Rohit Sharma: వీడియో: రనౌట్‌ తర్వాత గిల్‌ను పచ్చిబూతులు తిట్టిన రోహిత్‌! స్టంప్‌ మైక్‌ ఆడియో లీక్‌

Rohit Sharma, Shubman Gill: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రనౌట్‌ అయిన తర్వాత అసహనానికి గురయ్యాడు. యంగ్‌ ప్లేయర్‌, తన పార్ట్నర్‌ గిల్‌పై బూతులతో విరుచుకుపడ్డాడు రోహిత్‌. మరి రోహిత్‌ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Shubman Gill: టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఆఫ్ఘాన్‌తో మ్యాచ్‌లో రనౌట్‌ అయిన తర్వాత అసహనానికి గురయ్యాడు. యంగ్‌ ప్లేయర్‌, తన పార్ట్నర్‌ గిల్‌పై బూతులతో విరుచుకుపడ్డాడు రోహిత్‌. మరి రోహిత్‌ ఏం అన్నాడో ఇప్పుడు చూద్దాం..

ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన తొలి టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. మొహాలీ వేదికగా గురువారం జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది రోహిత్‌ సేన. ఈ మ్యాచ్‌తో రోహిత్‌ శర్మ చాలా కాలం తర్వాత టీ20 క్రికెట్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. దీంతో రోహిత్‌ ఎలా ఆడతాడా అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది. కానీ, రోహిత్‌ శర్మ పరుగులేమీ చేయకుండా రనౌట్‌ రూపంలో వెనుదిరిగాడు. ఈ అవుట్‌తో భారత క్రికెట్‌ అభిమానులే కాదు.. రోహిత్‌ శర్మ సైతం చాలా నిరాశచెందాడు. ఒక విధంగా చెప్పాలంటే కోపంతో ఊగిపోయాడు. ఎందుకంటే.. తన అవుట్‌కు గిల్ కారణం అయ్యాడు. దీంతో రోహిత్‌ పచ్చిబూతులతో రెచ్చిపోయాడు. ఆ బూతులు స్టంప్‌మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. అయితే అసలు రోహిత్‌ ఎలా అవుట్‌ అయ్యాడు? అందుకు గిల్‌ ఎలా కారణం అయ్యాడు? రోహిత్‌ ఏం తిట్టాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ఫజల్‌ ఫారూఖీ వేసిన ఇన్నింగ్స్‌  తొలి ఓవర్‌ రెండో బంతిని రోహిత్‌ ముందుకొచ్చి మిడాఫ్‌ వైపు గట్టి షాట్‌ ఆడాడు. ఆడిన వెంటనే రోహిత్‌ పరుగు కోసం వెళ్లాడు. నాన్‌స్ట్రైకర్‌లో ఉన్న శుబ్‌మన్‌ గిల్‌, రోహిత్‌ వైపు చూడకుండా.. బాల్‌వైపు చూస్తూ ఉండిపోయాడు. ఆ బాల్‌ను మిడాఫ్‌ ఫీల్డర్‌ డైవ్‌ చేసి ఆపాడు. అయినా కూడా రోహిత్‌ పరుగు ఆపకుండా నాన్‌స్ట్రైకర్‌ ఎండ్‌వైపు వచ్చేశాడు. కానీ, గిల్‌ మాత్రం అలాగే ఉండిపోయాడు. ఫీల్డర్‌ బాల్‌ను కీపర్‌కు అందించడంతో రోహిత్‌ రనౌట్‌ అయ్యాడు. అయితే.. గిల్‌ తన కాల్‌కు స్పందించి పరుగు తీసి ఉంటే రన్‌ పూర్తి అయ్యేదని రోహిత్‌ భావించాడు. తనను అనవసరంగా గిల్‌ రనౌట్‌ చేశాడని భావించిన రోహిత్‌.. పెవిలియన్‌కు వెళ్తూ గిల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశాడు.

చాలా కాలం తర్వాత టీ20 ఆడుతున్న రోహిత్‌ శర్మ ఎలాగైనా ఈ మ్యాచ్లో మంచి ఇన్నింగ్స్‌ ఆడాలని డిసైడ్‌ అయ్యాడు. పైగా పిచ్‌ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో రోహిత్‌ నుంచి మంచి నాక్‌ వస్తుందని అంతా ఎక్స్‌పెక్ట​్‌ చేశారు. కానీ, గిల్‌ కారణంగా తాను డకౌట్‌ అయ్యాయని భావించిన రోహిత్‌.. గిల్‌ను హిందీలో బూతులు తిట్టాడు. ఆ బూతులు స్టంప్‌మైక్‌లో రికార్డ్‌ అయ్యాయి. ఆ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే.. ఈ మ్యాచ్‌లో గిల్‌ మంచి బ్యాటింగ్‌ చేయడం, టీమిండియా విజయం సాధించడంతో.. రోహిత్‌ శర్మ మ్యాచ్‌ తర్వాత శాంతించాడు. గేమ్‌లో ఇలాంటి సంఘటనలు సహజమే అని, గిల్‌ బాగా ఆడాడంటూ మెచ్చుకున్నాడు. మరి ఈ మ్యాచ్‌లో రోహిత్‌ రనౌట్‌తో పాటు గిల్‌ను రోహిత్‌ తిట్టడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments