వీడియో: కశ్మీర్‌ రోడ్లపై క్రికెట్‌ ఆడిన సచిన్‌ టెండూల్కర్‌!

Sachin Tendulkar: ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌.. కశ్మీర్‌ రోడ్లపై క్రికెట్‌ ఆడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అసలు సచిన్‌ అక్కడి ఎందుకు వెళ్లాడు? ఎందుకు క్రికెట్‌ ఆడాడో ఇప్పుడు చూద్దాం..

Sachin Tendulkar: ఇండియన్‌ క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌.. కశ్మీర్‌ రోడ్లపై క్రికెట్‌ ఆడుతున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. అసలు సచిన్‌ అక్కడి ఎందుకు వెళ్లాడు? ఎందుకు క్రికెట్‌ ఆడాడో ఇప్పుడు చూద్దాం..

క్రికెట్‌ ఒక మతమైతే.. దానికి సచిన్‌ టెండూల్కర్‌ దేవుడు! ప్రతి క్రికెట్‌ అభిమానికి తెలిసిన మాట. ఇండియాలో క్రికెట్‌ను ఒక మతంలా మార్చింది ఆయనే. అతని ఆట చూసేందుకు స్టేడియానికి వెళ్లేవారు. టీవీలకు అతుక్కుపోయేవారు. సచిన్‌ ఆడుతున్న టైమ్‌లో ఇండియన్‌ క్రికెట్‌ అంటే సచిన్‌​, సచిన్‌ అంటే ఇండియన్‌ క్రికెట్‌ అనేలా ఉండేది పరిస్థితి. విదేశాల్లో.. ఇండియా అంటే సచిన్స్‌ కంట్రీ, అది సచిన్‌ టెండూల్కర్‌ క్రేజ్‌. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైర్‌ అయి ఏళ్లు గడుస్తున్నా.. ఇంకా సచిన్‌ ఏం చేసినా, ఎక్కడికి వెళ్లినా.. న్యూస్‌లో హెడ్‌లైన్స్‌ అవ్వాల్సిందే. అంతలా సచిన్‌ మానియా ఇండియాలో వ్యాపించి ఉంది. తాజాగా సచిన్‌ కశ్మీర్‌లో పర్యటించాడు. అక్కడే ఒక అద్భుతం చోటు చేసుకుంది.

కశ్మీర్‌లో సచిన్‌ పర్యటిస్తున్న సమయంలో.. రోడ్డు పక్కన కొంతమంది కశ్మీరిలు క్రికెట్‌ ఆడుతున్నాడు. అదే రోడ్డుపై అటుగా కారులో వెళ్తున్న సచిన్‌ వారిని చూశాడు. ఇంకేంముంది.. బ్యాట్‌ చూస్తే సచిన్‌కు చేయి లాగేస్తుంది కదా.. వెంటనే కారు ఆపేసి.. వాళ్ల దగ్గరకు వెళ్లి నేనూ మీతో పాటు ఆడొచ్చా అని అడిగాడు. సాక్ష్యాత్తు క్రికెట్‌ దేవుడే దిగి వచ్చి.. నేనూ మీతో క్రికెట్‌ ఆడుతా అంటూ వాళ్లు మాత్రం వద్దంటారా? వెంటనే బ్యాట్‌ను సచిన్‌ చేతుల్లో పెట్టేసి బౌలింగ్‌ వేశారు. కొద్ది సేపు వాళ్లను ఉత్సాహపరుస్తూ.. సచిన్‌ కొన్ని షాట్లు ఆడాడు.

అలా సచిన్‌ కశ్మీర్‌ రోడ్లపై బ్యాటింగ్‌ చేస్తుంటే.. భూతల స్వర్గంగా పిలిచే కశ్మీర్‌లో క్రికెట్‌ దేవుడి బ్యాటింగ్‌ను స్థానికులు, జవాన్లు చూసి తరించిపోయారు. ప్రస్తుతం సోషల్‌ మీడియాలో సచిన్‌ కశ్మీర్‌ రోడ్లపై క్రికెట్‌ ఆడిన వీడియోలు వైరల్‌గా మారాయి. స్వర్గంలో క్రికెట్‌ గాడ్‌ బ్యాటింగ్‌ చేస్తున్నాడంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అయితే.. కశ్మీర్‌లో పర్యటించిన సచిన్‌ స్థానికంగా తయారయ్యే కశ్మీర్‌ విల్లో బ్యాటర్ల కంపెనీని సందర్శించాడు. అక్కడ బ్యాట్లు తయారయ్యే ప్రక్రియను అడిగి తెలుసుకున్నాడు. మరి క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ కశ్మీర్‌ రోడ్లపై క్రికెట్‌ ఆడటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments