SNP
RCB, WPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఒక కప్పు కొట్టింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆ జట్టు ఖాతా తెరిచింది. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ఇంకా టైటిల్ కోసం ఎదురుచూస్తునే ఉంది. అయితే.. తొలి కప్ గెలిచినా కూడా ఆర్సీబీపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
RCB, WPL 2024: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎట్టకేలకు ఒక కప్పు కొట్టింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్‌లో ఆ జట్టు ఖాతా తెరిచింది. కానీ, ఐపీఎల్‌లో మాత్రం ఇంకా టైటిల్ కోసం ఎదురుచూస్తునే ఉంది. అయితే.. తొలి కప్ గెలిచినా కూడా ఆర్సీబీపై దారుణమైన ట్రోలింగ్ జరుగుతోంది. ఎందుకో ఇప్పుడు చూద్దాం..
SNP
ఐపీఎల్‌లో భారీ క్రేజ్ ఉన్న టీమ్ ఏదంటే.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు. 16 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఒక్కసారి కూడా ఛాంపియన్‌గా నిలువకపోయినా.. ఆ టీమ్ క్రేజ్, పాపులారిటీ కొంచెం కూడా తగ్గలేదు. ఆర్సీబీలో విరాట్ కోహ్లీ ఉండటమే అందుకు కారణం. అలాగే.. 2023లో ప్రారంభం అయిన డబ్ల్యూపీఎల్‌లో కూడా ఆర్సీబీ ఉమెన్స్ టీమ్‌కు అదే రేంజ్‌లో క్రేజ్ లభించింది. స్మృతి మంధాన లాంటి లేడీ సూపర్ స్టార్ క్రికెటర్ ఆ టీమ్‌కు కెప్టెన్‌గా ఉండటంతో పాటు, కోహ్లీతో వచ్చిన న్యాచురల్ క్రేజ్ కూడా ఉమెన్స్ టీమ్‌కు ప్లేస్ అయింది. డబ్ల్యూపీఎల్ 2024 సందర్భంగా తొలి మ్యాచ్‌లో కూడా మంధాన మాట్లాడుతున్న సమయంలో బెంగళూరు క్రౌడ్ భారీగా కేరింతలు కొడుతూ తమ సపోర్ట్‌ను తెలియజేశారు. వాళ్లు ఇచ్చిన ఎనర్జీతో ఈ ఏడాది డబ్ల్యూపీఎల్ విన్నర్‌గా నిలిచింది ఆర్సీబీ. ఈ విజయంతో ఆర్సీబీ ఫ్యాన్స్ అంతా ఫుల్ ఖుషీగా ఉన్నారు. కానీ, వాళ్లని ఓ విషయం బాధపెడుతోంది. అదేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..
ఐపీఎల్ ఆరంభం నుంచి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మంచి స్ట్రాంగ్ టీమ్ గానే ఉంది. ఆరంభ సీజన్‌లో దారుణమైన ప్రదర్శనతో టెస్ట్ టీమ్‌గా ముద్ర వేసుకుంది ఆర్సీబీ. కానీ, టీమిండియాలో కోహ్లీ హవా పెరుగుతూ పోయిన కొద్ది ఆర్సీబీకి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. కొన్నేళ్లుగా పాపులారిటీ విషయంలో ఐపీఎల్‌లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా నంబర్ వన్ ఫ్రాంచైజ్ క్రికెట్ టీమ్‌గా కొనసాగుతోంది ఆర్సీబీ. దాని కారణం విరాట్ కోహ్లీనే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయినా కూడా ఏదో వెలితి. అదే ఐపీఎల్ కప్పు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో 16 సీజన్లు జరిగాయి. అందులో కేవలం మూడు సార్లు మాత్రమే ఆర్సీబీ ఫైనల్ చేరింది. 2009, 2011, 2016 సీజన్లలో ఆర్సీబీ ఫైనల్ చేరినా.. కప్పు మాత్రం దక్కలేదు.
కోహ్లీ, ఏబీ డివిలియర్స్, క్రిస్ గేల్, డేల్ స్టెయిన్ లాంటి హేమాహేమీలు టీమ్‌లో ఉన్నా కూడా ఆర్సీబీ కప్పు కొట్టలేకపోవడంతో ఆర్సీబీపై సోషల్ మీడియాలో దారుణమైన ట్రోలింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే.. ఇన్నేళ్ల తర్వాత కనీసం ఉమెన్స్ టీమైనా కప్పు కొట్టి పరువు నిలబెట్టింది అంటే.. ఇప్పుడు కూడా ట్రోలింగ్ తగ్గడం లేదు సరికదా.. మరింత పెరిగింది. 16 ఏళ్ల నుంచి ఐపీఎల్ ఆడుతున్నా.. మెన్స్ టీమ్ ఒక్క కప్పు కొట్టలేదని, రెండో సీజన్‌లోనే ఉమెన్స్ టీమ్ కప్పు కొట్టిందని, వాళ్లని చూసైనా సిగ్గు తెచ్చుకోవాలి అంటూ ఆర్సీబీ మెన్స్ టీమ్‌పై కొంతమంది సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. దీంతో.. కప్పు గెలిచినా ఈ తలనొప్పి తగ్గడం లేదంటూ ఆర్సీబీ ఫ్యాన్స్ తెగ బాధపడిపోతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Congrats, @RCBTweets 🔥🏆 pic.twitter.com/j0cAaNe12R
— Rajasthan Royals (@rajasthanroyals) March 17, 2024
RCB women RCB Men https://t.co/QFO4SrHVxx pic.twitter.com/XE28ulwVEj
— Radoo (@Ungamma_ra) March 18, 2024
~RCB fans think they are also gonna win Mens Trophy this year.
RCB Mens team every year: pic.twitter.com/LvNhK5ZvQL
— Chandru Ramakrishnan (@rchandru24) March 18, 2024
when it comes to lifting
Rcb men Rcb women pic.twitter.com/bDKMYsYWhz
— Stutii (@Sam0kayy) March 18, 2024
RCB: IPL vs WPL 😂pic.twitter.com/iZfJBHX1Lo
— Keh Ke Peheno (@coolfunnytshirt) March 18, 2024