SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్‌లో డకౌట్ అయినా కూడా ఇంత మంచి రికార్డు ఎలా దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం..
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ.. ఒక అరుదైన ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. మ్యాచ్‌లో డకౌట్ అయినా కూడా ఇంత మంచి రికార్డు ఎలా దక్కిందో ఇప్పుడు తెలుసుకుందాం..
SNP
టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ టీ20 క్రికెట్‌లో కొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచ క్రికెట్‌లో ఇప్పటి వరకు మరే క్రికెటర్‌కు సాధ్యం కానీ రికార్డుతో వరల్డ్ క్రికెట్‌లో తొలి క్రికెటర్‌గా నిలిచాడు. గురువారం మొహాలీ వేదికగా జరిగిన మ్యాచ్‌లో రోహిత్ శర్మ దురదృష్టవశాత్తు రనౌట్ రూపంలో డకౌట్ అయినా కూడా వరల్డ్ రికార్డును తన ఖాతాలో వేసుకోవడం విశేషం. మరి పరుగులేమీ చేయకుండా రోహిత్ ప్రపంచ రికార్డు ఎలా సాధించాడని ఆలోచిస్తున్నారా.. ఈ రికార్డు పరుగులతో వచ్చింది కాదు.. విజయాలతో వచ్చింది. ఆఫ్ఘన్‌పై టీమిండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన విషయం తెలిసిందే. అయితే.. ఇప్పటి వరకు టీమిండియా సాధించిన టీ20 విజయాల్లో రోహిత్ శర్మ ఏకంగా 100 మ్యాచ్‌ల్లో భాగస్వామిగా ఉన్నాడు. అంటే టీమిండియా సాధించిన విజయాల్లో 100 మ్యాచ్‌ల్లో రోహిత్ శర్మ ఆడాడు.
ఇప్పటి వరకు రోహిత్ మొత్తం 149 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 100 మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించింది. ఇప్పటివరకు ప్రపంచంలో మరే ఆటగాడు కూడా వంద విజయాల్లో పాలుపంచుకోలేదు. రోహిత్ కంటే ఎక్కువ మ్యాచ్‌లు ఆడిన ఆటగాళ్లు కూడా ఉన్నారు. కానీ, వారికి కూడా ఈ అరుదైన రికార్డు సాధ్యం కాలేదు. అయితే. రోహిత్ శర్మ తర్వాత ఈ లిస్ట్‌లో పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షోయబ్ మాలిక్ ఉన్నాడు. మాలిక్ 124 మ్యాచ్‌లు ఆడితే.. అందులో పాక్ 86 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక మాలిక్ తర్వాత టీమిండియా మాజీ కెప్టెన్, స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉన్నాడు. కోహ్లీ ఇప్పటి వరకు 115 టీ20 మ్యాచ్‌లు ఆడాడు.. వాటిలో టీమిండియా 73 మ్యాచ్‌ల్లో విజయం సాధించింది. ఇక కోహ్లీ తర్వాత పాక్ ఆటగాడు మొహమ్మద్ హఫీజ్ 119 మ్యాచ్‌ల్లో 71 విజయాలు, ఆఫ్ఘనిస్థాన్ మాజీ కెప్టెన్, సీనియర్ ఆల్‌రౌండర్ మొహమ్మద్ నబీ 112 మ్యాచ్‌ల్లో 70 విజయాలతో ఉన్నారు.
ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్థాన్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 158 పరుగుల మంచి స్కోర్ చేసింది. ఆఫ్ఘాన్ టాపార్డర్ బ్యాటర్లు గుర్బాజ్(23), ఇబ్రహీం జద్రాన్(25), అజ్మతుల్లా(29) పర్వాలేదనిపించారు. చివర్లో ఆల్‌రౌండర్ నబీ.. భారత బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొని 27 బంతుల్లో 2 ఫోర్లు, 3 సిక్సులతో 42 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. భారత బౌలర్లలో అక్షర్ పటేల్, ముఖేష్ కుమార్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. శివమ్ దూబే ఒక వికెట్ తీశాడు. ఇక 159 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది.
గిల్-రోహిత్ మధ్య సమన్వయలోపంతో రోహిత్ శర్మ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. అయితే.. గిల్(23), తిలక్ వర్మ(26), జితేష్ కుమార్(31) పర్వాలేదనిపంచారు. ఇక ఆల్‌రౌండర్ శివమ్ దూబే మాత్రం మంచి ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్నాడు. 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి టాప్ స్కోరర్‌గా నిలిచాడు. చివర్లో రింకూ సింకూ 9 బంతుల్లో 16 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. దీంతో టీమిండియా 17.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి టార్గెట్‌ను ఛేదించింది. మరి ఈ మ్యాచ్‌తో రోహిత్ శర్మ 100 విజయాల్లో భాగస్వామి అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Rohit Sharma becomes the first player in the history to be part of the 100 wins in Men’s T20I.
– Hitman created history. 💥 pic.twitter.com/A6XxS2fQWz
— Johns. (@CricCrazyJohns) January 11, 2024