రింకూ సింగ్ విధ్వంసం.. అర్షదీప్ ను టార్గెట్ చేసి..

  • Author Soma Sekhar Published - 03:21 PM, Thu - 2 November 23

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు రింకూ సింగ్. పంజాబ్ తో తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరీ ముఖ్యంగా తన సహచర ఆటగాడు అయిన అర్షదీప్ బౌలింగ్ ను టార్గెట్ చేసి.. ఉతికి ఆరేశాడు.

సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు రింకూ సింగ్. పంజాబ్ తో తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరీ ముఖ్యంగా తన సహచర ఆటగాడు అయిన అర్షదీప్ బౌలింగ్ ను టార్గెట్ చేసి.. ఉతికి ఆరేశాడు.

  • Author Soma Sekhar Published - 03:21 PM, Thu - 2 November 23

టీమిండియా చిచ్చర పిడుగు.. ఐపీఎల్ బెస్ట్ ఫినిషర్ గా ముద్రపడిన రింకూ సింగ్ చెలరేగిపోతున్నాడు. దేశవాళీ ట్రోఫీ అయిన సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీలో దుమ్మురేపుతున్నాడు. పంజాబ్ తో తాజాగా జరిగిన క్వార్టర్ ఫైనల్-1లో రింకూ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. మరీ ముఖ్యంగా తన సహచర ఆటగాడు అయిన అర్షదీప్ బౌలింగ్ ను ఉతికి ఆరేశాడు. కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు, 6 సిక్సర్ల సాయంతో అజేయంగా 77 పరుగులు చేశాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే? రింకూ విధ్వంసానికి పంజాబ్ బౌలర్లు ఆఖరి రెండు ఓవర్లలో 39 రన్స్ సమర్పించుకున్నారు.

రింకూ సింగ్.. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో మారుమ్రోగుతున్న పేరు. ఈ టోర్నీలో చిచ్చరపిడుగులా చెలరేగుతూ.. ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు రింకూ. ఇప్పటికే పలు సంచలన ఇన్నింగ్స్ లు ఆడి.. ది ఫినిషర్ గా అందరి నోళ్లలో నానాడు. తాజాగా మరోసారి ప్రపంచ క్రికెట్ ను తనవైపు తిప్పుకునే ఇన్నింగ్స్ తో చెలరేగాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా నవంబర్ 2(గురువారం)న పంజాబ్ తో జరిగిన మ్యాచ్ లో కేవలం 33 బంతుల్లోనే 4 ఫోర్లు,6 సిక్సర్లతో అజేయంగా 77 పరుగులు చేశాడు. రింకూ ధాటికి పంజాబ్ రెండు ఓవర్లలోనే 39 పరుగులు సమర్పించుకుంది. ఇందులో అర్షదీప్ వేసిన ఆఖరి ఓవర్లో తన విశ్వరూపం చూపాడు రింకూ. ఈ ఓవర్లలో 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 23 పరుగులు పిండుకుని.. అర్షదీప్ ను ఉతికి ఆరేశాడు. స్టార్ బౌలర్ గా టీమిండియాలో పేరుగాంచిన అర్షదీప్.. రింకూ బ్యాటింగ్ దాటికి ప్రేక్షక పాత్ర వహించాడు. రింకూ విధ్వంసం ఏ స్థాయిలో ఉందంటే 18 ఓవర్లకు 21 బంతుల్లో 38 పరుగులతో ఉన్న రింకూ.. మ్యాచ్ ముగిసే సమయానికి 33 బంతుల్లో 77 పరుగులు చేశాడంటేనే అతడి ఊచకోత అర్దం చేసుకోవచ్చు.

ఈ మ్యాచ్ లో రింకూ విధ్వంసం దాటికి తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 169 పరుగులు చేసింది. రింకూతో పాటు సమీర్ రిజ్వి 29 బంతుల్లో ఓ ఫోర్, 4 సిక్సర్లతో 42 రన్స్ చేసి నాటౌట్ గా నిలిచాడు. అనంతరం 170 పరుగుల లక్ష్యంలో బరిలోకి దిగిన పంజాబ్ 5 వికెట్ల తేడాతో యూపీపై విజయం సాధించింది. 19.1 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. జట్టులో వాధేరా(52), అన్మోల్ ప్రీత్ సింగ్(43), సన్వీర్ సింగ్(35*), రమన్ దీప్ సింగ్(22*)రన్స్ తో రాణించారు. మ్యాచ్ ఓడినప్పటికీ రింకూ మాత్రం అభిమానులను తన తుపాన్ బ్యాటింగ్ తో అలరించాడు. మరి రింకూ థండర్ ఇన్నింగ్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments