నేను బెస్ట్‌ స్పిన్నర్‌ని.. టీమ్‌లోకి తీసుకోండి! సెలెక్టర్లుకు యువ బౌలర్‌ ఛాలెంజ్‌

Sai Kishore, Team India: భారత క్రికెట్‌ జట్టులోకి తనను తీసుకోవాలని.. ఇండియాలో ఉన్న బెస్ట్‌ స్పిన్నర్లలో తాను కూడా ఒకడినంటూ ఓ యువ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

Sai Kishore, Team India: భారత క్రికెట్‌ జట్టులోకి తనను తీసుకోవాలని.. ఇండియాలో ఉన్న బెస్ట్‌ స్పిన్నర్లలో తాను కూడా ఒకడినంటూ ఓ యువ క్రికెటర్‌ సంచలన స్టేట్‌మెంట్‌ ఇచ్చాడు. మరి ఆ క్రికెటర్‌ ఎవరో ఇప్పుడు చూద్దాం..

టీమిండియాకు అంతర్జాతీయ మ్యాచ్‌లు వచ్చే నెల 19 నుంచి మొదలు కానున్నాయి.. బంగ్లాదేశ్‌తో రెండు టెస్టుల సిరీస్‌ ఆడనుంది. ఆ సిరీస్‌ కంటే ముందు.. టీమిండియాలోని చాలా మంది ప్లేయర్లు.. సెప్టెంబర్‌ 5 నుంచి మొదలుకానున్న దులీప్‌ ట్రోఫీలో ఆడనున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మ, జస్ప్రీత్‌ బుమ్రా లాంటి స్టార్లు కాకుండా.. మిగతా ఆటగాళ్లంతా దేశవాళి టోర్నీలో ఆడుతున్నారు. శుబ్‌మన్‌ గిల్‌, రిషభ్‌ పంత్‌, కేఎల్‌ రాహుల్‌, మొహమ్మద్‌ సిరాజ్‌, జడేజా ఇలా స్టార్లంతా డొమెస్టిక్‌ బరిలో దిగనున్నారు. దులీప్‌ టోర్నీలో చూపించిన ప్రతిభ ఆధారంగానే రానున్న బంగ్లాదేశ్‌ టెస్ట్‌ సిరీస్‌ కోసం భారత జట్టును ఎంపిక చేస్తామని ఇప్పటికే భారత సెలెక్టర్లు ప్రకటించారు.

దీంతో.. ఈ దులీప్‌ టోర్నీలో రాణించాలని ఆటగాళ్లంతా పట్టుదలతో ఉన్నారు. ఈ క్రమంలోనే ఓ టీమిండియా యువ క్రికెటర్‌.. భారత సెలెక్టర్లకు ఛాలెంజ్‌ విసిరాడు. ఇండియాలోనే తానో బెస్ట్‌ స్పిన్నర్‌నని, రెడ్‌ బాల్‌ క్రికెట్‌ కోసం తాను సిద్ధంగా ఉన్నానంటూ, తనను టెస్ట్‌ టీమ్‌లోకి తీసుకోవాలని కోరాడు. ఈ మాటలు చెప్పింది.. సాయి కిషోర్‌. తమిళనాడుకు చెందిన ఈ ఆటగాడు.. దేశవాళి క్రికెట్‌తో పాటు.. ఐపీఎల్‌లో కూడా మంచి ప్రదర్శనలు కనబర్చిన విషయం తెలిసిందే. రానున్న దులీప్‌ ట్రోఫీలో కూడా సాయి కిషోర్‌ టీమ్‌-బీ తరఫున ఆడనున్నాడు.

ఐపీఎల్‌ 2024 సీజన్‌లో ఆడుతూ.. గాయంతో టోర్నీ మధ్యలోనే దూరమైన సాయి కిషోర్‌.. ఆ గాయం నుంచి కోలుకుని.. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌ 2024తో రీ ఎంట్రీ ఇచ్చాడు. దులీప్‌ ట్రోఫీలో తాను జడేజాతో కలిసి ఆడబోతున్నట్లు.. ప్రస్తుతం ఇండియాలో ఉన్న బెస్ట్‌ స్పిన్నర్స్‌లో తాను ఒకడినని భావిస్తున్నట్లు సాయి కిషోర్‌ పేర్కొన్నాడు. జడేజాతో కలిసి ఆడటం వల్ల తాను ఎంతో నేర్చుకునేందుకు అవకాశం ఉంటుందని తెలిపాడు. మరి దులీప్‌ ట్రోఫీలో అతను ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. సెలెక్టర్లును మెప్పించి.. టీమిండియా టెస్ట్‌లోకి ఎంట్రీ ఇస్తాడో లేదో అని క్రికెట్‌ అభిమానులు కూడా ఆసక్తి చూపిస్తున్నారు. మరి సాయి కిషోర్‌ చేసిన కామెంట్స్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments