SNP
Rohit Sharma, T20 World Cup 2024: 2012 నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్‌ను రోహిత్ శర్మ కూడా ఫాలో అయ్యాడు. ఆ సెంటిమెంటే.. మనకు టీ20 వరల్డ్ కప్ అందించిందని క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
Rohit Sharma, T20 World Cup 2024: 2012 నుంచి కొనసాగుతున్న సెంటిమెంట్‌ను రోహిత్ శర్మ కూడా ఫాలో అయ్యాడు. ఆ సెంటిమెంటే.. మనకు టీ20 వరల్డ్ కప్ అందించిందని క్రికెట్ అభిమానులు చెప్పుకుంటున్నారు. అదేంటో ఇప్పుడు చూద్దాం..
SNP
రోహిత్ శర్మ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్ 2024ను సాధించిన విషయం తెలిసిందే. 17 ఏళ్ల తర్వాత మరోసారి టీమిండియా ఈ పొట్టి ప్రపంచ కప్‌ను కైవసం చేసుకుంది. తొలిసారి 2007లో మహేంద్ర సింగ్ కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్ కప్‌ను సాధించింది. ఆ వరల్డ్ కప్‌తోనే టీ20 ఫార్మాట్‌లో వరల్డ్ కప్ పోటీలు మొదలయ్యాయి. అలా టీ20ల్లో మొట్టమొదటి వరల్డ్ కప్ సాధించిన జట్టుగా చరిత్ర సృష్టించిన భారత్.. మరో కప్పు గెలిచేందుకు ఏకంగా 17 ఏళ్లు పట్టింది. అయితే.. ఈ కప్పు గెలవడంలో కెప్టెన్ రోహిత్ శర్మకు కలిసొచ్చిన, అతను పాటించిన ఒక సెంటిమెంట్ టీమిండియా విజయం దక్కేలా చేసింది. మరి ఆ సెంటిమెంట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
టీ20 వరల్డ్ కప్ ఇప్పటి వరకు 8 సార్లు జరిగింది. 2007, 2009, 2010, 2012, 2014, 2016, 2021, 2022, 2024. ఈ తొమ్మిది సార్లలో ఏడుసార్లు టాస్ గెలిచిన జట్టే కప్పు కొట్టింది. కేవలం ఒక్కటంటే ఒక్కసారి మాత్రమే ఈ సెంటిమెంట్ వర్క్ అవుట్ కాలేదు. 2009లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు ఫైనల్ చేరాయి. శ్రీలంక టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. కానీ, పాకిస్థాన్ 139 పరుగులు టార్గెట్‌ను ఛేదించి గెలిచింది. ఈ ఒక్క వరల్డ్ కప్ టోర్నీ తప్పా.. మరే టీ20 వరల్డ్ కప్ టోర్నీలో కూడా టాస్ గెలిచిన జట్టు ఓడిపోలేదు. అలాగే టాస్ గెలిచిన ప్రతి జట్టు తొలుత బ్యాటింగ్ తీసుకుంది.. ఛేజింగ్ టీమ్ ఏనాడు కూడా కప్పు కొట్టలేదు.
2012 నుంచి కొనసాగుతున్న ఈ సెంటిమెంట్ రోహిత్ శర్మకు కూడా కలిసి వచ్చింది. జూన్ 29న సౌతాఫ్రికాతో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్ అయిన రోహిత్ టాస్ గెలిచాడు. మరో మాట లేకుండా ఫస్ట్ బ్యాటింగ్ చేస్తామన్నాడు. టాస్ గెలవడం అనేది లక్కీగా రోహిత్‌కు కలిసొచ్చిన సెంటిమెంట్ అయితే.. ఫస్ట్ బ్యాటింగ్ చేయడం అనేది రోహిత్ శర్మ సెంటిమెంట్‌ను ఫాలో అవ్వడం. పైగా పిచ్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగానే ఉండటంలో బ్యాటింగ్ ఎంచుకున్నాడు. బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 176 పరుగులు చేసి.. ఛేజింగ్‌కు దిగిన సౌతాఫ్రికాను 169 పరుగులకు కట్టడి చేసి.. ప్రపంచ కప్‌ను ముద్దాడింది. మరి ఈ సెంటిమెంట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
This picture epitomises how I’m feeling right now. So many words but can’t find the right ones to express what yesterday meant to me but I will, and I will share them, but right now I’m basking in a dream come true for a billion of us. ❤️🏆 pic.twitter.com/X2eyU3Eaqm
— Rohit Sharma (@ImRo45) June 30, 2024