ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌! లంకతో సిరీస్‌కు స్టార్‌ క్రికెటర్‌ రెడీ!

IND vs SL, Cricket News: శ్రీలంక పర్యటనకు ముందు భారత క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ తెలుస్తోంది. ఇండియన్‌ క్రికెట్‌లో సూపర్‌స్టార్‌ క్రికెటర్‌ తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs SL, Cricket News: శ్రీలంక పర్యటనకు ముందు భారత క్రికెట్‌ అభిమానులకు అదిరిపోయే గుడ్‌న్యూస్‌ తెలుస్తోంది. ఇండియన్‌ క్రికెట్‌లో సూపర్‌స్టార్‌ క్రికెటర్‌ తిరిగి టీమిండియాలోకి ఎంట్రీ ఇస్తున్నాడు. అతను ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం..

టీ20 వరల్డ్‌ కప్‌ 2024 విజయం తర్వాత విన్నింగ్‌ టీమ్‌ పూర్తిగా రెస్ట్‌ మూడ్‌లోకి వెళ్లిపోయింది. వరల్డ్‌ కప్‌ వెంటనే టీమిండియా జింబాబ్వేతో ఐదు టీ20ల సిరీస్‌ ఆడింది. స్టార్‌ క్రికెటర్లంతా రెస్ట్‌ తీసుకోవడం, రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ, రవీంద్ర జడేజా లాంటి వాళ్లు అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్‌ ప్రకటించడంతో పూర్తిగా యంగ్‌ క్రికెటర్లతో కూడిన టీమిండియా జింబాబ్వే పర్యటనకు వెళ్లిన విషయం తెలిసిందే. శుబ్‌మన్‌ గిల్‌ కెప్టెన్సీలో ఆడిన ఆ యువ జట్టు తొలి టీ20లో ఓడినా.. తర్వాత వరుసగా నాలుగు మ్యాచ్‌లు గెలిచి టీ20 సిరీస్‌ను 4-1తో కైవసం చేసుకుంది. మరికొన్ని రోజుల్లో శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది టీమిండియా.

లంక పర్యటనలో మూడు టీ20లు మూడు వన్డేలు ఆడనుంది. ఈ పర్యటన కోసం టీ20, వన్డే టీమ్స్‌ను నేడో రేపో ప్రకటించనున్నారు భారత సెలెక్టర్లు. టీ20 వరల్డ్‌ కప్‌ ఆడిన సీనియర్లకు శ్రీలంక పర్యటనకు కూడా రెస్ట్‌ ఇస్తారనే వార్తలు వచ్చాయి. టీ20లకు ఎలాగో రోహిత్‌, కోహ్లీ, జడేజా రిటైర్మెంట్‌ ఇవ్వడంతో ఇక మిగిలిన మూడు వన్డేల సిరీస్‌కు కూడా ఈ ముగ్గురితో పాటు జస్ప్రీత్‌ బుమ్రాకు సైతం రెస్ట్‌ ఇవ్వనున్నట్లు కథనాలు వచ్చాయి. కానీ, తాజా సమాచారం ప్రకారం టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ వన్డే సిరీస్‌ ఆడనున్నట్లు తెలుస్తోంది.

ఈ గుడ్‌న్యూస్‌తో క్రికెట్‌ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ రోహిత్‌ శర్మ ఆటను చూసేందుకు చాలా టైమ్‌ పడుతుందని భావించిన అతని అభిమానులకు ఇది కచ్చితంగా అదిరిపోయే న్యూసే. అయితే.. విరాట్‌ కోహ్లీ మాత్రం రెస్ట్‌ తీసుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం కోహ్లీ తన భార్య పిల్లలతో లండన్‌లో ఉన్న విషయం తెలిసిందే. కానీ, రోహిత్‌ శర్మ మాత్రం లంకతో మూడు వన్డేల సిరీస్‌కు అందుబాటులో ఉంటున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27 నుంచి శ్రీలంకతో టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. అలాగే ఆగస్టు 2 నుంచి 7వ వరకు మూడు వన్డే సిరీస్‌ ఆడనుంది టీమిండియా. 2, 4, 7వ తేదీల్లో మూడు వన్డేలు జరగనున్నాయి. రోహిత్‌ రాకతో ఇక కేఎల్‌ రాహుల్‌ కేవలం బ్యాటర్‌గా మాత్రమే ఆడే అవకాశం ఉంది. రోహిత్‌ లేకుంటే అతన్ని తాత్కాలిక కెప్టెన్‌గా నియమిస్తారనే ప్రచారం జరిగింది. మరి రోహిత్‌ లంకతో వన్డే సిరీస్‌ ఆడుతుండటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments