iDreamPost

జైస్వాల్‌, శివమ్‌ దూబే కష్టాన్ని గుర్తించిన BCCI.. ఇక నుంచి!

  • Published Jan 16, 2024 | 12:57 PMUpdated Jan 16, 2024 | 1:32 PM

Shivam Dube, Jaiswal: జైస్వాల్‌, శివమ్‌ దూబే.. ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మారుమోగిపోతున్న పేర్లు. ముఖ్యంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో వీరిద్దరి బ్యాటింగ్‌ చూసి.. కోహ్లీ, రోహితే షాక్‌ అయ్యారు. ఇప్పుడు వారి కష్టానికి తగిన ఫలితం కూడా దక్కనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

Shivam Dube, Jaiswal: జైస్వాల్‌, శివమ్‌ దూబే.. ఆఫ్ఘాన్‌తో జరుగుతున్న టీ20 సిరీస్‌లో మారుమోగిపోతున్న పేర్లు. ముఖ్యంగా ఆదివారం జరిగిన రెండో మ్యాచ్‌లో వీరిద్దరి బ్యాటింగ్‌ చూసి.. కోహ్లీ, రోహితే షాక్‌ అయ్యారు. ఇప్పుడు వారి కష్టానికి తగిన ఫలితం కూడా దక్కనుంది. అదేంటో ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 16, 2024 | 12:57 PMUpdated Jan 16, 2024 | 1:32 PM
జైస్వాల్‌, శివమ్‌ దూబే కష్టాన్ని గుర్తించిన BCCI..  ఇక నుంచి!

టీమిండియా యువ క్రికెటర్ల యశస్వి జైస్వాల్‌, శివమ్‌ దూబేలకు భారత క్రికెట్‌ బోర్డు శుభవార్త చెప్పనుంది. ప్రస్తుతం ఆఫ్ఘనిస్థాన్‌తో జరుగుతున్న మూడు టీ20ల సిరీస్‌లో ఈ ఇద్దరు ఆటగాళ్లు అదరగొడుతున్నారు. ముఖ్యంగా శివమ్‌ దూబే అయితే ఆకాశమే హద్దుగా చెలరేగిపోతున్నాడు. తొలి రెండు మ్యాచ్‌ల్లో వరుసగా హాఫ్‌ సెంచరీలు బాది.. సెన్సేషనల్‌ ఫామ్‌ను కనబరుస్తున్నాడు. అటు బ్యాటింగ్‌తో పాటు ఇటు బౌలింగ్‌ కూడా తన వంతు పాత్ర పోషిస్తున్నాడు. తొలి మ్యాచ్‌లో 40 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సులతో 60 పరుగులు చేసి టాప్‌ స్కోరర్‌గా నిలిచి దూబే.. ఒక వికెట్‌ కూడా పడగొట్టాడు. అలాగే ఆదివారం జరిగిన రెండో టీ20లో 32 బంతుల్లోనే 5 ఫోర్లు, 4 సిక్సులతో 63 పరుగులు చేసి అదరగొట్టాడు. అలాగే బౌలింగ్‌లో ఒక వికెట్‌ తీసుకున్నాడు. ఇలా ఆల్‌రౌండర్‌గా టీమ్‌లో మంచి ప్రదర్శన కనబరుస్తున్నాడు.

ఇక జైస్వాల్‌ తొలి మ్యాచ్‌ ఆడకపోయినా.. రెండో మ్యాచ్‌లో తన సత్తా ఏంటో చూపించాడు. తన ఓపెనింగ్‌ పార్ట్నర్‌ కెప్టెన్‌ రోహిత్‌ వర్మ డకౌట్‌ అయినా కూడా తాను ఏ మాత్రం భయపడకుండా.. కోహ్లీ, దూబేతో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలు నెలకొల్పాడు. కేవలం 34 బంతుల్లోనే 5 ఫోర్లు, 6 సిక్సులతో 68 పరుగులు చేసి దుమ్మురేపాడు. ముఖ్యంగా జైస్వాల్‌ సిక్సులు కొట్టే తీరు అందరిని ఆకట్టుకుంది. ఎలాంటి బౌలర్‌నైనా చాలా సులువుగా జైస్వాల్‌ భారీ సిక్సులు బాదాడు. జైస్వాల్‌ సిక్సులు కొడుతుంటే.. కోహ్లీ, రోహిత్‌ శర్మలు సైతం అలానే షాక్‌ అయి చూశారు. ఇలా ఈ ఇద్దరు కుర్రాళ్లు టీమిండియాలో ఫ్యూచర్‌ స్టార్లుగా ఎదుగుతున్నారు. వీరిద్దరికీ ఇప్పుడు బీసీసీఐ సైతం తన వంత మద్దతు ఇవ్వడానికి సిద్ధమైనట్లు సమాచారం.

జైస్వాల్‌, దూబేను సెంట్రల్‌ కాంట్రాక్ట్‌లోకి తీసుకోవాలని బీసీసీఐ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వచ్చే ఏడాది కాలం పాటు వీరిద్దరికి గ్రేడ్‌-సీ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మరి ఈ ఇద్దరు ఆటగాళ్లు సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ పొందితే.. టీ20 వరల్డ్‌ కప్‌ 2024 టీమ్‌లో ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం వీరి ముందున్న లక్ష్యం కూడా అదే. ఎలాగైనా టీ20 వరల్డ్‌ కప్‌ 2024 ఆడాలని యువ క్రికెటర్లంతా గట్టి పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే జైస్వాల్‌ పేరు వరల్డ్‌ కప్‌ టీమ్‌లో ఉండటం ఖరారే అయినా.. శివమ్‌ దూబే ఉంటాడా ఉండడా అనేది అనుమానం. ఎందుకంటే స్టార్‌ ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా ఫిట్‌ అయి తిరిగి వస్తే.. దూబేకు చోటు కష్టమే. మరి జైస్వాల్‌, దూబేలకు బీసీసీఐ సెంట్రల్‌ కాంట్రాక్ట్‌ ఇవ్వనుంది అని వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి