Kedar Jadhav: కేదార్ జాదవ్ గుర్తున్నాడా? భారీ స్కోర్ సాధించినా అవమానం!

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేదార్ జాదవ్​ గుర్తున్నాడా? తన బ్యాటింగ్ ప్రతిభతో భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు జాదవ్. అలాంటోడికి అవమానం జరిగింది.

టీమిండియా సీనియర్ బ్యాటర్ కేదార్ జాదవ్​ గుర్తున్నాడా? తన బ్యాటింగ్ ప్రతిభతో భారత జట్టు సాధించిన ఎన్నో విజయాల్లో కీలకపాత్ర పోషించాడు జాదవ్. అలాంటోడికి అవమానం జరిగింది.

క్రికెట్​లో అవకాశాలు రావడమే గగనం. ఒకవేళ ఛాన్స్ దక్కినా దాన్ని కాపాడుకొని టీమ్​లో సెటిల్ అవ్వడం అంటే మాటలు కాదు. తీవ్ర పోటీ ఉండే జాతీయ జట్టులో పర్మినెంట్ ప్లేయర్​గా మారాలంటే టాలెంట్​ మాత్రమే ఉంటే సరిపోదు. ఫిట్​నెస్, స్కిల్స్, గేమ్ అవేర్​నెస్​ను పెంచుకోవాలి. ప్రెజర్​ను తట్టుకొని రెగ్యులర్​గా పెర్ఫార్మ్ చేయాలి. అప్పుడే టీమ్​లో సెటిల్ అవ్వొచ్చు. కొందరు క్రికెటర్లు భారత టీమ్​లోకి తారాజువ్వలా దూసుకొచ్చినా అంతే వేగంగా కనుమరుగు అయ్యారు. మొదట్లో అదరగొట్టిన ప్లేయర్లు.. దాన్ని కొనసాగించడంలో ఫెయిలై రేసులో వెనుకబడి పోయారు. అలాంటి వారిలో ఒకడు కేదార్ జాదవ్. మంచి ప్రతిభ కలిగిన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు జాదవ్. తన బ్యాటింగ్ స్కిల్స్​తో భవిష్యత్తుపై భరోసా పెంచాడు. అయితే ఎంత వేగంగా టీమ్​లోకి వచ్చాడో అంతే వేగంగా కనుమరుగయ్యాడు. అలాంటి జాదవ్​కు అవమానం జరిగింది.

రంజీ ట్రోఫీ 2024లో భాగంగా మహారాష్ట్ర టీమ్​కు ప్రాతినిధ్యం వహిస్తున్న కేదార్ జాదవ్.. జార్ఖండ్​పై మ్యాచ్​లో అదరగొట్టాడు. ఫస్ట్ ఇన్నింగ్స్​లో భారీ స్కోరుతో తన సత్తా చాటాడు. 216 బంతులు ఎదుర్కొన్న ఈ సీనియర్ బ్యాటర్ ఏకంగా 182 పరుగులు చేశాడు. అతడితో పాటు పవన్ షా (136), అంకిత్ బావ్నే (131) రాణించడంతో మహారాష్ట్ర 601 పరుగుల భారీ స్కోరు చేసింది. అంతకంటే ముందు బ్యాటింగ్ చేసిన జార్ఖండ్ తొలి ఇన్నింగ్స్​లో 403 పరుగులకు ఆలౌట్ అయింది. రెండో ఇన్నింగ్స్​లో 2 వికెట్లకు 167 పరుగులు చేసింది. డ్రాగా నిలిచిన మ్యాచ్​లో జాదవ్ ఆడిన మ్యాజికల్ ఇన్నింగ్స్​ హైలైట్​గా నిలిచింది. పత్తా లేకుండా పోయిన వెటరన్ బ్యాటర్ భారీ సెంచరీతో అందర్నీ అలరించాడు. బౌండరీల మీద బౌండరీలు బాదుతూ తనలో సత్తా ఏమాత్రం తగ్గలేదని ప్రూవ్ చేశాడు. అయితే అంత బాగా ఆడినా జాదవ్​ను ఎవరూ మెచ్చుకోలేదు.

39 ఏళ్ల కేదార్ జాదవ్ రంజీ ట్రోఫీలో భారీ సెంచరీతో మెరిసినా అతడ్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. అదే ఓ యంగ్ క్రికెటర్ ఇలాంటి ఇన్నింగ్స్ ఆడి ఉంటే అతడ్ని ఆకాశానికి ఎత్తేసేవారు. అతడ్ని పొగుడుతూ సోషల్ మీడియాలో ట్వీట్లు చేసేవారు. కానీ ఫేడ్ అవుట్ అయిన ఆటగాడు కావడంతో ఇంత బాగా ఆడినా ఎవరూ కేర్ చేయడం లేదు. జాదవ్ ఇన్నింగ్స్ చూసిన నెటిజన్స్ కూడా అదే అంటున్నారు. ఇంత బాగా ఆడినా ఎవరూ పట్టించుకోకపోవడం అవమానమని.. పాపం జాదవ్ అని కామెంట్స్ చేస్తున్నారు. ఎవరు మెచ్చుకున్నా, మెచ్చుకోకపోయినా కేదార్ ఆడిన ఇన్నింగ్స్ విలువ తగ్గదని చెబుతున్నారు. తనకు సాధ్యమైనన్ని రోజులు అతడు క్రికెట్ ఆడాలని.. తన అనుభవాన్ని యంగ్ క్రికెటర్స్​తో పంచుకోవాలని నెటిజన్స్ సూచిస్తున్నారు. ఇక, 73 వన్డేలు ఆడిన జాదవ్ 1,369 పరుగులు చేశాడు. 9 టీ20ల్లో భారత్​కు ప్రాతినిధ్యం వహించిన ఈ సీనియర్ బ్యాటర్ 122 పరుగులు చేశాడు. మరి.. కేదార్ జాదవ్​కు జరిగిన అవమానంపై మీ అభిప్రాయాలను కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: జైస్వాల్‌, శివమ్‌ దూబే కష్టాన్ని గుర్తించిన BCCI.. ఇక నుంచి!

Show comments