Rohit Sharma: విధ్వంసకర సెంచరీ చేసి.. రోహిత్‌ ఎందుకు సెలబ్రేట్‌ చేసుకోలేదు! కారణం?

భారత్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. అయితే.. ఈ సూపర్‌ సెంచరీ తర్వాత రోహిత్‌ ఎలాంటి సంబురాలుచేసుకోలేదు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

భారత్‌ - ఆఫ్ఘనిస్థాన్‌ మధ్య జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ అద్భుత సెంచరీతో చెలరేగాడు. అయితే.. ఈ సూపర్‌ సెంచరీ తర్వాత రోహిత్‌ ఎలాంటి సంబురాలుచేసుకోలేదు. మరి దాని వెనుక ఉన్న కారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తన టీ20 కెరీర్‌లో ఐదో సెంచరీ నమోదు చేశారు. దీంతో టీమిండియా కెప్టెన్‌గా అలాగే ఒక ఆటగాడిగా టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్‌ చరిత్ర సృష్టించాడు. బుధవారం బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ అద్భుతమైన సెంచరీ నమోదు చేశాడు. టీమిండియా కేవలం 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో జట్టును ఇన్నింగ్స్‌ను నిలబెట్టడమే కాకుండా.. ఆ తర్వాత శివాలెత్తినట్లు ఆఫ్ఘాన్‌ బౌలర్లపై ఫోర్లు, సిక్సులతో దండయాత్ర చేశాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగుల భారీ స్కోర్‌ చేశాడు. ఆ తర్వాత సూపర్‌ ఓవర్స్‌లో మరో 3 సిక్సులు, ఓ ఫోర్‌ కూడా బాదాడు.

ఇంత అద్భుతంగా ఆడి.. 22 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన జట్టును గెలిపించాడు. కానీ, సెంచరీ తర్వాత రోహిత్‌ శర్మ ఎలాంటి సెలబ్రేషన్స్‌ చేసుకోలేదు. ఎంతో కామ్‌గా ఉండిపోయాడు. ఈ ఊహించని ఘటనతో అంతా షాక్‌ అయ్యారు. అదేంటి.. ఇంత అద్భుతమైన ఇన్నింగ్స్‌ ఆడిన కనీసం బ్యాట్‌, హెల్మెట్‌ను పైకి ఎత్తలేదు అని ఆశ్చర్యపోయారు. లేక చాలా విషయాలు మర్చిపోయినట్లు.. తాను సెంచరీ చేసిన విషయం కూడా రోహిత్‌ మర్చిపోయాడా? అని కూడా కొంతమంది జోకులు పేలుస్తున్నారు. అయితే.. రోహిత్‌ శర్మ కావాలనే సెంచరీని సెలబ్రేట్‌ చేసుకోలేదని తెలుస్తోంది. అందుకు కారణం ఏంటంటే.. వన్డే వరల్డ్‌ కప్‌ 2023 కోల్పోయిన బాధ రోహిత్‌ శర్మను ఇంకా వెంటాడుతూనే ఉంది.

కెప్టెన్‌గా భారత్‌కు ప్రపంచ కప్‌ అందివ్వాలని రోహిత్‌ ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. దాని కోసం చాలా కష్టపడ్డాడు. కానీ, చివరి మెట్టుపై అది విఫలం అవ్వడంతో చిన్నపిల్లాడిలా కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఆ బాధ టీ20 వరల్డ్‌ కప్‌ గెలుస్తునే పోతుందేమో మరి. అందుకోసమే ఆఫ్ఘనిస్థాన్‌ లాంటి చిన్న టీమ్‌పై సెంచరీని రోహిత్‌ పెద్దగా పట్టించుకోలేదు. పైగా ఈ సిరీస్‌లో తొలి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ డకౌట్‌ అయ్యాడు. అది కూడా రోహిత్‌పై కాస్త ప్రభావం చూపించి ఉంటుంది. ఇలా అన్ని నెగిటివ్‌గా జరగడంతో.. ఈ సెంచరీని రోహిత్‌ పెద్దగా సెలబ్రేట్‌ చేసుకోలేదు. అయితే.. ఇదే ఫామ్‌ను రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌లోనూ కొనసాగించాలని మాత్రం క్రికెట్‌ అభిమానులు కోరుకుంటున్నారు. మరి రోహిత్‌ సెంచరీని సెలబ్రేట్‌ చేసుకోకపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments