RCB ఆశలపై నీళ్లు.. CSKతో మ్యాచ్‌ జరగకపోవచ్చు!

RCB Vs CSK, Chinnaswamy Stadium: ఈ నెల 18న ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ ఒక నాకౌట్‌ మ్యాచ్‌ అని అంతా భావిస్తున్నారు. కానీ, ఈ మ్యాచ్‌ జరిగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

RCB Vs CSK, Chinnaswamy Stadium: ఈ నెల 18న ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ ఒక నాకౌట్‌ మ్యాచ్‌ అని అంతా భావిస్తున్నారు. కానీ, ఈ మ్యాచ్‌ జరిగే సూచనలు కనిపించడం లేదు. ఎందుకో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

ఐపీఎల్‌ 2024లో క్రికెట్‌ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న మ్యాచ్‌ చెన్నై సూపర్‌ కింగ్స్‌ వర్సెస్‌ రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు. ఈ ఫ్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే.. రెండు టీమ్స్‌కు కూడా ఈ మ్యాచ్‌ ఎంతో ముఖ్యం. 13 మ్యాచ్‌ల తర్వాత 14 పాయింట్లతో సీఎస్‌కే ప్రస్తుతం నాలుగో స్థానంలో ఉంది. అలాగే ఆర్సీబీ 13 మ్యాచ్‌ల్లో 12 పాయింట్లు సాధించి.. ఐదో ప్లేస్‌లో ఉంది. లక్నో ఒక మ్యాచ్‌ ఓడిపోతే.. ఆర్సీబీ, సీఎస్‌కే మ్యాచ్‌ నాకౌట్‌ మ్యాచ్‌లా మారుతుంది. సీఎస్‌కే కంటే కూడా ఆర్సీబీకి ఈ మ్యాచ్‌ ఎంతో ముఖ్యం. ప్లే ఆఫ్స్‌కు చేరాలంటే కచ్చితంగా భారీ తేడాతో గెలవాలి.

ప్రస్తుతం ఆర్సీబీ ఉన్న ఫామ్‌ దృష్ట్యా.. కచ్చితంగా గెలుస్తుందని ఆ జట్టు అభిమానులు బలంగా నమ్ముతున్నారు. అయితే.. వారిని ఆందోళనకు గురిచేసే ఒక వార్త ఒకటి తాజాగా బయటికి వచ్చింది. అదేంటంటే.. ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌కు వర్ష గండం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 18న ఆర్సీబీ వర్సెస్‌ సీఎస్‌కే మ్యాచ్‌ బెంగళూరులోని చిన్నస్వామి క్రికెట్‌ స్టేడియంలో జరగనుంది. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌ షెడ్యూల్‌ అయింది. కానీ, అదే రోజు బెంగళూరులో వర్షం వచ్చే సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

దీంతో.. క్రికెట్‌ అభిమానుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. ముఖ్యంగా ఆర్సీబీ ఫ్యాన్స్‌ అయితే కంగారు పడుతున్నారు. ప్లే ఆఫ్స్‌కు వెళ్లాలంటే సీఎస్‌కేపై కచ్చితంగా గెలిచి తీరాలి. అలా గెలవాలంటే.. మ్యాచ్‌ జరిగి తీరాలి. వర్షం వల్ల మ్యాచ్‌ రద్దు అయితే.. రెండు టీమ్స్‌కు చెరొక పాయింట్‌ లభిస్తుంది. అలా అయితే.. ఆర్సీబీ ఎలిమినేట్‌ అయినట్లే. మ్యాచ్‌ ఓడినా, మ్యాచ్‌ రద్దు అయినా ఆర్సీబీకే నష్టం. అందుకే వర్షం వచ్చి మ్యాచ్‌ రద్దు అయితే.. ఆర్సీబీ ఇంటికి వచ్చేస్తుంది. సీఎస్‌కే ప్లే ఆఫ్స్‌కు వెళ్తుంది.

Show comments