పదేళ్ల నుంచి ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు! ఏం ఆడుతున్నావ్‌ జడ్డూ?

  • Author Soma Sekhar Published - 07:45 PM, Thu - 28 September 23
  • Author Soma Sekhar Published - 07:45 PM, Thu - 28 September 23
పదేళ్ల నుంచి ఒక్క హాఫ్‌ సెంచరీ కూడా లేదు! ఏం ఆడుతున్నావ్‌ జడ్డూ?

టీమిండియా మరికొన్ని రోజుల్లో వరల్డ్ కప్ బరిలోకి దిగబోతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని భారత జట్టు అన్ని విభాగాల్లో పటిష్టంగా ఉంది. రోహిత్, గిల్, విరాట్, రాహుల్, సూర్యకుమార్, శ్రేయస్ అయ్యర్ లతో కూడిన బ్యాటింగ్ విభాగం బలంగా కనిపిస్తోంది. అటు బుమ్రా, సిరాజ్, షమీలతో బౌలింగ్ దళం కూడా పటిష్టంగానే కనిపిస్తోంది. కానీ ఒకే ఒక్క సమస్య భారత జట్టును కలవరపెడుతోంది. అదే స్టార్ ఆల్ రౌండర్ జడేజా ఫామ్. ప్రస్తుతం జడ్డూ ఫామ్ టీమిండియాకు పెద్ద సమస్యగా మారింది. టీమిండియా గడ్డపై అతడి బ్యాటింగ్ గణాంకాలు చూస్తే.. మైండ్ పోవడం ఖాయమే. జడేజా 10 ఏళ్ల నుంచి ఇండియాలో ఒక్కటంటే.. ఒక్కటి హాఫ్ సెంచరీ కూడా కొట్టలేదంటేనే అర్దమవుతోంది అతడి పేలవ బ్యాటింగ్ ప్రదర్శన.

రవీంద్ర జడేజా.. ఇటు బౌలింగ్, అటు బ్యాటింగ్.. మరోపక్క మెరుపు ఫీల్డింగ్ చేయగల సమర్దవంతమైన ఆటగాడు. ఇలాంటి ప్లేయర్ టీమిండియాలో ఉండటం అదృష్టమనే చెప్పాలి. కానీ గత కొంతకాలంగా అతడి గణాంకాలు చూస్తే ఆందోళన కలగకమానదు. పైగా వరల్డ్ కప్ ప్రారంభానికి కొద్ది రోజులు మాత్రమే ఉండటం.. మరింత ఆందోళనకరం. వరల్డ్ కప్ లాంటి మెగాటోర్నీలో ఆల్ రౌండర్ల పాత్ర కీలకమైంది. 2011 వరల్డ్ కప్ గెలవడంలో స్టార్ ఆల్ రౌండర్ యువరాజ్ సింగ్ పాత్రను ఎప్పటికీ మర్చిపోలేం. ఈ మెగాటోర్నీలో మ్యాన్ ఆఫ్ ది సిరీస్ గెలుచుకున్నాడు యువీ. అలాంటి ఆల్ రౌండర్ మళ్లీ టీమిండియాకు జడేజా రూపంలో దొరికాడు.

ప్రస్తుతం బౌలింగ్ లో అద్భుతంగా రాణిస్తున్న జడేజా.. బ్యాటింగ్ లో మాత్రం ఘోరంగా విఫలం అవుతూ వస్తున్నాడు. జడేజా గత రెండేళ్లలో 100కు పైగా స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేసింది కేవలం రెండే మ్యాచ్ ల్లో. అవి కూడా భారీ ఇన్నింగ్స్ లు కావు. ఇదిలా ఉంటే.. జడేజాకు సంబంధించి ఇంకో షాకింగ్ విషయం ఏంటంటే? భారత గడ్డపై జడేజా 50 పరుగులు కొట్టి.. 10 ఏళ్లు గడచిపోయింది. జడ్డూ చివరిసారిగా 2013 జనవరిలో హాఫ్ సెంచరీ కొట్టాడు. ఆ తర్వాత ఇప్పటి వరకు స్వదేశంలో అతడు అర్దశతకం సాధించింది లేదు. దీంతో టెయిలెండర్లతో మంచి భాగస్వామ్యాన్ని నిర్మించలేక టీమిండియా కొన్ని మ్యాచ్ ల్లో పరాజయాల్ని మూటగట్టుకుంటోంది.

తాజాగా ఆసీస్ తో జరిగిన మూడో వన్డేనే తీసుకుంటే.. 235/5తో నిలిచిన టీమిండియా చివరి 5 వికెట్లను మరో 53 పరుగులకే కోల్పోయింది. ఓ ఎండ్ లో వికెట్లు పడుతున్నా.. జడేజా తన దూకుడును ప్రదర్శించలేకపోయాడు. దూకుడుగా ఆడాల్సిన పరిస్థితుల్లో జడ్డూ తన బ్యాట్ కు పనిచెప్పలేక పూర్ ఫామ్ ను కొనసాగిస్తున్నాడు. ఇక జడేజా ఫామ్ ను చూస్తున్న క్రికెట్ ఫ్యాన్స్.. ఇంకా ఎన్ని రోజులు జడ్డూ భాయ్ ఈ బ్యాటింగ్ అంటూ విమర్శిస్తున్నారు. అతడి బ్యాటింగ్ గణాంకాలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. కామెంట్స్ చేస్తున్నారు. మరి వరల్డ్ కప్ ముందు జడేజా ఫామ్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Show comments