క్రికెట్లో రోజుకో రికార్డు నమోదు అవుతూ ఉంటుంది. అలాగే మరికొన్ని రికార్డులు బద్దలు అవుతూ ఉంటాయి. తాజాగా మరో రికార్డు నమోదు అయ్యింది. ప్రస్తుతం టీ20 బ్లాస్ట్ లీగ్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ లీగ్ లో ఇప్పటికే పలు రికార్డులు నమోదు అయిన సంగతి కూడా తెలిసిందే. తాజాగా శుక్రవారం వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో నాటింగ్ హమ్ ఆటగాడు, పాక్ పేసర్ షాహీన్ అఫ్రిది సరికొత్త చరిత్ర నెలకొల్పాడు. దాంతో టీ20 హిస్టరీలో ఈ ఘతన సాధించిన తొలి బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు ఈ పాక్ పేసర్. మరి అతడు సాధించిన రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
షాహీన్ అఫ్రిది.. అతి తక్కువ కాలంలోనే వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ఓ బ్రాండ్ ను క్రియేట్ చేసుకున్నాడు. అద్భుతమైన పేస్ ఎటాక్ తో ప్రత్యర్థిని ఉక్కిరిబిక్కిరి చేయగల సత్తా షాహీన్ సొంతం. తాజాగా జరుగుతున్న టీ20 బ్లాస్ట్ లీగ్ లో నాటింగ్ హమ్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు ఈ స్టార్ పేసర్. ఇక నిన్న (జూన్ 30)న వార్విక్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో చరిత్ర సృష్టించాడు. తొలి ఓవర్ లో ఏకంగా నాలుగు వికెట్లు పడగొట్టాడు. దాంతో టీ20 చరిత్రలో తొలి ఓవర్లోనే నాలుగు వికెట్లు పడగొట్టిన తొలి బౌలర్ గా ఘనతకెక్కాడు.
ఇక ఈ ఓవర్ లో 7 పరుగులు వచ్చాయి. ఇందులో 5 రన్స్ వైడ్ల రూపంలో రావడం గమనార్హం. ఈ వికెట్లలో మూడు గోల్డెన్ డకౌట్ లు ఉండటం విశేషం. ఇప్పటి వరకు టీ20లో ఇలా తొలి ఓవర్ లోనే నాలుగు వికెట్లు తీసిన బౌలర్ లేడు. అయితే వన్డేల్లో మాత్రం శ్రీలంక దిగ్గజ బౌలర్ చమిందా వాస్ ఈ రికార్డు సాధించాడు. 2003 వరల్డ్ కప్ లో భాగంగా.. బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో వాస్ హ్యాట్రిక్ తో పాటుగా 4 వికెట్లు పడగొట్టాడు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్ చేసిన నాటింగ్ హమ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 168 పరుగులకు ఆలౌట్ అయ్యింది. అనంతరం 169 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన వార్విక్ షైర్ కు తొలి ఓవర్ లోనే షాహిన్ అఫ్రిది రూపంలో భారీ ఎదురుదెబ్బతగిలింది. అతడు తొలి ఓవర్ లోనే నాలుగు వికెట్లు తీసి.. వార్విక్ షైర్ జట్టును దెబ్బకొట్టాడు. దాంతో నాటింగ్ హమ్ జట్టు విజయం సాధిస్తుందని అందరు అనుకున్నారు. కానీ అనూహ్యంగా పుంజుకున్న షైర్ జట్టు 19.1 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Shaheen Afridi, you cannot do that!! 💥 https://t.co/ehXxmtz6rX pic.twitter.com/wvibWa17zA
— Vitality Blast (@VitalityBlast) June 30, 2023