ICC టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ ప్రకటన! ఇండియా నుంచి ఆ ఇద్దరే

Ravindra Jadeja, Ravichandran Ashwin: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో భారత నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లకే చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు ఐసీసీ షాకిచ్చింది. మరి వాళ్లుకు కాకుండా టెస్ట్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

Ravindra Jadeja, Ravichandran Ashwin: ఐసీసీ విడుదల చేసిన టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో భారత నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లకే చోటు దక్కింది. రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీలకు ఐసీసీ షాకిచ్చింది. మరి వాళ్లుకు కాకుండా టెస్ట్‌ టీమ్‌లో చోటు దక్కించుకున్న ఆ ఆటగాళ్లు ఎవరో ఇప్పుడు చూద్దాం..

ఇంటర్నేషనల్‌ క్రికెట్‌ కౌన్సిల్‌ తాజాగా టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ను ప్రకటించింది. ఈ టీమ్‌లో ఇండియా నుంచి కేవలం ఇద్దరు ఆటగాళ్లకు మాత్రమే చోటు దక్కడం గమనార్హం. వన్డే టీమ్‌లో ఏకంగా ఆరుగురు భారత ఆటగాళ్లు ఉన్నారు. కానీ, టెస్ట్‌ టీమ్‌లో మాత్రం కేవలం ఇద్దరికే చోటు దక్కింది. పైగా టీమిండియాలో స్టార్‌ ఆటగాళ్లుగా ఉన్న రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ సైతం ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కించుకోలేకపోయారు. ఇటీవల జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో ఆస్ట్రేలియాను విశ్వవిజేతగా నిలిపిన ఆ జట్టు కెప్టెన్‌ ప్యాట్‌ కమిన్స్‌కు టెస్ట్‌ టీమ్‌ కెప్టెన్సీ అప్పగించింది ఐసీసీ. వన్డే టీమ్‌కు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా ఉండగా.. టెస్ట్‌ జట్టుకు కమిన్స్‌ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు.

వన్డే వరల్డ్‌ కప్‌ 2023లో సత్తా చాటిన ఆటగాళ్లకు వన్డే టీమ్‌లో చోటు కల్పించిన బీసీసీఐ.. అంతకంటే ముందు జరిగిన వరల్డ్‌ టెస్ట్‌ ఛాంపియన్‌ షిప్‌ 2023లో సత్తా చాటిన ఆటగాళ్లుకు టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు కల్పించినట్లు తెలుస్తుంది. అయితే.. ఈ టీమ్‌లో ఉస్మాన్‌ ఖవాజా, కరుణరత్నే, కేన్‌ విలియమ్సన్, జో రూట్, ట్రావిస్‌ హెడ్, రవీంద్ర జడేజా, అలెక్స్‌ కారీ, ప్యాట్‌ కమిన్స్(కెప్టెన్‌), రవిచంద్రన్‌ అశ్విన్, మిచెల్‌ స్టార్క్, స్టువర్ట్‌ బ్రాడ్ ఉన్నారు. వీరిలో బ్రాడ్‌ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు కూడా పలికేశాడు.

అయితే.. ఇండియా నుంచి కేవలం ఇద్దరు స్పిన్‌ ఆల్‌రౌండర్లకు మాత్రమే ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌లో చోటు దక్కడంపై భారత క్రికెట్‌ అభిమానులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కాగా, మరో రెండు రోజుల్లో ఇంగ్లండ్‌తో ప్రారంభం కానున్న ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌తో లెక్కలన్ని మారుతాయని, ఐసీసీ ర్యాంకింగ్స్‌లోనూ భారత ఆటగాళ్లు సత్తా చాటుతారని ఫ్యాన్స్‌ ధీమాగా ఉన్నారు. అయితే.. విరాట్‌ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల తొలి రెండు టెస్టులకు దూరం అవ్వడంతో టీమిండియాకు గట్టి షాక్‌ తగిలింది. కానీ, చివరి మూడు టెస్టులకు కోహ్లీ తిరిగి వస్తే.. తన ర్యాంకింగ్‌ను మెరుగు పర్చుకుని.. ఐసీసీ టెస్ట్‌ టీమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ 2024లో రోహిత్‌, కోహ్లీతో పాటు మరికొంతమంది భారత ఆటగాళ్లు చోటు దక్కించుకుంటారని భారత అభిమానులు ఆశాభావం ‍వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments