ఓపెనర్‌గా ఆడి భీకర బ్యాటింగ్‌ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌! కేవలం 20 బంతుల్లోనే..

ఓపెనర్‌గా ఆడి భీకర బ్యాటింగ్‌ చేసిన రవిచంద్రన్‌ అశ్విన్‌! కేవలం 20 బంతుల్లోనే..

Ravichandran Ashwin, Tamil Nadu Premier League: ఇంత కాలం అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ గురించి.. క్యారమ్‌ బాల్‌ గురించి విన్న క్రికెట్‌ అభిమానులు.. ఇప్పుడు అతని బ్యాటింగ్‌ విధ్వంసం చూశారు. అశ్విన్‌ బ్యాటింగ్‌ విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

Ravichandran Ashwin, Tamil Nadu Premier League: ఇంత కాలం అశ్విన్‌ స్పిన్‌ మ్యాజిక్‌ గురించి.. క్యారమ్‌ బాల్‌ గురించి విన్న క్రికెట్‌ అభిమానులు.. ఇప్పుడు అతని బ్యాటింగ్‌ విధ్వంసం చూశారు. అశ్విన్‌ బ్యాటింగ్‌ విశ్వరూపం గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

టీమిండియా స్టార్‌ ఆల్‌రౌండర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ బ్యాటింగ్‌ చేస్తాడని తెలుసుకానీ ఈ రేంజ్‌లో ఇరగదీస్తాడని చాలా మందికి తెలియదు. తాజాగా అతను ఆడిన ఇన్నింగ్స్‌ చూస్తే.. వామ్మో ఆడుతుంది అశ్వినేనా అని అనిపించకమానదు. ఫోర్లు, సిక్సులతో ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. చిన్నపాటి విధ్వంసం సృష్టించాడు. అది ఓపెనర్‌గా బ్యాటింగ్‌కి వచ్చిన ఈ సంచలనం నమోదు చేశాడు. తమిళనాడు ప్రీమియర్‌ లీగ్‌లో భాగంగా.. చెపాక్ సూపర్ గిల్లీస్ టీమ్‌తో జరిగిన మ్యాచ్‌లో అశ్విన్‌ తన బ్యాటింగ్‌ విశ్వరూపం చూపించాడు.

దిండిగల్‌ డ్రాగన్స్‌ జట్టు తరఫున ఆడుతున్న అశ్విన్‌ కేవలం 7 ఓవర్ల మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సంచలన బ్యాటింగ్‌ చేశాడు. కేవలం 20 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సులతో 225 స్ట్రైక్‌రేట్‌తో 45 పరుగులు చేసి.. నాటౌట్‌గా నిలిచాడు. అశ్విన్‌ తప్ప ఆ జట్టులోని మిగతా బ్యాటర్లంతా విఫలం కావడంతో డ్రాగన్స్‌ టీమ్‌ 7 ఓవర్లలో 64 పరుగులు మాత్రమే చేసింది. అందులో 45 పరుగులు అశ్విన్‌ ఒక్కడే చేశాడు. డ్రాగన్స్‌ బ్యాటింగ్‌ లైనప్‌లో నలుగురు బ్యాటర్లు డకౌట్‌ అయ్యారు. అశ్విన్‌కి విమల్‌ కుమార్‌ 7 బంతుల్లో 12 పరుగులు చేసి కాస్త సపోర్ట్‌ ఇచ్చాడు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దిండిగల్‌ నిర్ణీత 7 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 64 పరుగులు చేసింది. అశ్విన్‌ 45 పరుగులతో అదరగొట్టాడు. మిగతా బ్యాటర్లు విఫలం కావడంతో తక్కువ స్కోర్‌కు పరిమితం అయింది డ్రాగన్స్‌ జట్టు. ఇక 65 పరుగుల టార్గెట్‌తో బరిలోకి దిగిన చెపాక్‌ సూపర్‌ గిల్లీస్‌ జట్టు కేవలం 4.5 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఊదిపారేసింది. నారాయణ్‌ జగదీశణ్‌ 14 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్సులతో 32 పరుగులు చేశాడు. బాబా అపరాజిత్‌ 14 బంతుల్లో 31 పరుగులు చేశాడు. మొత్తం ఒక వికెట్‌ కోల్పోయి టార్గెట్‌ ఛేజ్‌ చేసి చెపాక్‌ జట్టు విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో డ్రాగన్స్‌ టీమ్‌ ఓడిపోయినా.. అశ్విన్‌ ఆడిన ఇన్నింగ్స్‌పై మాత్రం ప్రశంసల వర్షం కురుస్తోంది. మరి అశ్విన్‌ బ్యాటింగ్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments