Rohit Sharma: రోహిత్‌ శర్మకు అరుదైన గౌరవం! ఏకంగా అయోధ్య నుంచి..

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ కప్‌ ఓడిపోయిన బాధలో ఉన్న రోహిత్‌ను కాస్త బయటపడేసేలా.. ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. మరి ఆ గౌరవం ఏంటో ఇప్పుడు చూద్దాం..

టీమిండియా రెగ్యులర్‌ కెప్టెన్‌ రోహిత్‌ శర్మకు ఓ అరుదైన గౌరవం దక్కింది. వరల్డ్‌ కప్‌ ఓడిపోయిన బాధలో ఉన్న రోహిత్‌ను కాస్త బయటపడేసేలా.. ఈ కార్యక్రమం ఉపయోగపడనుంది. మరి ఆ గౌరవం ఏంటో ఇప్పుడు చూద్దాం..

వన్డే వరల్డ్‌ కప్‌ పోయిన బాధలో నుంచి టీమిండియా కెప్టెన్‌ ఇప్పుడిప్పుడే బయటపడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి ఓ అరుదైన గౌరవం దక్కింది. ప్రతిష్టాత్మక అయోధ్య రామమందిరానికి సంబంధించిన ఓ కార్యక్రమంలో హాజరు కావాల్సిందిగా టీమిండియా కెప్టెన్‌కు ఆహ్వానం అందింది. ఈ నెల 22న అయోధ్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో పాల్గొన్నాల్సిందిగా రోహిత్‌కు రామమందిర కమిటీ సభ్యులు ఆహ్వానం పంపినట్లు సమాచారం. రోహిత్‌ శర్మతో పాటు మరికొంతమంది ప్రముఖులు సైతం ఈ కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది.

అయితే.. ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో అద్భుతమైన ప్రదర్శన కనబర్చిన టీమిండియా.. వరుసగా పది మ్యాచ్‌లు గెలిచి ఫైనల్‌ వరకు చేరిన విషయం తెలిసిందే. కానీ, దురదృష్టవశాత్తు ఫైనల్లో ఆస్ట్రేలియా చేతిలో ఓటమి పాలై.. ఒక్క అడుగు దూరంలో వరల్డ్‌ కప్‌ను కోల్పోయింది. ఆ మ్యాచ్‌ ఓటమితో వంద కోట్ల మందికి పైగా భారతీయ క్రికెట్‌ అభిమానులతో పాటు, ఇండియన్‌ క్రికెటర్లంతా తీవ్ర నిరాశకు గురయ్యారు. ముఖ్యంగా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సీనియర్‌ ప్లేయర్‌ విరాట్‌ కోహ్లీ అయితే.. ఆ బాధ నుంచి ఇంకా తేరుకోలేదనే చెప్పాలి. ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతూ.. తర్వాత సిరీస్‌లపై దృష్టి పెడుతున్నారు.

రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ ఇటీవల ముగిసిన ఆస్ట్రేలియా ఐదు టీ20ల సిరీస్‌తో పాటు సౌతాఫ్రికాతో జరగబోయే టీ20, వన్డే సిరీస్‌కు దూరంగా ఉన్నారు. అయితే.. వీరిద్దరూ సఫారీలతో జరిగే రెండు టెస్టుల సిరీస్‌కు మాత్రం అందుబాటులో ఉండనున్నారు. క్రికెట్‌ విషయాన్ని పక్కనపెడితే.. అయోధ్య రామమందిరంలో ఓ ఆధ్యాత్మిక కార్యక్రమంలో క్రికెటర్లు సైతం భాగం చేయడంపై క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అలాగే రామమందిర నిర్మాణానికి రోహిత్‌ శర్మ భారీ విరాళం ఇచ్చినట్లు సమాచారం. తన పేరు బయటికి రాకుండా భారీ మొత్తంలో గుప్త దానం ఇచ్చినట్లు తెలుస్తుంది. మరి రామమందిర ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి రోహిత్‌కు ఆహ్వానం అందడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments