ఇప్పుడు జరిగేదంతా ఫ్రాడ్‌ క్రికెట్‌.. అందుకే సచిన్‌ని గౌరవిస్తా: పాక్‌ క్రికెటర్‌ అక్తర్‌

నిత్యం వివాదాస్పద కామెంట్‌తో వార్తల్లో నిలిచే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తాజాగా మరో భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఏకంగా ఇప్పుడు ఆడుతున్న క్రికెట్‌ అంతా ఫ్రాడ్‌ అంటూ పేర్కొన్నాడు. అయితే.. అక్తర్‌ అలా ఎందుకన్నాడు? అని వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

నిత్యం వివాదాస్పద కామెంట్‌తో వార్తల్లో నిలిచే పాకిస్థాన్‌ మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌ తాజాగా మరో భారీ స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. ఏకంగా ఇప్పుడు ఆడుతున్న క్రికెట్‌ అంతా ఫ్రాడ్‌ అంటూ పేర్కొన్నాడు. అయితే.. అక్తర్‌ అలా ఎందుకన్నాడు? అని వ్యాఖ్యల వెనుక అర్థం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..?

ఏదో ఒక వివాదాస్పద కామెంట్‌ చేస్తూ నిత్యం వార్తల్లో నిలిచే మాజీ క్రికెటర్‌ షోయబ్‌ అక్తర్‌. ఈ పాకిస్థానీ మాజీ క్రికెటర్‌ తాజాగా ఓ భారీ స్టేట్‌మెంట్‌ను పాస్‌ చేశాడు. ప్రస్తుతం ఆడుతున్న క్రికెట్‌ అంతా ఫ్రాడ్‌ క్రికెట్‌ అంటూ వివాదాస్పద కామెంట్‌ చేశాడు. ఓ ఇంటర్వ్యూలో అక్తర్‌ మాట్లాడుతూ.. ప్రస్తుతం క్రికెట్‌ అంతా ఫ్రాడ్‌ అని పేర్కొన్నాడు. ఒకే ఇన్నింగ్స్‌లో రెండు కొత్త బాల్స్‌ వాడుతున్నారని, గతంలో అలా కాదని ఒకే బాల్‌తో ఆడేవారని అన్నాడు. షేన్‌ వార్న్‌, వసీం అక్రమ్‌, వకార్‌ యూనిస్‌, షక్లైన్‌ లాంటి బౌలర్లు ఎక్కడున్నారో చూపించండి. బౌండరీ బయట అప్పట్లో ఆరుగురు ఉండేవారని.. సాఫ్ట్‌ బాల్‌తో ఇలాంటి గొప్ప బౌలర్లను ఎదుర్కొన సచిన్‌ టెండూల్కర్‌, ఇంజుమామ్‌, యూసూఫ్‌ లాంటి వాళ్లు 50 ఓవర్ల మ్యాచ్‌లో సెంచరీ చేసేవారని, అందుకే నేను సచిన్‌ టెండూల్కర్‌ను అంతా గౌరవిస్తానని అన్నాడు.

ఇప్పటి తరం వారు రెండు కొత్త బాల్స్‌తో ఆడి టన్నుల కొద్ది పరుగులు చేస్తున్నారని, వాళ్లు భారీ రన్స్‌ కొడుతూ, డబ్బులు సంపాదిస్తూ, ఫాలోవర్లను పెంచుకోవడం మంచిదే, ఆ విషయంలో నేను వాళ్లను చూసి కుళ్లుకోవడం లేదని, కానీ, గతంలో ఆడిన క్రికెట్‌ వేరని పేర్కొన్నాడు. కాగా, అక్తర్‌ వ్యాఖ్యలతో కొంతమంది క్రికెట్‌ అభిమానులు ఏకీభవిస్తుంటే.. మరికొంతమంది విభేదిస్తున్నారు. అప్పటి తరానికి ఇప్పటి తరానికి పోలీక పెట్టడం సరికాదని, ఇప్పుడంతా వేగవంతమైన క్రికెట్‌ అని అప్పటికి ఇప్పటికి చాలా మార్పులు వచ్చాయని, రెండు తరాల మధ్య పోలిక సరికాదని అంటున్నారు. అయితే.. అక్తర్‌ ఎక్కువగా టీమిండియా క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మపైనే పడి ఏడుస్తున్నాడంటూ కొంతమంది అభిమానులు విమర్శిస్తున్నారు.

ముఖ్యంగా కోహ్లీ చేస్తున్న సెంచరీ, ఉన్న ఫామ్‌ చూసి అక్తర్‌ కుళ్లుకుంటున్నాడంటూ మండిపడుతున్నారు. అప్పుడున్న గొప్ప బౌలర్లు ఇప్పుడు లేకపోవచ్చని, అలాగే ఇప్పుడున్న బౌలర్లను కూడా తక్కువగా అంచనా వేయాల్సిన అవసరం లేదని అంటున్నారు. అప్పట్లో స్పిన్‌ ఆడే టెక్నిక్‌, ఇప్పుడున్న బ్యాటర్ల టెక్నిక్‌కు చాలా తేడా ఉందని, దాదాపు చాలా మంది బ్యాటర్లు అన్ని రకాల షాట్లు, అన్ని రకాల బాల్స్‌ను ఆడటం తీవ్రంగా ప్రాక్టీస్‌ చేస్తుండటంతో వరల్డ్‌ క్రికెట్‌లో బ్యాటర్ల డామినేషన్‌ పెరిగింది, తప్పా.. ఇప్పుడుతున్న బౌలర్లు తక్కువ వారేం కాదని అక్తర్‌కు చురకలు అంటిస్తున్నారు. మరి అక్తర్‌ చేసిన ఈ వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments