Rohit Sharma: వరల్డ్‌ కప్‌ అందుకుని.. రోహిత్‌ సంచలన నిర్ణయం! భావోద్వేగానికి గురవుతూ..

Rohit Sharma: వరల్డ్‌ కప్‌ అందుకుని.. రోహిత్‌ సంచలన నిర్ణయం! భావోద్వేగానికి గురవుతూ..

Rohit Sharma, Retirement, T20 World Cup 2024: సౌతాఫ్రికాపై అద్భుత విజయంతో దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫైనల్‌ విజయం తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

Rohit Sharma, Retirement, T20 World Cup 2024: సౌతాఫ్రికాపై అద్భుత విజయంతో దేశానికి రెండో టీ20 వరల్డ్‌ కప్‌ అందించిన కెప్టెన్‌ రోహిత్‌ శర్మ.. ఫైనల్‌ విజయం తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించాడు. దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి..

టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌ గెలిచిన తర్వాత.. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌ నుంచి తప్పుకుంటున్నట్లు సంచలన ప్రకటన చేశాడు. ఈ విషయాన్ని బీసీసీఐ కూడా ధృవీకరించింది. శనివారం బార్బోడోస్‌లో సౌతాఫ్రికాతో జరిగిన టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఫైనల్‌ మ్యాచ్‌లో టీమిండియా అద్భుత విజయం సాధించి.. పొట్టి ప్రపంచ కప్‌ను ముద్దాడిన విషయం తెలిసిందే. భారత్‌ను విశ్వవిజేతగా నిలబెట్టిన తర్వాత.. రోహిత్‌ ఈ నిర్ణయం తీసుకున్నాడు.

రోహిత్‌ శర్మ కంటే కొంచెం ముందు మరో దిగ్గజ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ సైతం అంతర్జాతీయ టీ20 క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. తన చివరి టీ20 వరల్డ్‌ కప్‌ ఆడేశానని మ్యాచ్‌ తర్వాత ప్రకటించాడు. కోహ్లీ బాటలోనే ఇప్పుడు రోహిత్‌ శర్మ కూడా పయనించాడు. వరల్డ్‌ కప్‌ విజయంతో తమ టీ20 క్రికెట్‌కు ఇద్దరు గొప్ప క్రికెట్లు ముగింపు పలికారు. ఈ సందర్భంగా రోహిత్‌ శర్మ మాట్లాడుతూ.. ‘ఇది నా చివరి టీ20 గేమ్‌. ఈ ఫార్మాట్‌ ఆడటం మొదలుపెట్టినప్పుటి నుంచి ఈ ఫార్మాట్‌ను ఎంతో ఎంజాయ్‌ చేశాను. ఈ ఫార్మాట్‌కు గుడ్‌బై చెప్పడానికి ఇంతకంటే మంచి సందర్భం ఉండదు. నా టీ20 కెరీర్‌లోని ప్రతీ క్షణాన్ని నేను ప్రేమించాను, ఆస్వాదించాను. ఈ ఫార్మాట్‌తోనే నేను టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాను. దేశం కోసం వరల్డ్‌ కప్‌ గెలవాలని అనుకున్నాను. గెలిచాను.’ అని రోహిత్‌ శర్మ ఎమోషనల్‌ కామెంట్స్‌ చేశాడు.

ఇక రోహిత్‌ శర్మ టీ20 కెరీర్‌ విషయానికి వస్తే.. ఇప్పటి వరకు రోహత్‌ 159 టీ20 మ్యాచ్‌లు ఆడాడు. అందులో 151 ఇన్నింగ్స్‌ల్లో 31.34 యావరేజ్‌, 140.89 స్ట్రైక్‌రేట్‌తో 4231 పరుగులు చేశాడు. టీ20 క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ప్లేయర్‌గా రోహిత్‌ పేరిట అద్భుతమైన రికార్డు ఉంది. రోహిత్‌ ఖాతాలో మొత్తం 5 టీ20 సెంచరీలు ఉన్నాయి. అలాగే 32 హాఫ్‌ సెంచరీలు సాధించాడు. ఇక బౌలింగ్‌లో రోహిత్‌ శర్మకు ఒక వికెట్‌ ఉండటం విశేషం. మరి కెప్టెన్‌గా టీమిండియా వరల్డ్‌ కప్‌ అందించిన.. టీ20ల నుంచి రిటైర్‌ అవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments