టీ20 వరల్డ్‌ కప్‌లో వాళ్లే ఓపెన్‌ చేయాలంటున్న దాదా! ఆ ఇద్దరు ఎవరో తెలిస్తే పూనకాలే!

Rohit Sharma, Virat Kohli: ఐపీఎల్‌ 2024లో భాగంగా కొంతమంది టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అయితే.. ఈ ప్రదర్శన చూసిన తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ ఇద్దరే ఓపెనర్లుగా ఆడాలని సౌరవ్‌ గంగూలీ అంటున్నాడు. మరి ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Rohit Sharma, Virat Kohli: ఐపీఎల్‌ 2024లో భాగంగా కొంతమంది టీమిండియా ఆటగాళ్లు అదరగొడుతున్నారు. అయితే.. ఈ ప్రదర్శన చూసిన తర్వాత టీ20 వరల్డ్‌ కప్‌లో ఆ ఇద్దరే ఓపెనర్లుగా ఆడాలని సౌరవ్‌ గంగూలీ అంటున్నాడు. మరి ఆ ఇద్దరు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఇప్పుడు క్రికెట్‌ అభిమానులంతా ఐపీఎల్‌ ఫీవర్‌తోనే ఊగిపోతున్నారు. అన్ని టీమ్స్‌ సూపర్‌ బ్యాటింగ్‌తో అదరగొడుతున్నాయి. దాదాపు ప్రతి మ్యాచ్‌ కూడా చివరి బాల్‌ వరకు వెళ్తూ.. క్రికెట్‌ అభిమానులకు అంతులేని వినోదాన్ని అందిస్తున్నాయి. అయితే.. ఒక వైపు ఐపీఎల్‌ ఇలా జోరుగా సాగుతున్నా.. మరోవైపు చాలా మంది అభిమానుల దృష్టి రాబోయే టీ20 వరల్డ్‌ కప్‌ 2024 పై కూడా ఉంది. ప్రస్తుతం ఐపీఎల్‌లో బాగా ఆడుతున్న ఆటగాళ్లు ఎవరు? వీరిలో టీ20 వరల్డ్‌ కప్‌ కోసం టీమిండియాలో ఉండే వారు ఎవరు? ఎవర్ని తీసుకోవాలి? ఎవర్ని టీమ్‌ నుంచి తీసేయాలి? ఈ లెక్కలు అభిమానులు కూడా వేసుకుంటున్నారు. అలాగే టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, చీఫ్‌ సెలెక్టర్‌ అజిత్‌ అగార్కర్‌ కూడా ఇదే విషయంపై ఎప్పటికప్పుడు చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే టీమిండియా దిగ్గజ మాజీ కెప్టెన్‌, ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు డైరెక్టర్‌గా ఉన్న సౌరవ్‌ గంగూలీ టీమిండియా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. టీ20 వరల్డ్‌ కప్‌ 2024లో టీమిండియా తరఫున ఆ ఇద్దరు ఆటగాళ్లే ఓపెనింగ్‌ జోడీగా బరిలోకి దిగాలని సూచించాడు. వాళ్లిద్దరు ఓపెనర్లుగా ఆడితే.. టీమిండియాకు తిరుగుండని అంటున్నాడు. ఇంతకీ మరి ఆ ఇద్దరు ఆటగాళ్లు ఎవరో తెలుసా? ఇంకెవరు టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ, సూపర్‌ స్టార్‌ క్రికెటర్‌ విరాట్‌ కోహ్లీ. వీళ్లిద్దరు టీ20 వరల్డ్‌ కప్‌లో ఓపెనర్లుగా ఆడాలని దాదా సూచించాడు. అలా ఆడితే.. కోహ్లీ కేవలం 40 బంతుల్లోనే సెంచరీ చేసే అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌ సీజన్‌లో టీమిండియా సీనియర్‌ స్టార్‌ క్రికెటర్లు రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సూపర్‌ ఫామ్‌లో ఉన్నారు. కోహ్లీ అత్యధిక రన్స్‌తో ఆరెంజ్‌ క్యాప్‌ హోల్డర్‌గా ఉన్నాడు. అలాగే రోహిత్‌ శర్మ కూడా అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ల లిస్ట్‌లో టాప్‌ ఫోర్‌లో ఉన్నాడు. ఇలా టీమిండియాకు రెండు కళ్లలాంటి రోహిత్‌, విరాట్‌లు ఇలాంటి ఫామ్‌లో కొనసాగడం నిజంగా ఇండియన్‌ క్రికెట్‌కు గుడ్‌న్యూస్‌ అనే చెప్పాలి. అయితే.. టీమిండియాకు ఎప్పుడూ వన్‌డౌన్‌లో ఆడే విరాట్‌ కోహ్లీ ఓపెనర్‌గా ఆడేందుకు ఇష్టపడతాడా? లేదా అనేది తెలియాలి. ఐపీఎల్‌లో ఆర్సీబీ తరఫున కోహ్లీ ఓపెనర్‌గా ఆడుతున్న విషయం తెలిసిందే. కాగా, టీమిండియాకు రోహిత్‌ శర్మ, యశస్వి జైస్వాల్‌ ఓపెనర్లుగా ఇన్ని రోజులు టీ20ల్లో ఆడుతున్నారు. మరి గంగూలీ చెప్పినట్లు రోహిత్‌-కోహ్లీ ఓపెనర్లుగా దిగుతారా? అనే వేచి చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments