Rohit Sharma: మేం ఓడితే వాళ్లు సంతోషిస్తారు.. రోహిత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్!

Rohit Sharma Opens Up on Bangladesh Series: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా పాజిటివ్ విషయాలకే ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడైనా నెగెటివ్ అంశాల ప్రస్తావన వచ్చినా తనదైన శైలిలో రియాక్ట్ అయి ఊరుకుంటాడు. అలాంటోడు ఫస్ట్ టైమ్ కాస్త సీరియస్ కామెంట్ చేశాడు.

Rohit Sharma Opens Up on Bangladesh Series: టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా పాజిటివ్ విషయాలకే ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడైనా నెగెటివ్ అంశాల ప్రస్తావన వచ్చినా తనదైన శైలిలో రియాక్ట్ అయి ఊరుకుంటాడు. అలాంటోడు ఫస్ట్ టైమ్ కాస్త సీరియస్ కామెంట్ చేశాడు.

టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఎక్కువగా పాజిటివ్ విషయాలకే ప్రాధాన్యత ఇస్తాడు. ఎప్పుడైనా నెగెటివ్ అంశాల ప్రస్తావన వచ్చినా తనదైన శైలిలో రియాక్ట్ అయి ఊరుకుంటాడు. గ్రౌండ్​లోనే కాదు.. బయట కూడా కూల్​గా, హ్యాపీగా ఉంటూ తన చుట్టూ ఉన్నవారిని అలాగే ఉంచేందుకు ప్రయత్నిస్తుంటాడు హిట్​మ్యాన్. ప్రెస్ మీట్స్​లో కూడా ఎవరైనా సీరియస్ క్వశ్చన్స్ అడిగినా ఫన్నీ ఆన్సర్స్ ఇచ్చి అందర్నీ నవ్వుల్లో ముంచెత్తుతాడు. రోహిత్ మీడియా మీట్​కు వచ్చాడంటే అక్కడ జోక్స్​కు తావుండదు. అలాంటోడు ఫస్ట్ టైమ్ సీరియస్ కామెంట్ చేశాడు. టీమిండియా ఓడిపోతే చూడాలని వాళ్లు అనుకుంటున్నారని అన్నాడు. భారత్ ఓడిపోతే వాళ్లు సంతోషిస్తారని చెప్పాడు. హిట్​మ్యాన్​ ఎవర్ని ఉద్దేశించి ఈ కామెంట్స్ చేశాడో ఇప్పుడు తెలుసుకుందాం..

ప్రతి జట్టు టీమిండియాను ఓడించాలని చూస్తోందన్నాడు రోహిత్. మన టీమ్​ను ఓడిస్తే వాళ్లకు ఆనందం దొరుకుతుందని, ఎంజాయ్ చేయనివ్వండి అని చెప్పాడు. ‘అన్ని జట్లు ఇండియాను ఓడించాలని చూస్తున్నాయి. ఇది వాళ్లకు ఆనందాన్ని ఇస్తోంది. సంతోషపడనివ్వండి. ఇంగ్లండ్ టెస్ట్ సిరీస్ కోసం ఇక్కడికి వచ్చినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్​లో ఆ టీమ్ సభ్యులు అడ్డగోలు వ్యాఖ్యలు చేశారు. కానీ మేం అదేదీ పట్టించుకోలేదు. మా ఆట మేం ఆడుతూ పోయాం. మాకు అదే ముఖ్యం. మంచి క్రికెట్ ఆడాలి. మా బెస్ట్ ఇవ్వాలి అనేదే మా లక్ష్యం’ అని రోహిత్ స్పష్టం చేశాడు. ప్రత్యర్థి జట్లు తాము ఓడితే సంతోషిస్తున్నాయని, వాళ్లు ఇలాగే ఎంజాయ్ చేయాలని చెప్పిన రోహిత్.. తమ పని తాము చేసుకుంటూ వెళ్తామన్నాడు. మంచి క్రికెట్ ఆడుతూ ప్రతి మ్యాచ్, సిరీస్​ను నెగ్గడమే టార్గెట్​గా దూసుకెళ్తామన్నాడు.

ఒక ట్రోఫీ గెలిచేశామని లైట్ తీసుకోకుండా ప్రతి సిరీస్​ను అంతే ముఖ్యంగా భావిస్తూ ముందుకు వెళ్తామన్నాడు రోహిత్. తమ బెస్ట్ గేమ్​ను బయటకు తీసి ప్రత్యర్థులను చిత్తు చేయడానికి ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. గ్రౌండ్​లోకి దిగితే తన ఫోకస్ మొత్తం మ్యాచ్​లు ఎలా గెలవాలనే దానిపై ఉంటుందన్నాడు. గేమ్ మీద తమదైన ముద్ర వేయాలంటే ఆటగాళ్లకు ఎక్కువ టైమ్ ఉండదన్న భారత కెప్టెన్.. తమ చేతిలో ఉన్న ప్రతి మ్యాచ్​ను గెలుచుకుంటూ పోవాలన్నాడు. ఎలా గెలవలం? నెగ్గాలంటే ఏం చేయాలి? లాంటి ఆలోచనలు తన మైండ్​లో ఎప్పుడూ నడుస్తుంటాయన్నాడు రోహిత్. యశస్వి జైస్వాల్, సర్ఫరాజ్ ఖాన్, ధృవ్ జురెల్ లాంటి యువ ఆటగాళ్లు టీమిండియాకు ఎంతో ముఖ్యమని చెప్పిన హిట్​మ్యాన్.. వాళ్లను మరింత సానబెట్టాల్సిన అవసరం ఉందన్నాడు. ప్రత్యర్థులు తమ ఓటమిని ఎంజాయ్ చేస్తున్నారంటూ రోహిత్ చేసిన వ్యాఖ్యలపై మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.

Show comments