SNP
SNP
వన్డే వరల్డ్ కప్ 2023లో భాగంగా ఆస్ట్రేలియాతో చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్‌లో టీమిండియా బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేస్తున్నారు. టాస్ గెలిచి ఎంతో సంతోషంగా తొలుత బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియాకు బూమ్ బూమ్ బుమ్రా ఆరంభంలోనే గట్టి ఎదురుదెబ్బ కొట్టాడు. ఫామ్‌లో ఉన్న మిచెల్ మార్ష్‌ను డకౌట్ చేసి.. ఆసీస్‌కు భారీ షాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఓపెనర్ డేవిడ్ వార్నర్‌తో కలిసి వన్‌డౌన్‌లో వచ్చిన స్టీవ్ స్మిత్ మంచి పార్ట్నర్‌షిప్ నమోదు చేశారు. ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌ను వార్నర్-స్మిత్ జోడీ బిల్డ్ చేసేలా కనిపించింది. కానీ, కుల్దీప్ యాదవ్ వార్నర్‌ను అవుట్ చేసి.. మంచి పార్ట్నర్‌షిప్‌ను బ్రేక్ చేశాడు. ఇక ఇక్కడి నుంచి ఆస్ట్రేలియా ఏ దశలోనూ కోలుకోలేదు.
ముఖ్యంగా రవీంద్ర జడేజా అయితే.. ఆస్ట్రేలియా బ్యాటింగ్ లైనప్‌ను జడేజా వణికించాడనే చెప్పాలి. ఇండియాపై ఎంతో మంచి రికార్డు ఉండి, అప్పటి వరకు అద్భుతంగా ఆడుతున్న స్టీవ్ స్మిత్‌ను జడేజా ఓ సూపర్ డెలవరీతో పెవిలియన్ చేర్చాడు. ఈ మ్యాచ్‌కే కాదు.. మొత్తం ఈ వరల్డ్ కప్‌కే హైలెట్ బాల్‌గా చెప్పుకోవచ్చు. జడేజా వేసిన ఇన్నింగ్స్ 28వ ఓవర్ తొలి బంతిని స్మిత్ డిఫెన్స్ ఆడబోయడు. కానీ, బాల్ అద్భుతంగా టర్న్ అండ్ బౌన్స్ అయి.. ఆఫ్ స్టంప్స్‌ను గిరాటేసింది. అసలు ఏం జరిగిందో అర్థం కాని స్మిత్.. కొద్ది సేపు అలాగే ఉండిపోయాడు. ఇక చేసేదేం లేక పెవిలియన్ బాట పట్టాడు. అయితే.. జడేజా వేసిన బాల్‌కు స్మితే కాదు.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ సైతం షాక్ అయ్యాడు. వికెట్ పడిన తర్వాత కోహ్లీ ఇచ్చిన రియాక్షన్ వైరల్‌గా మారింది.
స్మిత్‌ను అవుట్ చేసి ఫుల్ జోస్‌లోకి వచ్చిన జడేజా.. ఆ వెంటనే మరో ఓవర్‌లో ఏకంగా రెండు వికెట్ల పడగొట్టి ఆసీస్‌ను కోలుకోకుండా చేశాడు. ఇన్నింగ్స్ 30వ ఓవర్‌లో రెండో బంతికి మార్నస్ లబుషేన్‌ను అవుట్ చేసి, నాలుగో బంతికి అలెక్స్ క్యారీని డకౌట్ చేశాడు. మొత్తం 10 ఓవర్ల కోటా పూర్తి చేసిన జడేజా.. కేవలం 28 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. అయితే.. ఈ మ్యాచ్‌లో జడేజా స్మిత్‌ను అవుట్ చేసిన డెలవరీ మాత్రం అద్భుతమని చెప్పాలి. ఆ బాల్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Peach of a delivery from Sir Jadeja 🔥
Smith’s reaction says it all 😍#CWC23 | #CricketWorldCup2023 | #Jadeja pic.twitter.com/33eO0OoS1a
— ♔ (@balltamperrerrr) October 8, 2023
ఇదీ చదవండి: World Cup: ఆసీస్‌తో మ్యాచ్.. బరిలోకి దిగిన జార్వో!