Nidhan
సన్‌రైజర్స్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. దీంతో టీమ్ ఓనర్ కావ్యా మారన్ సంతోషంలో మునిగిపోయారు.
సన్‌రైజర్స్ జట్టు మరోసారి సంచలనం సృష్టించింది. వరుసగా రెండోసారి ఛాంపియన్స్‌గా నిలిచింది. దీంతో టీమ్ ఓనర్ కావ్యా మారన్ సంతోషంలో మునిగిపోయారు.
Nidhan
సన్‌రైజర్స్ జట్టు మరోమారు అద్భుతం చేసింది. సౌతాఫ్రికా టీ20 లీగ్‌లో ఎస్ఆర్హెచ్కు చెందిన సన్‌రైజర్స్ ఈస్టర్న్ కేప్ టీమ్ ఛాంపియన్‌గా అవతరించింది. గతేడాది మొదలైన ఈ లీగ్‌లో తొలి విన్నర్‌గా సన్‌రైజర్స్ నిలిచింది. ఈసారి కూడా టైటిల్‌ను నెగ్గిన ఈస్టర్న్ కేప్.. వరుసగా రెండోసారి కప్పును సొంతం చేసుకుంది. డర్బన్ సూపర్ జెయింట్స్‌తో జరిగిన ఫైనల్ ఫైట్‌లో 89 పరుగుల తేడాతో గెలిచి రెండోమారు ట్రోఫీని కైవసం చేసుకుంది. సన్‌రైజర్స్ విజేతగా నిలవడంతో జట్టు యజమాని కావ్యా మారన్ ఆనందం పట్టలేకపోయింది. మ్యాచ్ ముగియగానే ఆమె ఎగిరి గంతేస్తూ సెలబ్రేట్ చేసుకుంది. చాన్నాళ్ల తర్వాత నవ్వుతూ సంతోషంగా కనిపించిన ఆమె మీదే కెమెరాలు ఫోకస్ చేశాయి. గెలుపు తర్వాత ఆమె మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
మ్యాచ్ నెగ్గిన తర్వాత గ్రౌండ్లోకి వచ్చిన కావ్య పాప గంతులు వేస్తూ సంబురాలు చేసుకుంది. సన్‌రైజర్స్ ప్లేయర్లకు విషెస్ చెప్పింది. టీమ్ అంతా ట్రోఫీ అందుకున్నాక ఆమె కూడా వేదిక మీదకు వెళ్లి వారితో ఒక ఫొటో దిగింది. గ్రౌండ్‌లోని అభిమానులకు చేతులు ఊపుతూ అభివాదం చేసిన కావ్యా మారన్.. ఈ గెలుపు ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. ఇంకా ఆమె మాట్లాడుతూ.. ‘వరుసగా రెండో ఏడాది కప్‌ను గెలుచుకున్నాం. చాలా సంతోషంగా ఉన్నాం. మా టీమ్ బెస్ట్ పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. మా జట్టు సీజన్ మొత్తం డామినేట్ చేస్తూ వచ్చింది. ఫైనల్లోనూ అదే పెర్ఫార్మెన్స్ను రిపీట్ చేసింది. ఈ ఏడాది కూడా కప్పు కొట్టడం సంతోషంగా ఉంది. వరుసగా రెండోసారి ట్రోఫీ నెగ్గడం నమ్మశక్యంగా లేదు. ఫైనల్లో కఠిన ప్రత్యర్థిపై గెలిచాం. అందరికీ కృతజ్ఞతలు’ అని కావ్యా మారన్ చెప్పుకొచ్చింది.
గత కొన్నేళ్లుగా ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ వరుసగా విఫలమవుతోంది. మన జట్టు ప్రదర్శన నాసికట్టుగా తయారవడం, పాయింట్స్ టేబుల్లో ఆఖర్లో నిలుస్తుండటంతో అభిమానులు నిరాశకు గురవుతున్నారు. మ్యాచ్ చూసేందుకు, ప్లేయర్లను ఎంకరేజ్ చేసేందుకు గ్రౌండ్‌కు వస్తున్న కావ్య పాప కూడా బాధతో, నిరాశతో కనిపించడం వీడియోల్లో చూసే ఉంటారు. కానీ సౌతాఫ్రికా లీగ్‌లో మాత్రం సన్‌రైజర్స్ దుమ్మరేపుతోంది. వరుసగా రెండోమారు ఛాంపియన్‌గా నిలిచింది. దీంతో చాన్నాళ్ల తర్వాత కావ్య పాప నవ్వింది. ఆమె ఎగురుతూ, గంతులేస్తూ సెలబ్రేట్ చేసుకోవడం, ఫుల్ హ్యాపీగా కనిపించడంతో సోషల్ మీడియాలో నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఊపును ఐపీఎల్‌లోనూ కంటిన్యూ చేస్తే కావ్య పాప ఇలాగే నవ్వుతూ కనిపిస్తుందని.. ఆమెను ఏడిపించొద్దని ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను నెటిజన్స్ కోరుతున్నారు. మరి.. కావ్య పాప రియాక్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.
ఇదీ చదవండి: Jasprit Bumrah: బుమ్రా మీద ఆ ముద్ర వేయొద్దు.. టీమిండియా మాజీ కోచ్ రిక్వెస్ట్!
Happiest person – Kavya Maran#SA20Finals | #SA20pic.twitter.com/rrPfSe5h3f
— Don Cricket 🏏 (@doncricket_) February 11, 2024