టీమ్‌లోకి వచ్చాకా కూడా రోహిత్‌ను అవమానిస్తున్న ముంబై! మరీ ఇంత దారుణమా?

Rohit Sharma, Mumbai Indians: మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఇంకా ముంబై ఇండియన్స్‌లో గొడవలు సమిసినట్లు కనిపించడం లేదు. రోహిత్‌ను కావాలనే అవమానిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజంగానే రోహిత్‌ను అవమానిస్తున్నారా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

Rohit Sharma, Mumbai Indians: మరికొన్ని గంటల్లో ఐపీఎల్‌ 2024 సీజన్‌ ప్రారంభం కానుంది. అయితే.. ఇంకా ముంబై ఇండియన్స్‌లో గొడవలు సమిసినట్లు కనిపించడం లేదు. రోహిత్‌ను కావాలనే అవమానిస్తున్నట్లు కనిపిస్తోంది. నిజంగానే రోహిత్‌ను అవమానిస్తున్నారా? ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం..

ఈ ఐపీఎల్‌ ఆరంభానికి ముందు జరిగిన చాలా పెద్ద విషయం ఏంటంటే.. ముంబై ఇండియన్స్‌ కెప్టెన్‌గా రోహిత్‌ శర్మను తప్పించి.. అతని స్థానంలో హార్ధిక్‌ పాండ్యాను ముంబై కెప్టెన్‌గా చేయడమే. ఈ మార్పుతో క్రికెట్‌ వర్గాల్లో తీవ్ర అలజడి చెలరేగింది. రోహిత్‌ శర్మ ఫ్యాన్స్‌ ముంబై ఇండియన్స్ మేనేజ్‌మెంట్‌పై, హార్ధిక్‌ పాండ్యాపై విరుచుకుపడ్డారు. ఐపీఎల్‌ 2021 తర్వాత ముంబై ఇండియన్స్‌ను వదిలేసి.. ఐపీఎల్‌ 2022 సీజన్‌లో కొత్తగా వచ్చిన గుజరాత్‌ టైటాన్స్‌కు పాండ్యా వెళ్లిపోయిన విషయం తెలిసిందే. ఆ తర్వాత ఇప్పుడు ఈ సీజన్‌ కంటే ముందు గుజరాత్‌ను వీడి మళ్లీ ముంబైకి వచ్చాడు. జట్టును వీడి మళ్లీ తిరిగి టీమ్‌లోకి వచ్చిన ఆటగాడికి కెప్టెన్సీ ఇవ్వడం ఏంటని క్రికెట్‌ అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.

రోహిత్‌ శర్మ కూడా తనను కెప్టెన్సీ నుంచి తీసేయడంపై అసంతృప్తిగా ఉన్నాడు. రోహిత్‌ భార్య రితికా అయితే ఓపెన్‌గానే తన భర్తను కెప్టెన్సీ నుంచి తీసేయడంపై స్పందించింది. ఐపీఎల్‌ కంటే ముందు ఇంగ్లండ్‌తో ఐదు టెస్టుల సుదీర్ఘ టెస్ట్‌ సిరీస్‌ ఆడిన రోహిత్‌ శర్మ.. తనను కెప్టెన్సీ నుంచి తీసేశారనే కోపంతో ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉంటాడని అంతా భావించారు. అనుకున్నట్లే.. కొన్ని రోజుల క్రితం.. తాను ఐపీఎల్‌ ఆడటం లేదని, టెస్ట్‌ క్రికెట్‌ ఆడి అలసిపోయానని, జూన్‌లో టీ20 వరల్డ్‌ కప్‌ 2024కు ఫ్రెష్‌గా వెళ్లేందుకు ఈ ఏడాది ఐపీఎల్‌కు దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు రోహిత్‌ శర్మ ఒక పోస్ట్‌ కూడా చేశాడు. కానీ, ఏమైందో తెలియదు కానీ వెంటనే ఆ పోస్ట్‌ను డిలీట్‌ చేశాడు. తాజాగా ముంబై క్యాంప్‌కి చేరుకున్నాడు.

ఐదు టైటిల్స్‌ అందించిన కెప్టెన్‌ అని కూడా చూడకుండా, చెప్పాపెట్టకుండా తనను కెప్టెన్సీ నుంచి తీసేసి అవమానించినా కూడా రోహిత్‌ పెద్ద మనుసు చేసుకుని ఈ ఏడాది ముంబై తరఫున ఆడేందుకు ముందుకు వచ్చాడు. అయినా కూడా రోహిత్‌ను ముంబై మేనేజ్‌మెంట్‌, కొంతమంది ఆటగాళ్లు కావాలనే అవమానిస్తున్నట్లు కనిపిస్తోంది. ఐపీఎల్‌ అంటేనే సందడి సందడిగా సాగుతుంది. మ్యాచ్‌లే కాకుండా ఆఫ్‌ ది ఫీల్డ్‌ ఆటగాళ్లంతా ఆట పాటతో చిల్‌ అవుతూ ఉంటారు. ఇలాంటి వాటిలో రోహిత్‌ కూడా ఉంటాడు. కానీ, ఈ సారి రోహిత్‌ టీమ్‌తో కలిసి ఒక్క వీడియోలో కూడా కనిపిచంలేదు. రోహిత్‌ను కావాలనే దూరం పెడుతున్నారా? లేక కోపంతో రోహితే టీమ్‌కు దూరంగా ఉంటున్నాడా? అన్నది తెలియదు. ఏది ఏమైనా.. ఒక సీనియర్‌ ప్లేయర్‌, సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న ఆటగాడిని కెప్టెన్సీ నుంచి తీసేసినా.. అతనికి ఇచ్చే రెస్పెక్ట్‌ అతనికి ఇవ్వాలి.

ఉదాహరణగా ఆర్సీబీనే తీసుకుంటే.. 16 ఏళ్లుగా కప్పు కొట్టకపోయినా.. తానే కెప్టెన్నీ నుంచి తప్పుకున్నా కూడా ఆర్సీబీ జట్టు విరాట్‌ కోహ్లీ ఎంతలా గౌరవిస్తుందో మనమంతా చూస్తూనే ఉన్నాం. ఇప్పటికీ కోహ్లీ కెప్టెన్‌గా ఉంటానంటే.. ఆర్సీబీ మేనేజ్‌మెంట్‌ కాదనదు. కానీ, ఏకంగా ఐదు సార్లు ముంబైని ఛాంపియన్‌గా నిలిపిన రోహిత్‌ శర్మను మాత్రం ఆ జట్టు మేనేజ్‌మెంట్‌ దారుణంగా అవకమానిస్తోందని సగటు క్రికెట్‌ అభిమాని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. కెప్టెన్సీ తీసేసి తప్పు చేశారు సరే.. కనీసం టీమ్‌లోకి వచ్చిన తర్వాత అయినా అతని గౌరవానికి తగ్గట్లు నడుచుకుంటే బాగుంటుంది కదా.. అలా కాకుండా.. కొత్త కెప్టెన్‌ పాండ్యా, అతని కోతి బ్యాచ్‌ ఇషాన్‌ కిషన్‌లు చేసే చేష్టలతో రోహిత్‌ ఫ్యాన్స్‌ మరింత కోపంగా ఉన్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments