస్తుంటాడు టీమిండియా వైస్ కెప్టెన్ శుబ్​మన్ గిల్. క్రీజులోకి దిగింది మొదలు క్లాసిక్ షాట్లతో ప్రత్యర్థుల భరతం పడతాడు. మ్యాచ్ పూర్తవకుండా క్రీజును విడవని ఈ యంగ్ బ్యాటర్ ఫీల్డింగ్​లోనూ తోపే. తాజాగా అతడు ఫీల్డింగ్​లో తన తడాఖా చూపించాడు. స్టన్నింగ్ క్యాచ్​తో అందరి నుంచి ప్రశంసలు అందుకుంటున్నాడు. అసాధ్యమైన క్యాచ్​ను అవలీలగా అందుకొని పించ్ హిట్టర్ రిషబ్ పంత్​ను పెవిలియన్​కు పంపించాడు. దులీప్ ట్రోఫీ-2024లో భాగంగా ఇండియా బీ-ఇండియా ఏ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో గిల్ ఓ బ్రిలియంట్ క్యాచ్ అందుకున్నాడు. పంత్ ఇచ్చిన క్యాచ్​ను పక్షిలా ఎగురుకుంటూ పట్టేశాడు.

ఇండియా బీ ఇన్నింగ్స్ 36వ ఓవర్​లో బౌలింగ్ వేసేందుకు వచ్చాడు ఆకాశ్ దీప్. కట్టుదిట్టమైన బౌలింగ్​తో బ్యాటర్లను కట్టిపడేసిన అతడు.. పంత్​కు కూడా ఎలాంటి అవకాశం ఇవ్వలేదు. అప్పటికే ఒక బౌండరీ కొట్టి మంచి ఊపు మీదున్న పంత్.. అదే క్రమంలో ఆకాశ్ ఓవర్​లో మరో భారీ షాట్​కు ప్రయత్నించాడు. గుడ్ లెంగ్త్​లో పడిన బంతిని లెగ్ సైడ్ బిగ్ షాట్​గా మలిచేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగ్గా కనెక్ట్ అవకపోవడంతో బంతి గాల్లోకి లేచింది. అంతే మిడాఫ్​లో ఫీల్డింగ్​ చేస్తున్న గిల్ చిరుతలా పరిగెత్తాడు. బంతి వేగాన్ని, అది వెళ్తున్న దిశను అంచనా వేసి దాన్ని వెంబడించాడు. బాల్ కాస్త దూరంలో ఉండటంతో గాల్లోకి డైవ్ చేసి క్యాచ్ అందుకున్నాడు. సింగిల్ హ్యాండ్​తో క్యాచ్ పట్టుకున్నాడు. బంతిని అందుకున్నప్పుడు గిల్ శరీరం పూర్తిగా గాల్లోనే ఉంది. పక్షిలా అమాంతం ఎగిరి బాల్​ను ఒడిసిపట్టాడతను.

క్యాచ్ అందుకున్న తర్వాత బాడీని అంతే ఒడుపుగా ల్యాండ్ చేశాడు గిల్. అనంతరం బంతిని గాల్లోకి విసిరి సెలబ్రేట్ చేసుకున్నాడు. శుబ్​మన్ క్యాచ్ చూసి బ్యాటర్ పంత్​తో పాటు సొంత జట్టు ఆటగాళ్లు కూడా షాకయ్యారు. ఏం పట్టాడు అంటూ అతడ్ని మెచ్చుకున్నారు. భారీ ఇన్నింగ్స్ ఆడదామని అనుకున్న పంత్.. గిల్ క్యాచ్ దెబ్బకు నిరాశతో పెవిలియన్ దిశగా సాగాడు. ఇక, ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్​కు దిగిన ఇండియా బీ ప్రస్తుతం 7 వికెట్ల నష్టానికి 124 పరుగులతో ఉంది. ముషీర్ ఖాన్ (50 నాటౌట్)తో పాటు నవ్​దీప్ సైనీ (7 నాటౌట్) క్రీజులో ఉన్నారు. ముషీర్ ఎంత సేపు క్రీజులో ఉంటాడనే దాని మీదే ఆ టీమ్ భారీ స్కోరు అవకాశాలు ఆధారపడి ఉన్నాయి. కనీసం 200 మార్క్​ను కూడా చేరుకోకపోతే ఇండియా బీకి కష్టాలు తప్పవు. కానీ సిచ్యువేషన్ చూస్తుంటే ఆ మార్క్​ను టీమ్ అందుకోవడం సాధ్యమయ్యేలా లేదు. అటు ఇండియా ఏ బౌలర్లు ఖలీల్ అహ్మద్ (2 వికెట్లు), ఆకాశ్ దీప్ (2 వికెట్లు), ఆవేశ్ ఖాన్ (2 వికెట్లు) మంచి ఊపు మీద ఉన్నారు. వీళ్లు 150 లోపే ప్రత్యర్థిని ఆలౌట్ చేయాలని చూస్తున్నారు. మరి.. గిల్ స్టన్నింగ్ క్యాచ్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

Show comments