Rohit Sharma: రోహిత్‌ ముందు.. ధోని, కోహ్లీ, పాండ్యా అంతా జీరోలే! ఈ లెక్కలే సాక్ష్యం

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఆఫ్ఘాన్‌పై మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఒక విషయంలో ధోని, కోహ్లీ, పాండ్యాలను జీరోలను చేస్తూ.. తాను హీరో అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం​..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ తాజాగా ఆఫ్ఘాన్‌పై మూడు టీ20ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్‌ చేసి.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 గెలిచే ప్రయత్నం చేస్తానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఒక విషయంలో ధోని, కోహ్లీ, పాండ్యాలను జీరోలను చేస్తూ.. తాను హీరో అయ్యాడు. అదేంటో ఇప్పుడు చూద్దాం​..

ఇండియన్‌ క్రికెట్‌లో ధోని అత్యంత విజయవంతమైన కెప్టెన్‌.. ఒకటి కాదు రెండు కాదు భారత్‌కు ఏకంగా మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన గొప్ప కెప్టెన్‌. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీని టీమిండియా ధోని కెప్టెన్సీలోనే గెలిచింది. అందుకే కెప్టెన్‌గా ధోని ఇండియన్‌ క్రికెట్‌లో నంబర్‌ వన్‌గా నిలుస్తాడు. ధోని కంటే ముందు 1983లో కపిల్‌ దేవ్‌ ఇండియాకు కెప్టెన్‌గా వరల్డ్‌ కప్‌ను అందించాడు. ఆ తర్వాత ధోని మాత్రమే వరల్డ్‌ కప్‌ను గెలిచిన కెప్టెన్‌గా ఉన్నాడు. 2019లో విరాట్‌ కోహ్లీ కెప్టెన్సీలో టీమిండియా సెమీస్‌ వరకు వెళ్లింది, ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో రోహిత్‌ కెప్టెన్సీలో భారత ఫైనల్‌ వరకు దూసుకెళ్లి కానీ, కప్పు మాత్రమే కొట్టలేకపోయింది.

ఇక ధోని తర్వాత భారత జట్టు పగ్గాలు అందుకున్న కోహ్లీ కూడా.. అదే రేంజ్‌లో టీమ్‌ను నడిపించాడు. వరల్డ్‌ కప్స్‌ గెలవలేదనే కానీ.. కోహ్లీ కెప్టెన్సీలో భారత జట్టు ప్రపంచ క్రికెట్‌ను శాసించింది. ముఖ్యంగా టెస్టుల్లో కోహ్లీ అత్యుత్తమ కెప్టెన్‌గా ఉన్నాడు. ఇక ఆ తర్వాత పూర్తి స్థాయి కెప్టెన్‌గా రోహిత్‌ శర్మ సైతం జట్టు విజయవంతంగా నడిపిస్తున్నాడు. కెప్టెన్‌గా రోహిత్‌ కూడా ధోని, కోహ్లీ రేంజ్‌ను అందుకునే పనిలోనే ఉన్నాడు. కానీ, ఒక్క విషయంలో మాత్రం.. ధోని, కోహ్లీ, హార్ధిక్‌ పాండ్యాలను జీరోలను చేస్తూ.. రోహిత్‌ శర్మ్‌ హీరోగా మారాడు. ఆ రికార్డ్‌ ఏంటో ఇప్పుడు చూద్దాం..

తాజాగా టీమిండియా ఆఫ్ఘనిస్థాన్‌తో మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను రోహిత్‌ సేన క్లీన్‌ స్వీప్‌ చేసింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో రోహిత్‌ శర్మ డకౌట్‌ అయినా.. మూడో మ్యాచ్‌లో తన విశ్వరూపం చూపించాడు. కేవలం 69 బంతుల్లోనే 11 ఫోర్లు, 8 సిక్సులతో 121 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ సెంచరీతో రోహిత్‌ శర్మ టీ20ల్లో ఐదో సెంచరీ నమోదు చేసి.. ప్రపంచ క్రికెట్‌లో టీ20ల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అలాగే టీ20 కెప్టెన్‌గా మూడు సెంచరీలు సాధించాడు. ఇండియన్‌ క్రికెట్‌లో టీ20 కెప్టెన్‌గా ఇన్ని సెంచరీలు ఎవరూ చేయలేరు. 72 టీ20 మ్యాచ్‌ల్లో ధోని టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఒక్క మ్యాచ్‌లో కూడా సెంచరీ చేయలేదు.

అలాగే కోహ్లీ 51 మ్యాచ్‌ల్లో టీమిండియా కెప్టెన్‌గా వ్యవహరించాడు. కానీ ఒక్క సెంచరీ చేయలేదు. కానీ, టీ20ల్లో ఆటగాడిగా కోహ్లీకి ఒక సెంచరీ ఉంది. ధోనికి అది కూడా లేదు. ఇక రోహిత్‌ లేనప్పుడు.. టీమిండియాకు టీ20కు కెప్టెన్‌గా వ్యవహరించిన హార్ధిక్‌ పాండ్యా సైతం కెప్టెన్‌గా ఒక్క టీ20 సెంచరీ కూడా చేయలేదు. ఈ రికార్డ్స్‌లో రోహిత్‌ ముందు.. ధోని, కోహ్లీ, పాండ్యా జీరోలుగా ఉన్నారు. కానీ, సూర్యకుమార్‌ యాదవ్‌ మాత్రం కెప్టెన్‌గా ఒక టీ20 సెంచరీ కలిగి ఉన్నాడు. రోహిత్‌ శర్మ తర్వాత టీ20ల్లో సెంచరీ చేసిన కెప్టెన్‌గా సూర్య రెండో స్థానంలో ఉన్నాడు. మరి ఈ రికార్డు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments