వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (2023-25) సైకిల్లో టీమిండియాకు అదిరిపోయే ఆరంభం లభించింది. వెస్టిండీస్‌తో డొమినికా వేదికగా జరిగిన ఫస్ట్ టెస్టులో భారత జట్టు ఆల్‌రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టింది. దీంతో ఈ మ్యాచ్ కేవలం మూడ్రోజుల్లోనే ముగిసింది. మూడో రోజు ఆటను మొదలుపెట్టిన భారత్ 421/5 వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ క్రమంలో మొదటి ఇన్నింగ్స్‌లో 271 రన్స్ లీడ్‌ను సంపాదించింది. ఆ తర్వాత రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కరీబియన్ జట్టు.. రవిచంద్రన్ అశ్విన్ (7/71) స్పిన్ మాయాజాలంలో చిక్కుకొని 130 రన్స్‌కే కుప్పకూలింది. దీంతో టీమిండియా ఇన్నింగ్స్ 141 రన్స్ తేడాతో మ్యాచ్‌లో బంపర్ విక్టరీ కొట్టింది.
ఫస్ట్ ఇన్నింగ్స్‌లో విండీస్ 150 రన్స్‌కు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. డెబ్యూ మ్యాచ్‌లోనే సెంచరీతో ఆకట్టుకున్న ఓపెనర్ యశస్వి జైస్వాల్ ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా నిలిచాడు. ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జులై 20న మొదలుకానుంది. ఇక, ఈ మ్యాచ్ ఫస్ట్ ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు తీసి విండీస్ పతనాన్ని శాసించిన అశ్విన్.. రెండో ఇన్నింగ్స్‌లోనూ తన స్పిన్ తడాఖాను చూపించాడు. అతడి స్పిన్ దెబ్బకు తట్టుకోలేక కరీబియన్ టీమ్ బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. వెస్డిండీస్ రెండో ఇన్నింగ్స్‌లో ఆఖరి ఐదు వికెట్లు ఈ ఆఫ్ స్పిన్నర్ ఖాతాలోనే చేరాయి. విండీస్ 9 వికెట్లను కోల్పోయిన టైమ్‌లో మూడో రోజు ఓవర్లు ముగిశాయి. అయితే, ఒక వికెట్ దూరంలోనే ఉండటంతో మ్యాచ్‌ను ఆరగంట సేపు పొడిగించారు. వారికన్ (18) ఎల్బీడబ్ల్యూగా వెనుదిరగడంతో విండీస్ ఆలౌటైంది.
వెస్టిండీస్‌తో ఫస్ట్ టెస్టులో భారత్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. కొత్త కుర్రాడు యశస్వి జైస్వాల్‌తో పాటు కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ అద్భుతంగా బ్యాటింగ్ చేశారు. బౌలింగ్‌లో రవిచంద్రన్ అశ్విన్ తన స్పిన్ మ్యాజిక్‌తో విండీస్ పనిపట్టాడు. అతడికి మిగతా బౌలర్లు బాగా సహకరించారు. ఈ మ్యాచ్‌లో అనేక రికార్డులు నమోదయ్యాయి. ఫస్ట్ ఇన్నింగ్స్‌లో సెంచరీ బాదిన కెప్టెన్ రోహిత్ శర్మ చరిత్ర సృష్టించాడు. ఇప్పటివరకు జరిగిన మూడు డబ్ల్యూటీసీ సైకిల్స్‌లో శతకాలు బాదిన మొదటి భారతీయ బ్యాటర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఈ మ్యాచ్‌లో మరో రికార్డును కూడా తన పేరు మీద లిఖించుకున్నాడు హిట్‌మ్యాన్. టెస్టుల్లో 3,500 రన్స్ పూర్తి చేసుకున్న రోహిత్.. మూడు ఫార్మాట్లలోనూ ఈ మైలురాయిని అందుకున్న రెండో బ్యాటర్‌గా నిలిచాడు. రన్‌మెషీన్ కోహ్లి తర్వాత ఈ ఘనత సాధించి రికార్డుల్లోకి ఎక్కాడు.
Rohit Sharma is the first Indian to score Hundreds in all three WTC cycles.
Captain, leader, legend, Rohit. pic.twitter.com/1c7JlkQm8B
— Johns. (@CricCrazyJohns) July 15, 2023